స్వప్రయోజనాల కోసమే ప్రధానిని జగన్ రెడ్డి కలిశారు

-ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని మీడియాకు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో జగన్ ఉండడం సిగ్గు చేటు
-బాబాయి హత్య నిందుతులను కాపాడుటకు సీఎం.. పీఎంను కలిశారు
– డర్టీ ఎంపీని కాపాడేందుకు, రూ.20వేల కోట్ల బీచ్ శాండ్ అవినీతి నుండి బయట పడేందుకే జగన్.. ప్రధాని కాళ్లావేళ్లా పడుతున్నాడు
– స్వప్రయోజనాలకోసం ప్రధానిని జగన్ రెడ్డి కలిశారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకోసం కాదు
– మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని మీడియాకు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో జగన్ ఉండడం సిగ్గు చేటని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మంగళవారం జూమ్ మీటింగ్ ద్వారా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్ట్ కు తాత్కాలిక సాయం అందించమని ఢిల్లీలో ప్రధానికి ముఖ్యమంత్రి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆ సమాచారాన్ని వాట్సప్ ద్వారా పత్రికలకు విడుదల చేశారు. సీఎం స్వయంగా పత్రికలకు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి ఎన్ని సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా, ప్రధాన మంత్రికి ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా రాష్ట్రానికి ఒనగూరే ఉపయోగం శూన్యం.
చంద్రబాబు హయాంలో 2019 ఫిబ్రవరి న టెక్నికల్ ఎడ్వైజరీ కమిటీ రిపోర్టులో డిపిఆర్ లో రూ. 55,548 కోట్లతో పోలవరానికి ఆమోదం తీసుకొచ్చారు. 72 శాతం పనులు పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశానికి బస్సులను ఏర్పాటుచేసి, భోజన వసతి కల్పించి ప్రజలు, మీడియాకి ఇబ్బందులు లేకుండా సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు.
సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అథారటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు రూ.4,500 కోట్ల ఖర్చుతో ఒప్పందం కుదుర్చుకొని కేంద్ర ప్రభుత్వం డయా ఫ్రం వాల్ నిర్మాణానికి రియింబర్స్ మెంట్ ఇచ్చింది.

ఆ నిధులు ఏమయ్యాయి?
31మంది ఎంపీలను పెట్టుకున్న జగన్ రెడ్డి గడ్డి పీకుతున్నాడా? రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన హక్కైన పోలవరాన్ని జగన్ రెడ్డి భ్రష్టు పట్టించాడు. స్వప్రయోజనాల కోసం, డర్టీ ఎంపీ మాధవ్ ని కాపాడటానికి రాష్ట్ర ప్రయోజనాలని, పోలవరాన్ని తాకట్టు పెట్టారు. పోలవరం నిర్వాసితులకు అందించిన సహాయ సహకారాలు శూన్యం. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిన 4వేల 500 కోట్లు ఏం చేశారు. వాటిలో నిర్వాసితులకి ఒక్క రూపాయి అయిన ఖర్చు పెట్టారా? పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేశారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళడానికి అనుమతులు దేనికి?

లోయర్ కాపర్ డ్యాం మధ్యలో నీళ్ళు నిలబడేలా చేసి లోయర్ కాపర్ డ్యాం నాశనానికి పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో చేసిన పనులకి వచ్చిన రియింబర్స్ ని పోలవరానికి, నిర్వాసితులకి కాకుండా లిక్కర్ కంపెనీలకి అడ్వాన్స్ లు ఇచ్చుకోవడం దుర్మార్గం. ప్రధానిని పదే పదే కలిసి వినతిపత్రాలు ఇవ్వడమే కాని ఒక్క రూపాయి తెచ్చింది లేదు. విభజన చట్టంలోని హామీలకై పోరాడటంలేదు. 31 మంది ఎంపీలు ఉన్నా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్, ప్రధాని మంత్రి కార్యాలయంపై నిధుల కోసం ఒత్తిడి తీసుకురావడం లేదు.

బాబాయి హత్య కేసులో నిందుతులను కాపాడటానికి, కుటుంబ సభ్యులని అరెస్ట్ చేయకుండా ఉండటానికి, డర్టీ ఎంపీని కాపాడుకోవటానికి, 20వేల కోట్ల బీచ్ సాండ్ అవినీతి నుండి బయటపడటానికి ప్రధాని మంత్రిని జగన్ రెడ్డి కలిశారే తప్ప దేశ ప్రయోజనాలకోసం కాదు. 8వందల కోట్లు డయా ఫ్రం వాల్ కి, 2వేల కోట్లు నీళ్లు ఎత్తి పోయడానికి కావాలని చేతకాని కబుర్లు చెబుతున్నారు.

