Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి- విజయసాయిరెడ్డి ప్రేమంతా ఉత్తరాంధ్రలోని ప్రభుత్వ ఆస్తులపైనే

జగన్మోహన్ రెడ్డి- విజయసాయిరెడ్డి ప్రేమంతా ఉత్తరాంధ్ర లోని సహజవనరులు, భూములు, ప్రభుత్వఆస్తులపైనే
– తనస్వార్థంకోసం, తనపై ఉన్న కేసులభయంతో ప్రత్యేకహోదాను అటకెక్కించిన ముఖ్యమంత్రి, రైల్వేజోన్ ను కూడా లేకుండాచేశాడు
– రాష్ట్రంలో అసమర్థులైన వారు అధికారంలోఉండబట్టే, కేంద్రప్రభుత్వం ఏపీకి తీవ్ర అన్యాయంచేస్తోంది. కేంద్రంలోని బీజేపీప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయంచేస్తుంటే, ఏపీ బీజేపీనేతలకు పట్టదా?
• ఉత్తరాంధ్రకు ముఖ్యమైన విశాఖస్టీల్ ప్లాంట్ ను అమ్మకానికిపెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆప్రాంతానికి గుండెకాయవంటి రైల్వేజోన్ ను కూడా లేకుండా చేశాడు
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష
రాష్ట్రానికి ముఖ్యమైన విశాఖరైల్వేజోన్ ఇకలేనట్టేనని కేంద్రంతేల్చిచెప్పిందని, కేంద్రప్రభుత్వ సమాధానంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీఎంపీలు, ఆపార్టీనేతలుఏం సమాధానం చెబుతారని, ఇంకెంతకాలం ఉత్తరాంధ్రవాసులతోపాటు, రాష్ట్రప్రజలను మోసగిస్తారని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి గౌతుశిరీష నిలదీశారు. గురువారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే …
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విశాఖను రాజధానిగా చేస్తున్నామనిచెప్పి, ఉత్తరాంధ్రవాసులను దారుణంగా వంచించారు. పాదయాత్రసమయంలో, ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు రైల్వేజోన్ తెస్తామని, పరిశ్రమలుతెస్తామని, ఇంకా ఏదేదో చేస్తా మని భారీఉపన్యాసాలతో ఊదరగొట్టాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తరాంధ్రప్రాం తంలోని సహజవనరులను దోపిడీచేస్తూ, విశాఖలోని

