Suryaa.co.in

Andhra Pradesh

తండ్రి రాజశేఖర రెడ్డినే కేసులో ఇరికించిన ఘనుడు జగన్!

– సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మంగళగిరి: జగన్ ని మాజీ ముఖ్యమంత్రి అని పిలవటానికి కూడా అర్హుడు కారు.. మాజీ ముఖ్యమంత్రి అనే పదానికి విలువ లేకుండా చేశారని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ది అతి క్రూర మనస్తత్వం. ఆయన తల్లి, చెల్లి కి ఆస్తుల పంపకాలపై ఎన్‌సీఎల్‌టీకి కంప్లైంట్ చేయడం దుర్మార్గం. ఓట్ల కోసం ‘‘నా తల్లి, నా తండ్రి, నా చెల్లి, నా అక్క’’ అంటారు. అవసరం తీరిపోయాక ఏరు దాటి తెప్ప తగలేసినట్లుగా వ్యవహరిస్తారు.

ఇంట్లో తల్లి, చెల్లితో ఆస్తుల విషయంలో ఒక నిర్ణయం తీసుకొని బయటికి వచ్చి మాట మార్చిన వ్యక్తి జగన్. తల్లిని, చెల్లిని రాజకీయంగా సరెండర్ కావాలంటున్నారు. రాజకీయాలకు, ఆస్తులకు సంబంధంలేదు. కోటానుకోట్ల సంపద ఉన్నా.. తల్లికి, చెల్లికి ఇవ్వడానికి జగన్మోహన రెడ్డికి మనసు అంగీకరించకపోవడం బాధాకరం. అసలు జగన్ వద్ద ఉన్న ఆస్తి అంతా ప్రజల ఆస్తి. సరస్వతి పవర్ కంపెనీకి వైఎస్ 2009 లో 600 హెక్టార్లకి పైగా క్వారీలని కట్టబెట్టారు. సరస్వతి పవర్ అనే కంపెనీని పెట్టాలని బోర్డు రిజల్యూషన్ రాకముందే, వైఎస్ ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. 2015 వ సంవత్సరం వరకు కూడా భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ పనులని ప్రారంభించలేదు.

చట్టప్రకారం పరిశ్రమకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే రెండేళ్లలో పని మొదలుపెట్టాలి. అవసరమైతే ఆరు నెలలు పొడగిస్తారు. అంతకు మించి గడువివ్వరు. అయితే రాజశేఖర్ రెడ్డి హయాంలో భూమి కేటాయించి ఆరేళ్ళు గడచినా పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. కానీ జగన్ తాను సీఎంగా ఉండగా ఈ భూముల మీద లీజుని 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకి పెంచుకున్నారు.

ఈ కంపెనీలకు సంబంధించిన కేసుల విషయంలో మాత్రం సీబీఐ ఈడీకి సుప్రీం కోర్టు దాక వెళ్లి ఇది నాకు సంబంధం లేదు, మా తండ్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధం అనేశారు. తండ్రి రాజశేఖర రెడ్డినే కేసులో ఇరికించిన ఘనుడు జగన్. జగన్ నిర్వాకం వల్లే రాజశేఖర రెడ్డి సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడు అయ్యాడు. జగన్ క్రూర మనస్తత్వానికి ఇవి ఉదాహరణలు అని అన్నారు.

ఆటో కుదవ పెట్టి మా చెల్లి పెళ్లిచేశానని కొందరు పేదలు చెప్పుకుంటుంటారు. అక్క, చెల్లెళ్ళ పట్ల అలాంటి ప్రేమ చూపిస్తారు తప్ప తల్లి, చెల్లికే నోటీసులు ఇప్పించాడంటే జగన్ మామూలోడు కాదు. దేశంలో ప్రజల ఆస్తుల్ని సొంతానికి కూడగట్టుకున్నవారిలో జగన్మోహన్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. తల్లి, చెల్లిని బ్లాక్ మెయిల్ చేయడం సబబుకాదు. చిన్నాన్ననే పొట్టన పెట్టుకున్న కిరాతకుడు జగన్. తల్లి ఆవేదన అర్థంకాని వ్యక్తి జగన్. మంచి కొడుకు అని అనుకొని మోసపోయాం అని తల్లే అనడం ఎక్కడైనా ఉంటుందా? శవాలతో రాజకీయం చేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. చిన్నాన్న విషయంతో అది నిర్ధారణ అయిందని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రజల్ని మోసం చేయొద్దు, శవాల వద్దకు రావద్దని జనం ఛీ కొడుతున్నా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావడం లేదు. బెంగళూరు ప్యాలస్ లో కూర్చొని జగన్ కాంగ్రెస్ తో మంతనాలు జరుపుతున్నారని బయటికొచ్చింది. కేంద్రం ఎక్కడ కన్నెర్ర చేసి తనను జైల్లో పెట్టిస్తుందో అనే భయం కూడా జగన్ ను వెంటాడుతోంది. నాటకాలరాయుడు జగన్ రెడ్డి కాంగ్రెస్ తో తనకు విభేదాలున్నాయని నాటకమాడుతున్నారు. 2009 నుంచి 2015 వరకు ప్రారంభించని పరిశ్రమకు భూముల లీజుని 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకి ఎందుకు పెంచుకున్నారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆరేళ్ళపాటు ప్రారంభం కాని పరిశ్రమకు ప్రభుత్వ సొమ్ము ఎందుకు ధారాదత్తం చేయాలి? ఎందుకు క్యాన్సిల్ చేయలేదో తేలాలి. సరస్వతి పవర్ ను మూడు భాగాలు చేయాలి.

ఒక భాగం జగన్ కు, ఒక భాగం షర్మిలకు తల్లికి, ఒక భాగం గ్రామస్థులకి ఇవ్వాలి. సరస్వతి భూములు పేదలవి. దానికి జగన్మోహన్ రెడ్డి ఎన్‌సీఎల్‌టీకి కంప్లైంట్ చేయడమేంటి? ఏ తల్లి అయినా తన బిడ్డలను సమానంగా చూస్తుంది. కాని జగన్ చేష్టలకు విజయమ్మ భరించలేక కొడుకును కాదని కూతురు వైపు మొగ్గు చూపింది. జగన్ దుర్మార్గాల గురించి వాసిరెడ్డి పద్మ స్వయంగా చెప్పారు. అనేక మంది జగన్ పద్దతులు నచ్చక వైసీపీని వదిలేస్తున్నారు. టీడీపీ వారెవరూ పార్టీకి అప్రతిష్ఠ తేలేదు. తాము గెలిచినా, ఓడినా జనం కోసం బతికామని జగన్ లాగ ధనం కోసం బతకలేదని దుయ్యబట్టారు.

LEAVE A RESPONSE