హిందూ మత పరిరక్షకుడు చంద్రబాబు
తిరుమల దేవస్థాన పవిత్రతకు వైకాపా ప్రభుత్వం భంగం కల్పిస్తుంది
అన్యమతస్తులకు ప్రధాన బాధ్యతలు అప్పగించి తిరుమల సాంప్రదాయాలను మంట కలిపారు
– తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వినర్ బుచ్చి రాంప్రసాద్
ఎన్నడూ లేని విధంగా వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దేవాళయాలపై దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వినర్ బుచ్చి రాంప్రసాద్ ధ్వజమెత్తారు. ఆదివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ…”జగన్ మోహన్ రెడ్డి అర్జునుడని చెప్పుకుంటున్నాడు. కానీ అతను అసురుడు. హిందూ మత ద్వేషి. తిరుమలో కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్టేట్ మెంట్ విడుదల చేశారు.
వెంటనే ఆయన మీద కేసు నమోదు చేశారు. నేను ఆ స్టేట్ మెంట్ ఇవ్వలేదని రమణ దీక్షితులను భయపెట్టి చెప్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంచం కింద ఓ పింక్ డైమెండ్ ఉందని రమణ దీక్షితులు ఆరోపించారు. అయినా ఏనాడు వారిపై చంద్రబాబు గారు కేసు పెట్టలేదు. ఎందుకంటే వాస్తవాలు, అవాస్తవాలు ప్రజలకు తెలుసు కాబట్టి.
తిరుమలకు భంగం కలగకూడదు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా మాట్లాడినా పట్టించుకోవద్దని దిశా నిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇప్పటి వరకు మా దగ్గర పింక్ డైమెండ్ ఉందని ఆరోపించారు. ఇప్పటి వరకు దానిని బయటకు తీయలేకపోయారు. అసలు పింక డైమండ్ అనేది లేదు గనుక వారు బయటకు తీయలేకపోయారు. రమణ దీక్షితులు ఎన్ని ఆరోపణలు చేసినా తిరుమల ప్రతిష్టతకు ఎటువంటి భంగం కలుగ కూడదనే మంచి మనస్సుతో రమణ దీక్షితులుపై కేసు పెట్టలేదు.
కానీ ఈ ప్రభుత్వం మాత్రం నిజంగా రమణ దీక్షితులు అన్నారో లేదో తెలయకుండానే ఆయనపై కేసు నమోదు చేశారు. శ్రీశైలం భ్రమరాంభిక అమ్మవారి ప్రసాదంలో ఎముకలు వచ్చాయి. తిరుపతి, మానస్ ట్రస్ట్ ఆస్తులపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై జగన్ రెడ్డికి లేదు. హిందూ మతం మీద విశ్వాసంలేని వ్యక్తులకు ప్రధాన బాధ్యతలు అప్పగించారు. నువ్వు హిందూవా! కాదా! అని అడిగితే సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయే వ్యక్తి కరుణాకర్ రెడ్డి.
దేశంలో దేవాలయాలపై దాడులు ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో వైకాపా పాలనలో జరిగాయి. హిందూ మతంపై గౌరవం లేని వ్యక్తి జగన్ రెడ్డి. అంతర్వేది, ఇంద్రకీలాద్రిలో వెండి సింహాలు, ఇలా ఎన్నో దేవాలయాల్లో దోపిడీలు, ఆలయాలపై దాడులు జరిగినా ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదు. మరో 40 రోజుల్లొ ఎన్నికలు రాబోతున్నాయి. హిందూ మతాన్ని గౌరవించి, హిందూ మతాన్ని పరిరక్షించే చంద్రబాబు గారికి మనం ఓటు వేసి జగనాసురుడిని రాష్ట్రం నుంచి తరిమేద్దాం” అని పిలుపునిచ్చారు.