13 కోట్లా ప్రజాధనంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్న జగన్మోహన్ ప్రభుత్వం … మీకు ఏమి మిగలని పక్షంలో మీరు పెట్రోల్, డీజిల్ ను GST పరిధిలోకి రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ సమాధానం చెప్పాలి ?
పెట్రోల్ , diesel ధరలు పెరిగేతే రాష్ట్ర ప్రభుత్వం విధించే tax ఆటోమేటిక్ గా పెరుగుతుంది, దానిని మీరు ఎందుకు తీసేవేయ్యారు ??
గత మన్మోహన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం చేసిన ..లక్షల కోట్ల పెట్రోల్ బాండ్స్ అప్పులు, ఇప్పటి కేంద్ర ప్రభుత్వం తీర్చాలి , మీరు మాత్రం ఆదాయం మాత్రమే తీసుకుంటారా ? అప్పుల్లో కూడా భాగం అడిగి తీర్చేయొచ్చుకదా జగన్మోహన్ గారు ?
కరోనా సమయంలో కేంద్రం 80 కోట్ల ప్రజలకు లబ్ది చేకూరేలా, 1 లక్ష కోట్లు రేషన్ వితరణ చేశారు. నరేంద్రమోదీ కేంద్ర ప్రభుత్వం, 100 కోట్ల ఉచిత వ్యాక్సిన్ మందులు పంపిణి చేసింది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కారోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమి చేసాడో ప్రజలకు వివరించాలి. కేంద్రం తీసుకున్న cess లో , కేంద్రం మీకువెనక్కి ఇచ్చే 42% డబ్బుల ప్రస్తావన ఎందుకు చెయ్యలేదో ?
నిన్నటి దినపత్రికలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన: తాము పెట్రోలు ధరలో ఆదాయం పెంచుకోలేదని, పూర్వపు ప్రభుత్వం విధించిన పన్ను శాతాన్ని కొనసాగించామని, కేవలం లీటర్ కు ఒక్కరూపాయి సెస్సు మాత్రం విధించామని చెప్పినారు.ఇక్కడే ఉంది తిరకాసు.
ఈ ప్రభుత్వం వచ్చినప్పటినుండి పెట్రోలు ధర లీటరుకు రు.35/- పెరిగింది.అంటే పెరిగిన రేటుద్వారా ప్రతి లిటరుకు పూర్వపు ప్రభూత్వానికి వచ్చిన ఆదాయంకన్నా, ఇప్పుడు దాదాపు(31%) రు.11/-అదనంగా ఆదాయం పెరిగింది. పెంచిన ఒక రూపాయితో కలిపి రు.12/-అదనపు ఆదాయం వస్తుంది. కనుక కేంద్రం తగ్గించిన రు.5/-తో కలిపి మొత్తం రు.17/-లు తగ్గించవచ్చు. అలా చేసినపుడు రాష్ట్రప్రభుత్వము ప్రస్తుతం పెట్రోలు ద్వారా పొందే ఆదాయం పూర్వపు ప్రభుత్వం పొందిన ఆదాయానికి సమానం గా ఉంటుంది.
కనుక రాష్ట్రప్రభుత్వం పెట్రోలు ప్రతిలీటర్ కు రు.17/-లు తగ్గించాలి. మీకు లెక్కలు రాకపోతే అది ప్రజలతప్పు కాదుగదా! మీకన్నా ప్రజలు మేధావులు. ఇంకా మోసం చేయవద్దు.
– అన్నం శ్రీనివాస్