– కమ్మ వాళ్ళను కమ్మవాళ్ళ చేతే తిట్టించారు
– కమ్మ వారిపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారు
– జగన్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు
– లక్ష్మీ నారాయణ తల్లికి టిడిపి సభ్యత్వం ఉంది
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు : నాగమల్లేశ్వరావు ఎందుకు చనిపోయాడో నేను జగన్ పర్యటనకు ముందే చెప్పాను. జగన్ పల్నాడుపై యుద్ధం ప్రకటించి వెళ్ళినట్లు ఉంది. ఓదార్పుకు వెళ్ళినట్లు లేదు. గజమాలలు, సన్మానాలు ఒక పక్క, చంపుతాం, నరుకుతాం అంటూ మరో పక్క ప్లకార్డ్స్ పెట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
ఈ మేరకు ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడారు. జగన్ ది రాక్షస పాలన అని గతంలోనే చెప్పాను. ఇప్పటికి జగన్ లో మార్పు రాలేదు. రెంటపాళ్ళ గ్రామంలో పరామర్శ నిర్వహించడానికి అక్కడ ఇరుకు రోడ్ల నేపథ్యంలో పోలీసులు అనుమతి ఇవ్వకున్నా నిబంధనలు పక్కనపెట్టి అక్కడ సభ నిర్వహించి ఇద్దరు ప్రాణాలు పోవడానికి జగన్ రెడ్డి కారకుడయ్యారని ఎమ్మెల్యే ఆరోపించారు.
నూటికి నూరు పాళ్ళు నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు జగనే కారణం. నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు పోలీస్ వేధింపులనేది అసత్యం. పెద నెమలిపురికి చెందిన లక్ష్మీ నారాయణ కూడా అప్పులు బాధ తాళలేక సూసైడ్ అటెంప్ట్ చేశారు. లక్ష్మీ నారాయణ తల్లికి టిడిపి సభ్యత్వం ఉంది. అరాచక ర్యాలీ పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. జగన్ రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను బయటకు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
రాజారెడ్డి రాజ్యాంగ అమల్లోకి వస్తుంది… అడ్డొచ్చిన వారిని రప్పా రప్పా నరుక్కుంటూ పోతాం అంటూ ప్లకార్డులతో ర్యాలీలు చేపట్టడం జగన్ రెడ్డి క్రిమినల్ ఐడియాలజీకి నిదర్శనం కాదా? జగన్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. వైసీపీ నాయకులు బారికేడ్లను తొలగించి నిబంధనలు ఉల్లంఘించారు. నిన్న ఇద్దరి మృతికి జగనే బాధ్యత వహించాలి. ఏడాది క్రితం చనిపోయిన వారిని పరామర్శిస్తారు. కానీ ర్యాలీలో చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పలకరించే సమయం లేదు జగన్ కు.
కమ్మ సామాజిక వర్గం గురించి మొసలి కన్నీరు కార్చారు. కమ్మ నాయకులను ఏవిధంగా వాడుకున్నావో అందరికీ తెలుసు. కమ్మ వాళ్ళ అనుభవిస్తున్న దానికి జగన్ పైశాచిక ప్రవర్తనే కారణం. సైకో కళ్ళలో ఆనందం కోసం కమ్మ వాళ్ళను కమ్మవాళ్ళ చేతే తిట్టించారు. అసెంబ్లీని కౌరవ సభ చేశారు.
కమ్మ వాళ్ళ మీద ఉన్న ద్వేషంతో జగన్ మా ప్రాంతాన్ని సర్వనాశనం చేశారు. అమరావతిని సర్వనాశనం చేశారు. కమ్మ వాళ్ళపై ద్వేషమే 2024లో శాపమై చుట్టుకుంది. అబద్దపు మాటలను ప్రజల నమ్మే పరిస్థితిలో లేరు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా డ్రామాలు వేసినా ప్రజలు పట్టించుకోరు. కమ్మ వారిపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారు.