Suryaa.co.in

Features

జారుముడి

ఇప్పటి ఆడపిల్లలకి మడి, ముడి అంటే తెలీదు గానీ, సాంప్రదాయంగా మహిళలు జడలు వేసుకొనే రోజుల్లో ఈ జారు ముడి బహు రంజుగా ఉండేది.

జుట్టు విప్పుకుని ఉండకూడదు, అలా అని తలంటు జుట్టు ముడి వేసుకోలేము. జడ కూడా కుదరదు. మధ్యేమార్గంగా ఈ జారుముడి వేసుకునేవారు. జుట్టు చిట్టచివరిలో వేసామా లేదా అన్నట్టు ఒక మెలిక తిప్పి ఉంచేవారు.

అటు విరబోతా కాదు, ఇటు పూర్తిగా వేసుకోకుండానూ కాదు. మధ్యేమార్గంగా ఓ సర్దుబాటు. మన సంబంధ బాంధవ్యాలలో కూడా బీగదీసుకుని, లింక్ కట్ అయ్యే సందర్భాలు వస్తూ వుంటాయి. వదిలేస్తే జారిపోతాయి, పట్టుకు వేళ్ళాడలేము. ఇగో కాదు గానీ, అది అంతే.

మరి ఈ పరిస్థితుల్లో “జారు ముడి కాన్సెప్ట్” ఉపయోగిస్తే?
అమోఘం. బంధాలు చెడిపోవు, మనసులు విడిపోవు, చక్కగా.
మాట పట్టింపులు తగ్గించి, ఎడమొహం పెడమొహంగా ఉండకుండా, కొంత సమయం కాలానికి వదిలేసి, పూసుకోనూవద్దు, రాసుకోనూవద్దు అనే జారు ముడి గానీ వెయ్యగలిగితే, పీటముడి బాధ ఉండదు.
ఏమంటారు?

– రాళ్లపల్లి

LEAVE A RESPONSE