Suryaa.co.in

Andhra Pradesh

జగన్,పవన్‌కే జనాదరణ

– వారిద్దరికే జనంలో ఇమేజ్
– పవన్‌ది సక్సెస్ స్టోరీ
– వైసీపీ మాజీ ఎమ్మల్యే కేతిరెడ్డి కితాబు

ధర్మవరం: “ఏపీలో ఇద్దరికే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. వీరు రాజకీయాల్లో జగన్, సినిమాల్లో పవన్ కల్యాణ్. వీరిద్దరూ వస్తే 10 నిమిషాల్లో 10 వేల మంది జనాలు పోగవుతా రు. వీరి మీద ప్రేమతో జనాలు వస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది అంతా మేనేజ్ మెంట్” అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.

హిందూపురంలో కాబట్టి బాలకృష్ణ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గుడివాడలో అయితే మూడుసార్లు గెలవలేరని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేస్తే, తిరుపతిలో గెలిచారని, సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారని అన్నారు. ‘‘రాజకీయాలు అంత ఈజీ కాదు. ఏదేమైనా పవన్‌కల్యాణ్‌ది మాత్రం సక్సెస్ స్టోరీనే’’ అని కేతిరెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE