మద్యపాన నిషేదం పై జగన్ రెడ్డి మాట తప్పి మహిళలను మోసం చేశారు

Spread the love

-నరసరావుపేట పార్లమెంట్ మహిళ నాయకులు

నరసరావుపేట పట్టణంలో స్థానిక గుంటూరు రోడ్డు నందు తెలుగు మహిళా నేతల ఆధ్వర్యంలో మద్యం సీసాలు పగలగొట్టి వినూత్న నిరసన చేశారు. మద్యం సీసాలు ధ్వంసం చేసి ముఖ్యమంత్రి జగన్ కి,మహిళా ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మాట్లాడుతూ మద్యపాన నిషేధంపై జగన్ రెడ్డి మాట తప్పి మహిళలను మోసం చేశారని కేవలం కమిషన్ల కోసం కక్కుర్తి పడి మహిళల తాళిబొట్టులతో

చెలగాటమాడుతున్నారని అన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని మహిళల తలలు నిమిరి,బుగ్గలు రుద్ది మరి చెప్పి అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం చేయకపోగా దేశంలో ఎక్కడా లేని కల్తీ బ్రాండ్ తెచ్చి మహిళల తాళిబొట్లుతో చెలగాటం ఆడుతున్నారని నరసరావుపేట పార్లమెంట్ తెలుగు మహిళా నేతలు మండిపడ్డారు.

మద్యపానం నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి మద్యం పై టార్గెట్లు విధించి మరి అమ్మటం సిగ్గుచేటన్నారు.జగన్ రెడ్డి తెచ్చిన నకిలీ బ్రాండ్ తాగిన వారు కిడ్నీ వ్యాధులు,కడుపులో మంటతో తదితర వ్యాధులతో బాధపడుతూ చనిపోతున్నారు అని వారి కుటుంబ సభ్యులు అనాధలుగా మారిపోతున్నారని అన్నారు.నకలి బ్రాండ్లు వెంటనే నిషేధించాలి లేకపోతే అన్ని షాపులో సీసాలు పగలగోడతాం అని హెచ్చరించారు.

జగన్ రెడ్డి కమీషన్ల కోసం కాకుండా ప్రజల ప్రాణాల కోసం ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే మద్యపాన నిషేధం అమలు చేయాలి లేకపోతే మహిళలు రాష్ట్రంలో వైసీపీ ని పూర్తిగా నిషేధిస్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధికార ప్రతినిధి మనుకొండ జాహ్నవి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిమినేని వందనదేవి, నరసరావుపేట పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయ్ శ్రీ,ప్రధాన కార్యదర్శి గంగినేని లీలావతి,అధికార ప్రతినిధి కనుమూరి లక్ష్మి పట్టణ మహిళా అధ్యక్షురాలు కదం నగజ్యోతి,మహిళా కార్యదర్శి బిందు ప్రియ,రాజేశ్వరి,సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply