– జగన్ రెడ్డి పాలనలో నేతిబీరలో నెయ్యిచందంలా సామాజికన్యాయం, అభివృద్ధి వికేంద్రీకరణ.
• ప్రభుత్వాధికారుల నియామకాల్లోనూ కడపజిల్లాకు, రెడ్డివర్గానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యతఇవ్వడం, ఇతరవర్గాలను అవమానించడమే.
• 30మంది కమ్మవారిని డీఎస్పీలను చేశారని టీడీపీప్రభుత్వంలో నానాయాగీచేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు తానుచేస్తున్న అసామాజిక న్యాయంపై ఏం సమాధానం చెబుతాడు?
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ
ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటినుంచీ, ఏపనిచేసినా తనవర్గప్రయోజనాలు దృష్ట్యానే జగన్ రెడ్డి పనిచేస్తున్నాడని, పైకిసామాజికన్యాయం, అభివృద్ధివికేంద్రీకరణ జపంచేస్తూ, రెడ్లు తప్ప ఇతరవర్గాలవారెవరూ ఎందుకూపనికిరారు అన్నవిధంగా వ్యవహరిస్తున్నాడని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే … “జగన్ రెడ్డి పాలనలో నామినేటెడ్ పోస్టులతోపాటు, ప్రభుత్వాధికారుల నియామకంలోనూ సామాజికన్యాయం కొరవడింది. తనకు కావాల్సిన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే జగన్ రెడ్డి ప్రభుత్వాధికారుల్ని నియామకాలు చేపట్టాడు. ఒకేజిల్లాకు, ఒకేసామాజికవర్గానికి చెందినవారికే జగన్ ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడో సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తు న్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీవర్గానికి చెందిన నిజాయితీపరులైన అధికారుల్ని కాదని, లిస్ట్ లో 15స్థానంలోఉన్న రెడ్డివర్గానికి చెందిన రాజేంద్రనాథ్ రెడ్డికే జగన్ డీజీపీ పదవి ఎందు కిచ్చాడు?
టీటీడీ ఛైర్మన్ సహా, సలహాదారులు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు, పోలీస్ శాఖలోని కీలకస్థానాలను తనవర్గానికే జగన్ కట్టబెట్టాడు. జగన్ రెడ్డి 800 నామినేటెడ్ పదవుల్ని రెడ్లకు అప్పగించి, రెడ్లపై తనకున్న ప్రేమను, ఇతరులపై తనకున్న నిర్లక్ష్యాన్ని చాటుకున్నాడు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రిపదవులిచ్చినా, వారిపై పెత్తనం మాత్రం అంతిమంగా రెడ్లకే కట్టబెట్టాడు. అదేవిధంగా వైసీపీ జిల్లా అధ్యక్షపదవుల్లో ఎవరైనా నిమ్నవర్గాల వారుంటే, వారిపై పెత్తనాన్ని కూడా జగన్ రెడ్లకే అప్పగిస్తున్నాడు. విధులు, నిధులు లేకుండా కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన జగన్ రెడ్డి, వాటిని బుట్టబొమ్మల్లా మార్చాడు.
కార్పొరేషన్ల అధ్యక్షులు, ఛైర్మన్లు ఉత్సవవిగ్రహాలుగా మారారు. పదేపదే అభివృద్ధి, అధికారవికేంద్రీకరణ గురించి మాట్లాడే జగన్ ప్రభుత్వంలో, కడపజిల్లా అధికారులకు అగ్రస్థానం ఇవ్వడంఏమిటి? కులపిచ్చితో తానువ్యవహరిస్తూ, టీడీపీపై పనిగట్టుకొని ఆరోప ణలు చేయడం జగన్ రెడ్డికి అలవాటుగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లతో అధికారంలోకివచ్చి, రెడ్లప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ కు సామాజికన్యాయం ఊసెత్తే అర్హతలేదు. తానుముఖ్యమంత్రి అయ్యాక రెడ్లకుతప్ప, ఏవర్గానికి ఎలాంటి మేలుచేశాడో జగన్ రెడ్డి చెప్పగలడా?
తేనెతుట్టెలోని తేనెంతా తనవర్గానికి పోస్తూ, పనికిరానిపిప్పిని ఇతరులకు ఇస్తున్న జగన్ రెడ్డి, సామాజికన్యాయం, అభివృద్ధివికేంద్రీకరణ వంటి పెద్దమాట లు చెప్పడం పచ్చిబూటకం. డీఎస్పీ నియామకాల్లో 30మంది కమ్మవారే ఉన్నారని గతంలో టీడీపీ ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక 30మందికాదు, కేవలం నలుగురేనని, హోంమంత్రే అసెంబ్లీలో నిజంచెప్పారు. దుష్ప్రచారంతో ఎన్నికల్లో ప్రజలమధ్య జగన్ రెడ్డి విద్వేషాలు రేపాడు అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి?
విద్యాదీవెన, వసతిదీవెన కార్యక్రమాలతో జగన్ రెడ్డి ఎందరువిద్యార్థులకు మేలుచేశాడో చెప్పాలి. విద్యార్థుల్నివిద్యకు, పాఠశాలలకు దూరంచేస్తూ జీవోలిచ్చిన జగన్ రెడ్డి, విద్యార్థు ల్ని ఉద్ధరిస్తున్నాడంటే నమ్ముతారా? టీడీపీప్రభుత్వంలో 16లక్షలమంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందితే, జగన్ వచ్చాక ఆసంఖ్యను 10లక్షలకు కుదించాడు. ప్రైవేట్ కాలేజీలు, యూనివర్శిటీల్లో చదివేవిద్యార్థులకు జగనన్నవిద్యాదీవెన వర్తించకుండా జీవో ఇవ్వడం ఎలాంటి ఉద్ధరణో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
అధికారం, పదవులన్నింటినీ కేవలం తనవారికే కట్టబెట్టిన జగన్, సామాజికన్యాయం పేరుతో బడుగు, బలహీనవర్గాలను మోసంచేస్తున్నాడు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో సామాజికన్యాయం, అభివృద్ధి వికేంద్రీకరణ కొరవడ్డాయి కాబట్టే చంద్రబాబునాయుడి సభలకు జనం పోటెత్తుతు న్నారు” అని రఫీ తేల్చిచెప్పారు.