ప్రాజెక్టు నిర్మాణ పనులు అటెకెక్కనున్నాయని అధికారులు హెచ్చరించినా పనులని ముందుకు తీసుకెళ్ళడం లేదని మద్రాస్ ఐఐటి వారు నివేదికలో తేల్చారు. ఒక ప్రణాళిక లేదు, ప్రభుత్వ అసమర్ధత, నిర్వాహణ లోపం, సరైన సమయంలో నిధులు విడుదల చేయకపోవడం, ఎజెన్సీల మధ్య సమన్వయం లేకపోవడం, రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం ఇరిగేషన్ కి ఈ దుస్థితి పట్టిందని 124 పేజీల నివేదిక మద్రాస్ ఐఐటి వారు రాష్ట్ర ప్రజలకి, కేంద్ర ప్రభుత్వానికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటికి వాస్తవాలని తెలియ పరిచారు.

రివర్స్ టెండరింగ్ కి వెళ్లొద్దని పిపిఏ స్పష్టంగా చెప్పినా వినలేదు. ఒకవేళ వెళితే రాబోయే రోజులలో ఏ అనర్థాలు వచ్చినా గత కాంట్రాక్టర్ ని, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ ని అడగాలి. మీరు తీసుకున్న నిర్ణయాలు అన్ని కూడ నిజనిర్ధారణ లో పెట్టండి. ఎమర్జెన్సీ మీటింగ్ లో మినిట్స్ కి పంపించాలి.

నిజానిజాలను ప్రజల ముందుకు తెస్తున్న మీడియా, చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద ఆడిపోసుకోవడం తప్ప జగన్ రెడ్డి పరిపాలన చేసింది శూన్యం. జగన్ రెడ్డి సొంత నిర్ణాయాలకు పోలవరం బలైంది. పోలవరం నిర్వాసితులని ఉద్దరించే ఉద్దేశం జగన్ రెడ్డికి ఏకోశాన లేదు. పోలవరం పనులను గాలికి వదిలేశారు. సంబంధిత అధికారులు ఎన్ని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్ రెడ్డి బంధువు పీటర్ అనే వ్యక్తితో వేల కోట్ల అక్రమాలు జరిగాయని జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడాడు.

పవర్ ప్రాజెక్ట్ ని కొట్టేయడానికే ఈ డ్రామా అడాడనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రానికి గోదావరి నీరు తెస్తానని కాకమ్మ కబుర్లు చెప్పి తేలేదు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రులతో బిరియానీ మీటింగ్ లు పెట్టి ఆనందించడం తప్ప రాష్ట్రానికి తెచ్చేదేమీలేదు. పోలవరాన్ని సంకనాకించారు. చంద్రబాబు పోలవరాన్ని సోమవరంగా మార్చి 40 సార్లు పోలవరం సందర్శనకు వెళ్లి పోలవరం పనులను పరిగెత్తించారు. పోలవరాన్ని సోమవరంగా మారిస్తే ఎగతాళి చేశారు. జగన్ పోలవరానికి ఏం చేశారో తెలపాలి. నెలకొకసారి కూడా పోలవరం పై సమీక్షలు జరపలేదు. ఇది నా ఒక్కడి మాట కాదు.. 5వేల కోట్ల మంది గుండెచప్పుడు.

లక్షా 5వేల కోట్ల గిరిజన, గిరిజనేతర కుటుంబాల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు నీళ్లల్లో కొట్టుకుపోయాయి. వారు అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో తలదాచుకుంటున్నారు. వారికి తినడానికి తిండి లేదు. వారికి ఇస్తానన్న ప్యాకేజీ ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు భూమికి భూమి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. వారికి ప్యాకేజీ లేదు. పోలవరం నిర్వాసితులను ఇక్కడి నుంచి వెళ్లిపొండని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి, జిల్లా కలెక్టర్ లు, పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ ను కలవాలంటే కిలోమీటర్ల కొద్ది నడిచి పాడేరు కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి ప్రజలను ఇబ్బందులపాలు చేశారు. గిరిజనులు, గిరిజనేతరులు త్యాగాలు చేసి భూములు ఇస్తే వారిపట్ల నిర్లక్ష్యం వహించారు. పోలవరం, రంపచోడవరం ఎమ్మెల్యేలు, ఎమ్మె్ల్సీ, వారి అనుయాయులు రికార్డులు మార్చేసి పోలవరం నిర్వాసితులకు అందాల్సిన వందల కోట్ల రూపాయలు కాజేశారు. తనతొనాటె టీడీపీ ఇన్ ఛార్జ్ లు రాజేశ్వరి, శ్రీనివాస్ లు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే విచారణలో నిజానిజాలు తేలడంతో తహశిల్దార్ సస్పండ్ అయి జైల్లో ఉన్నాడు. వైసీపీ నాయకులు పోలవరం ప్రాజెక్టు రికార్డులు తారుమారు చేసి పోలవరం నిర్వాసితులకు వచ్చే నిధులను పందికొక్కుల్లా మెక్కుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతాడని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు.

Leave a Reply