విలువైనభూములు కొల్లగొట్టే పనిలో నిమగ్నమయ్యాడు. చివరకు ఇప్పుడు కేంద్రప్రభుత్వం రైల్వేజోన్ లేదని తెగేసిచెప్పినా, నోరెత్తి ప్రశ్నించలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ఉన్నాయి.
. రైల్వేజోన్ కోసం గతంలో అధికారంలోఉన్న తెలుగుదేశంపార్టీ, చంద్రబాబునాయుడిగారు తీవ్రంగా కేంద్రం పై ఒత్తిడితెచ్చారు, ఆనాడు ఆయన చేసినదానికిఫలితంగానే రైల్వేజోన్ కు సంబంధించి, 2019 ఫిబ్రవరిలో ఆనాటి కేంద్రప్రభుత్వం డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధంచేసింది. అప్పుడు డీపీఆర్ విడుదలచేసిన కేంద్రప్రభుత్వం, బీజేపీ, ఇప్పుడు రైల్వేజోన్ లేదని చెప్ప డం ఏమిటి? మొన్నటికి మొన్న డిసెంబర్ 1న కేంద్రరైల్వేమంత్రి పార్లమెంట్ లో మాట్లాడు తూ, దక్షిణకోస్తా రైల్వేజోన్ కు రూ.40లక్షలుకేటాయించామని, ఆజోన్ కు కొత్తరాయఘడ డివిజన్ తోకలిపి కొత్తజోన్ ఏర్పాటుచేయడానికి రూ.174కోట్లవరకు ఖర్చువుతుందని చెప్పింది నిజంకాదా?
డిసెంబర్ 1న అలాచెప్పినకేంద్రప్రభుత్వం, కేవలం వారంరోజుల్లోనే మాటమార్చి, ఇప్పుడు రైల్వేజోన్ లేదని చెప్పడం ముమ్మాటికీ ఏపీకి అన్యాయంచేయడమే అవుతుంది. కేంద్రప్రభుత్వప్రకటన రాష్ట్రప్రభుత్వ అసమర్థతకు సంకేతం అనిచెప్పడంలో ఎలాంటిసందేహంలేదు. ఈ ముఖ్యమంత్రి ఉదయంలేస్తే, ఉత్తరాంధ్రజపమేచేస్తారు. కానీ ఆ ప్రాంతానికి ఆయనచేసిందిశూన్యం. ఆఖరికి ఉత్తరాంధ్రకు గుండెకాయవంటి రైల్వేజోన్ ను కూడా జగన్మోహన్ రెడ్డి అమ్మకానికి పెట్టాడు. జగన్ కు అధికారమిచ్చింది, ప్రజల ఆస్తులు వారిభూములు, రాష్ట్రసంపదను అమ్మడానికి కాదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ సాధనకోసం ఎంతో మందిపెద్దలు, మరీ ముఖ్యంగా వావిలాల గోపాలకృష్ణయ్య, తెన్నేటి విశ్వనాథం, గౌతులచ్చ న్నవంటివారు నీలంసంజీవరెడ్డిగారితో పట్టుదలతో పోరాడారు. పదవులు, ప్రాణాలు లెక్కచేయకుండా అలాంటి వారుపోరాడితే రాష్ట్రానికి వచ్చిన విశాఖఉక్కుఫ్యాక్టరీని అమ్మే హక్కు, అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం.
తనసొంత ప్రయోజానాలకోసం, తనతాలూకా కేసులమాఫీకోసం, తనబెయిల్ రద్దు కాకుండా ఉండటం కోసమే ముఖ్యమంత్రి, ఉత్తరాంధ్రప్రాంతాన్ని, రాష్ట్రాన్ని కేంద్రపెద్దలవద్ద తాకట్టుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇంత అన్యాయం, నష్టంరాష్ట్రానికి జరుగుతుంటే రాజకీయపెద్దలు, మేథావు లు, ప్రజాసంఘాలవారు మౌనంగా ఉండటం సిగ్గుచేటు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చాకే 2019 ఆగస్ట్ లో రైల్వేజోన్ తాలూకా డీపీఆర్ సమర్పించామనిచెప్పారు. ఆ తరువాత వారానికే జోన్ ప్రస్తావనలేకుండా కేంద్రంనుంచి ప్రకట న వచ్చింది. విశాఖ కేంద్రంగానే రైల్వేజోన్ ఏర్పడాలని డిమాండ్ చేస్తూ, ఉత్తరాంధ్రప్రాంత వాసులు మూడున్నరేళ్లుగా పోరాటంచేస్తున్నారు. రైల్వేజోన్ ప్రకటిస్తామని 2019 ఎన్నికల ప్రచారంలో విశాఖకువచ్చిన నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై రాష్ట్ర బీజేపీ నేతలు ఏంసమాధా నం చెబుతారని ప్రశ్నిస్తున్నాం.
రాష్ట్ర పాలకులతో పాటు, కేంద్రంలోని పాలకులు కూడా అవసరం తీరిపోయింది.. ఉత్తరాంధ్రఎలా పోతే మాకేంటన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రంలో అధికారంలోఉన్నవారికే పట్టకపోతే, కేంద్రప్రభుత్వపెద్దలకు పడతా యా అన్నదే తనప్రశ్న. ముఖ్యమంత్రికి, విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్రపై, ముఖ్యంగా విశాఖ నగరంపై ఎలాంటిప్రేమా లేదు. వారికి ఉన్నప్రేమ, ఆదరణ అంతా ఉత్తరాంధ్రలోని సహజవన రులు, విశాఖలోని విలువైన భూములపైనే. వాటిని పూర్తిగా డబ్బురూపంలోకి మార్చుకొని, వారిఖజానాలకు తరలించుకునేవరకు విశాఖపట్నమే రాజధాని అంటూ మొసలికన్నీరు కారుస్తుంటారు.
జగన్మోహన్ రెడ్డికి పరిపాలనంటే ఏమిటో తెలియదు..పాలనపై పట్టు, అవగా హన అనేవి ఆయనకులేవని, చివరకు ఈ రాష్ట్రంలో ఏమీ మిగలవని, ఇప్పటికే పాఠశాలల్లో చదివే విద్యార్థులకుకూడా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతో ఇప్పటికే ఏపీ రాజ ధాని లేని రాష్ట్రంగా తయారైంది. రాజధానిఏదో చెప్పుకోలేక రాష్ట్రప్రజలతోపాటు, వివిధదేశా ల్లో ఉన్న తెలుగువారంతా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ప్రత్యేకహాదాను అటకెక్కించిన జగన్మోహన్ రెడ్డి, రైల్వేజోన్ కు కూడా అదేగతి పట్టించడం మనందరి దౌర్భాగ్యమనే చెప్పుకోవాలి.
తుగ్లక్ పాలనలో రాష్ట్రానికి లక్షలకోట్ల అప్పులే మిగి లాయి గానీ, ప్రజలకు ఒరిగిందేమీ లేదు. జగన్ నునమ్మి, ఓటేసిన వైసీపీకార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నమ్మేపరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్రానికి రైల్వేజోన్ రాదన్న కేంద్రప్రభుత్వప్రకటనకు ముఖ్యమంత్రి అసమర్థతే కారణం. ఒకనేరస్తుడు పదవిలో ఉంటే, అతనితాలూకా తప్పులు, నేరాలు ఎత్తిచూపుతూ, కేంద్రప్రభుత్వంలోని పెద్దలు, రాష్ట్రా నికి రావాల్సిన వాటినిఒక్కొక్కటిఎలా వెనక్కు తీసుకుంటున్నారో చూస్తున్నాం. ఈ ముఖ్య మంత్రి తీరుతో భావితరాలకు తీవ్రంగా అన్యాయం జరగనుందనే వాస్తవాన్ని ప్రతిఒక్కరూ ఆలోచనచేయాలి. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అండగానిలిస్తేనే రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని వనరులను, భావితరాల భవిష్యత్ ను కాపాడుకోలం.
జగన్మోహన్ రెడ్డి లాంటి అసమర్థుడు ముఖ్యమంత్రి అయ్యాకనే రాష్ట్రం అడుక్కునే స్థాయికి దిగజారింది. అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఉత్తరాంధ్రను లూఠీచేస్తున్నదిచాలక, విశాఖ ఉక్కుఫ్యాక్టరీని కూడా ఈ ముఖ్యమంత్రి అమ్మకానికిపెట్టాడు. అసమర్థపాలకులు రాష్ట్రంలో ఉండబట్టే, కేంద్రం ఏపీకి రూపాయికూడా ఇవ్వకుండా ఆడుకుంటోంది. ప్రజలు 28మంది ఎంపీలను ఇస్తే, వారందరినీ ఈ ముఖ్యమంత్రి రఘురామరాజుని దూషించడానికే పరిమితంచేశాడు. ఉత్తరాంధ్రకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయంపై, ఆప్రాంత వాసులంతా ముక్తకంఠంతో నినదిం చాల్సిన సమయం వచ్చింది.

LEAVE A RESPONSE