– జగన్ పుట్టినప్పుడే విజయమ్మ గొంతు నులిమి చంపేస్తే పీడ పోయేది
– దమ్ము, ధైర్యం ఉంటే జగన్ అమరావతిలో పర్యటించాలి
– జగన్‌కు మెంటల్.. నేను చికిత్స చేయిస్తా
– మహిళలు వేసుకున్నవి గాజులు కాదు.. విష్ణు చక్రాలు
– సాక్షి పేపర్, చానెల్‌ను మూసేయాలి
-ప్రెస్ కౌన్సిల్‌కు లేఖ రాస్తా
– సాక్షి ఎలా నడుస్తుందో చూస్తా
– కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ‘‘జగన్ వెధవన్నర వెధవ.జగన్ పుట్టినప్పుడే విజయమ్మ గొంతు నులిమి చంపేస్తే పీడ పోయేది. జగన్ రెడ్డికి మానసిక చికిత్సను తాను ఉచితంగా చేయిస్తా. జగన్ తీరు దున్నపోతు మీద వాన పడిన చందమే.జగన్ బతుకేంటో తనకు తెలుసు’’నని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాక్షి మీడియాలో అమరావతి మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భౌతిక కాయానికి ఇంకా అంత్యక్రియలు కూడా జరగకుండానే, అధికార దాహంతో సంతకాలు సేకరణ వైఎస్ జగన్ చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన కుటుంబ సభ్యులను కామెంట్ చేస్తే, ఎలా వ్యవహరించారో అందరు చూశారు. మరి బయట వాళ్లను మాటలు అంటే ఎందుకు స్పందించడం లేదని రేణుకా చౌదరి ప్రశ్నించారు.
అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఎవరైనా తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు. ఖండిస్తారని స్పష్టం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే అమరావతిలో పర్యటించాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రేణుకా చౌదరి సవాల్ విసిరారు. మహిళలను అతి తక్కువ అంచనా వేశారని, దీనిని త్వరలో తానే నిరూపిస్తాన్నారు.
సాక్షి పేపరు, టీవీని మూసివేయాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. మీడియా ఎలా నడుస్తుందో చూస్తానన్నారు. వైసీపీ మీడియాలోని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు జర్నలిస్టులా అంటూ సందేహం వ్యక్తం చేశారు. మహిళలు వేసుకున్నవి గాజులు కాదని, విష్ణు చక్రాలని ఆమె అభివర్ణించారు.