-
9 రోజులు అవిశ్రాంతంగా పనిచేసిన సీఎం ఇంటికి చేరుకున్నారు
-
సర్కారు సహాయక చర్యలను లోకం చూసింది
-
జగన్ లక్ష్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే..
-
భారతీరెడ్డిది రాత.. జగన్ రెడ్డిది కూత..
-
మీరు వ్యాపార భాగస్వాములా..?
-
నేను రాజీనామా చేస్తా… మీరూ చేయండి
-
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సవాల్
మంగళగిరి: వరదలపై జగన్ బురద రాజకీయం చేయడం సిగ్గుచేటని తిరువూరు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విజయవాడ ప్రజలు వరదతో అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు వారికి అండగా ఉండేందుకు తొమ్మిది రోజులు పగలు, రాత్రి తేడా లేకుండా వారి మధ్యనే ఉంటూ వారిలో భరోసా నింపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నే సీఎంఓగా మార్చుకుని వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముంపునకు గురైన ప్రాంతాలన్నీ తెరుకున్న తరువాత మంగళవారం ఇంటి చేరుకున్నారు.
జగన్ బయటకు వచ్చారు…
మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించేందుకు బుధవారం ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. జగన్ రెడ్డి బయటకు రావడం కూడా ఒక వార్తే. దాదాపు పది రోజుల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వరద బీభత్సం, ప్రజల ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పునరావాస కార్యక్రమాలు ఇవ్వన్ని దేశంతో పాటు ప్రపంచం మొత్తం చూస్తుంది. కానీ, ప్రజలు విషాదంలో సమయంలో, ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో మొక్కుబడిగా ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుని వచ్చి కనిపించి వెళ్ళిపోయారు. మరి ఈ రోజు మందిని వెంట వేసుకుని తీవ్రమైన కేసులో గుంటూరు సబ్ జైలులో ఉన్న సురేష్ ను పరామర్శించేందుకు జగన్ బయటకు వచ్చారు. వాస్తవానికి జైలులో ఉన్న తమ సొంత మనుషులను లేదా తమకు బాగా కావాల్సిన వారిని జైలులో పరామర్శించడం వైఎస్ కుటుంబ సాంప్రదాయం. మూడో తరంలో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో నందిగం సురేష్ ను పరామర్శించారు.
వరద బాధితులకు మొక్కుబడిగా పరామర్శ
విజయవాడ వరద బాధితులు కష్టాల్లో ఉంటే జగన్ రెడ్డి మొక్కుబడిగా పరామర్శించారు. నందిగం సురేష్ ను పరామర్శించేందుకు మాత్రం వ్యక్తిగత ఎజెండాతో వెళ్లారు. ఈ రెండిటి మధ్య జగన్ మోహన్ రెడ్డి మనిషా..? మానవత్వం ఉందా..? లేదా..? అనేది ఈ సమాజం ఆలోచించాల్సిన సంఘటన ఒకటి జరుగుతుంది.
కొన్నేళ్ళుగా జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో నాయకత్వం లేని ఒక దశలో పులివెందుల వ్యవహారాలు చూస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారు. జైలుకు వెళ్తారు.. పార్టీని ఎవరూ నడుపుతారు..? అన్న సమయంలో వైఎస్ కుటుంబం అంతా కలిసి ఒక యువకుడిని తెర మీదకు తీసుకువచ్చింది. ఆ యువకుడి పేరు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి. ఈయన జగన్ మోహన్ రెడ్డికి పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు. ఈ వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి కోసం పనిచేసి రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి. ఇప్పుడు ఎక్కడ కనపడని పరిస్థితి. జగన్ రెడ్డికి తమ్ముడి వరుస అయ్యే అభిషేక్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
హైదరాబాద్ న్యూరో హాస్పటల్ లో ఐదు రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా..? అబద్దమా..? అభిషేక్ రెడ్డికి పరిస్థితి అలా ఉంటే నువ్వు కానీ.. భారతి రెడ్డి కానీ పరామర్శించిన దాఖాలాలు ఉన్నాయా..? విజయవాడ వరద బాధితుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే లక్ష్యంతోనే వచ్చావ్.. అలాగే నందిగం సురేష్ విషయంలో అమరావతి విధ్వంసంలో కానీ, ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేసే కుట్రలో కానీ నువ్వు రూపొందించిన ఒక నేర ప్రణాళికను అమలు చేసే నీ భాగస్వామి అయిన నందిగం సురేష్ కోసమే బయటకు వచ్చావ్… కుటుంబ సభ్యుడు కోమా ఉంటే జగన్ రెడ్డి కానీ… భారతీ రెడ్డి కానీ… ఎందుకు వెళ్లలేదు? దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
