Suryaa.co.in

Andhra Pradesh

బీసీలపై జగన్ రెడ్డి నీతిలేని రాజకీయం

-వైసీపీలోని బీసీ నేతలు సిగ్గుపడాలి
-పథకాలు ఆపేసి, సబ్సిడీలు రద్దు చేసి ఏం ఉద్దరించావ్?
-నిధులు, విధులు లేని పదవులు బీసీలకా.. నిధులు అధికారాలు సొంత వారికా?
– పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు

బీసీలంటే బ్యాక్ వార్డ్ కులాలు కాదు.. బ్యాక్ బోన్ కులాలని నిరూపించింది తెలుగుదేశం పార్టీ. బీసీల వెన్నెముకను విరగ్గొట్టింది జగన్ రెడ్డి. బీసీ సమస్యలపై యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ స్పందనతో జగన్ రెడ్డి అండ్ కో దొంగల ముఠాకు వణుకు మొదలైంది. వైసీపీ పునాదులు కదులుతున్నాయి. అందుకే.. తెల్లవారగానే అధికార పార్టీ నేతలు చెవికోసిన మేకల్లా అరుస్తున్నారు. బీసీ.. అనే పదం పలికే కనీస అర్హత కూడా జగన్ రెడ్డికి, వారి ముఠాకు లేదు. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనంతా బీసీలను భక్షించడం తప్ప చేసిందేమీ లేదు.

టీడీపీ హయాంలో కార్పొరేషన్ల ద్వారా రుణాలు, సబ్సిడీలు, రాయితీలు ఇచ్చి చేతి వృత్తుల్ని ప్రోత్సహిస్తే.. జగన్ రెడ్డి అన్నీ రద్దు చేసి బీసీలను అణగదొక్కుతన్నాడు. జగన్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి అనేందుకు నామినేటెడ్ పదవులు, నిధులు, సబ్సిడీలు సహా అన్నింటిలో స్పష్టంగా కనిపిస్తోంది.

నామినేటెడ్ పదవులు, పనుల్లో రిజర్వేషన్లు అంటూ మాయ చేస్తున్న జగన్ రెడ్డి.. బీసీ కార్పొరేషన్లలో బీసీలకు తప్ప వేరొకరికి అవకాశం లేదు కాబట్టే బీసీలను నియమించాడు. చిన్న చిన్న పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేశారు తప్ప.. ఏపీఐఐసీ, టీటీడీ, సలహాదారులు, యూనివర్శిటీ వైస్ ఛాన్సులర్లలో రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలి. బలహీనవర్గాలకు బలహీన పదవులా.. జగన్ రెడ్డి వర్గానికి అధికారాలుండే పదవులా? టీడీపీ హయాంలో రాష్ట్రంలోని అన్ని పెద్ద కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా బీసీలు ఉంటే.. ప్రస్తుతం ఎవరిని నియమించారో సమాధానం చెప్పే ధైర్యం ఉందా?

జగన్ రెడ్డి బీసీలకు చేసిన ద్రోహాన్ని గుర్తించి గద్దిస్తుండడంతో.. మాటలతో మాయ చేసేందుకు సిద్ధమయ్యారు. రేషన్, పెన్షన్, ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా బీసీ బడ్జెట్లో చూపించడానికి జగన్ రెడ్డి ముఠా సిగ్గుపడాలి. టీడీపీ హయాంలో చేపట్టిన బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, స్టడీ సర్కిల్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు, పారిశ్రామిక రాయితీలు నిలిపివేయడం బీసీలను అణగదొక్కడం కాదా?

రేపల్లెలో పదో తరగతి చదివే చిన్న బిడ్డను పెట్రోల్ పోసి కాల్చేస్తే జగన్ రెడ్డి స్పందించకపోగా, అసలు నిందితుడు జెస్సీ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చకపోవడం రాజకీయ వివక్ష కాదా? విజయనగరంలో ఏగిరెడ్డి కృష్ణ మాస్టారుని వైసీపీ ముఠా చంపేయడంలో రాజకీయం లేదా? కర్నూలులో తొమ్మిదేళ్ల చిన్నారిపై వైసీపీ నేతలు అత్యాచారం చేస్తే, నిందితులను అధికార పార్టీ నేతలు వెనకేసుకు వచ్చి ఎఫ్ఐఆర్‌ నమోదు చేయకపోవడం రాజకీయ కక్ష కాదా? దాడులు, దౌర్జన్యాలు, హత్యలు తప్ప నాలుగేళ్లలో జగన్ రెడ్డి బీసీలకు చేసిందేంటి? బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన చంద్రబాబు బీసీ ఉద్దారకుడా.. రిజర్వేషన్లు కుదించి 16,800 మందికి పదవులు దూరం చేసిన జగన్ రెడ్డి బీసీ ఉద్దారకుడా?

టీడీపీ అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలల్లోనే జనగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపితే.. 32 మంది ఎంపీలు ఉండి కూడా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేసి ఆ తీర్మానాన్ని ఆమోదించుకోలేదో సమాధానం చెప్పగలరా? కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా బీసీలకు అందే ప్రయోజనాలు, పథకాలు వారికి దూరం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి మాత్రమే. బీసీలను భక్షిస్తున్న జగన్ రెడ్డి భజన చేయడానికి వైసీపీలోని బీసీ నేతలు సిగ్గుపడాలి.

LEAVE A RESPONSE