శుభకార్యాన్ని కూడా రాజకీయం చేస్తారా?

106

– మాపై తప్పుడు ప్రచారం చేయడం హేయం
– రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని శత్రువుగా చూడటం విచారకరం
– టీడీపీ లోకసభ ఎంపీలు, గల్లా జయదేవ్(గుంటూరు), కింజరాపు రామ్మోహన్ నాయుడు(శ్రీకాకుళం), కేశినేని నాని(విజయవాడ), టీడీపీ రాజ్యసభ ఎంపీ, కనకమేడల రవీంద్ర కుమార్(విజయవాడ) ప్రకటన

2 మార్చి 2022న న్యూఢిల్లీలోని DMK యొక్క కొత్త కార్యాలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి M K స్టాలిన్ ప్రారంభించారు. ఈ వేడుకను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలను వేడుకకు ఆహ్వానించారు.ఇది రాజకీయ కార్యక్రమం కాదు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం లాంటి శుభకార్యం.

మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక కుటుంబం కొత్త ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు వేడుకకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి వారితో ఆనందాన్ని పంచుకోవడం ఆనవాయితీ. అదే తరహాలో డీఎంకే అధినేత తాము నూతనంగా నిర్మించిన కార్యాలయంలోకి ప్రవేశించే కార్యక్రమానికి టీడీపీతో సహా అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించారు.

మన భారతీయ సంస్కృతికి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా వారికి మా శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము డిఎంకె కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళాం. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు.

సోషల్ మీడియాలో కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్న విధంగా ఈ పర్యటన రాజకీయపరమైనది కాదు.సాంప్రదాయ శుభకార్యంపై కూడా స్వార్థ రాజకీయాలు చేయడం విచారకరం.ఇటువంటి తప్పుడు వార్తలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, తప్పుడు రాజకీయాల కోసం శుభకార్యానికి రాజకీయాలు అంటగట్టడం దారుణం.

ఎవరి ఇంట శుభకార్యానికి పిలిచినా వెళ్లడం మన సంప్రదాయం! రాజకీయ వైరుధ్యాలున్నా వ్యక్తిగత స్థాయిలో ఒకరి ఇంట శుభకార్యాలయాలకు ఒకరు వెళ్లడం, వేర్వేరు పార్టీల్లో ఉన్నా స్నేహాన్ని కొనసాగించడమన్నది సంబంధిత నేతల రాజకీయ పరిణితికి, పరిపక్వతకు అద్దం పడుతుంది.
గతంలో ఎందరో కీలక నేతలు ఒకరి ఇంట శుభకార్యాలయాలకు మరొకరు వెళ్లిన సందర్భాలున్నాయి. తెలుగుదేశం పార్టీ గానీ, పార్టీ ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ నిబద్ధతతో స్వచ్చమైన రాజకీయాలు చేస్తామో తప్ప చాటుమాటు రాజకీయాలు చేయం.రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా ప్రతిపక్షాలను రాజకీయ ప్రత్యర్థులుగా కాక శత్రువులుగా భావిస్తూ సున్నితమైన అంశాలతో తప్పుడు రాజకీయాలు చేయడం దురదృష్టకరం.