భారతి రాత.. జగన్ రెడ్డి కూత..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీరి పని ఏంటంటే భారతి రెడ్డిది రాత.. జగన్ రెడ్డిది కూత.. అన్న చందంగా నడుస్తోంది. భారతి రాస్తుంది.. జగన్ రెడ్డి కూస్తారు.. ఈ తరహాలోనే వారి అనుకూల పత్రికలో ప్రకాశం బ్యారేజీ పిల్లర్ ను ఢీ కొట్టిన బోటు యజమాని వక్కలగడ్డ ఉషాద్రి లోకేష్ సన్నిహితుడు అని రాసుకున్నారు. ఉషాద్రి లోకేష్ ఎందుకు కలిశారంటే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రజా దర్భార్ నిర్వహిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ఆ సమస్యల పరిష్కరం కోసం అందరిని కలుస్తున్నారు. ప్రజాదర్బర్ లో ఎవరైన రావొచ్చు.. అందరూ వస్తున్నారు.. దానికి సాక్ష్యం ఏంటంటే ఈ బోట్ల యజమాని అయిన ఉషాద్రి ప్రజా దర్బార్ లో లోకేష్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. పడవల తాలుకా సమస్య తెలియజేసి వెళ్లారు. ఆ ఫోటోను వాడుకుని భారతి రెడ్డి రాస్తారు.. జగన్ రెడ్డి కూస్తారు.
మీరు వ్యాపార భాగస్వాములా..?
కుటుంబ సభ్యుల్లో మీ కోసం పనిచేసిన ఒకరు హాస్పిటల్ మంచంపై చావు బతుకుల్లో ఉన్నప్పుడు పరామర్శించలేదు. మీరు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా.. లేదా డబ్బే లక్ష్యంగా పని చేస్తారా? అసలు మీరు వ్యాపార భాగస్వాములా..? అర్థం కావట్లేదు..
ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి
సాధారణంగా ఒక నాయకుడు శాసనసభలోనో.. పార్లమెంటులోనో సభ్యుడై ఉన్నప్పుడు ప్రజా సమస్యలను శాసనసభ వేదికగా మాట్లాడేందుకు ప్రయత్నించి ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారు. గత అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు జైలు దగ్గర సందర్భంతో పని లేకుండా చేయూత గురించి, రకరకాల పథకాల గురించి మాట్లాడారు. ఈ పథకాలన్నిటికీ సంబంధించి శాసన సభలో దాదాపు అన్ని విషయాల మీద మా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. చర్చకు అవకాశం కూడా ఇచ్చింది. ఆ రోజు పారిపోయి.. ఈ రోజు నాలుగు పేపర్లు పట్టుకుని ఆ పథకం ఇవ్వలేదు.. ఈ పథకం ఇవ్వలేదు.. అంటూ మాట్లాడుతున్నారు.
నేను రాజీనామా చేస్తా… మీరూ చేయండి
మా ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడు నెలల్లోనే నిజంగా మీరు అనుకున్నట్టు మా ప్రభుత్వానికి, మా కూటమికి ఈ ప్రజలు ఇచ్చిన చరిత్రలో నిలిచిపోయిన తీర్పును పట్ల ఏమైనా అనుమానం ఉంటే తిరువూరు ఎమ్మెల్యేగా ఎన్నికైనా నేను రాజీనామా చేస్తా.. పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికైనా నువ్వు రాజీనామా చేయి.. మళ్ళీ పోటీ చేద్దాం.. ప్రజామద్దతు, ప్రజల అమోదం ఎవరికి ఉందో ప్రజలనే అడుగుదాం.
పత్రిక ఉందని, చానల్ ఉందని, 24 గంటలు అబద్దాలతో పబ్బం గడిపే నాయకులు ఉన్నారని ఇష్టం వచ్చినట్లు రాయటం, మాట్లాడడం జరిగితే చట్ట పరిధిలో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. జగన్ రెడ్డి రాజకీయ నాటకాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు.
వరద బాధితుల పరామర్శకు సమయం కేటాయించని జగన్ రెడ్డి, కుటుంబ సభ్యుడు అభిషేక్ రెడ్డి ఐదు రోజులుగా చావుబతుకుల్లో ఉంటే అటూ వైపు కూడా చూడని భారతి, జగన్ రెడ్డిలు నందిగం సురేష్ కోసం జైలు వరకు వెళ్ళారంటే రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు, ప్రణాళికలు ఏంటో తెలుస్తుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మ్మెల్యే కొలికపూడి కోరారు.