బడిలో ఉండాల్సిన విద్యార్థులను బజారుకీడ్చిన జగన్ రెడ్డి
– టి.ఎన్.ఎస్.ఎఫ్. రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్
భవిష్యత్ తరాల కోసం తమ భూములు, ఆస్తులు దానమిచ్చి ఎయిడెడ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే..నేడు విద్యార్థుల భవిష్యత్ నే జగన్ రెడ్డి అంధకారం చేస్తున్నాడు. 2.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఆపదలోకి నెట్టడమేనా ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రక్షాళ అంటే. స్వాతంత్ర్యానికి ముందు నుండి కొనసాగుతున్న ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేయాలనుకోవడం ప్రభుత్వ చేతకాని తనాన్ని రుజువు చేస్తోంది. పనికిరాని సలహాలిచ్చే సలహాదారు వ్యవస్థకు వందల కోట్లు వేతనాలుగా చెల్లిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులేయడానికి రూ.3500 కోట్లు దుబారా చేశారు. అమలు కాని సన్నబియ్య సంచుల కోసం రూ.750 కోట్లు దోచిపెట్టారు.
లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటలో నడిపే ఎయిడెడ్ స్కూళ్లకు గ్రాంట్ల కింద రూ.600 కోట్లు ఇవ్వలేకపోవడం సిగ్గుచేటు. ప్రశాంతంగా ఉన్న ఎయిడెడ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, ఆస్తుల దోపిడీకి ప్రయత్నించడం దుర్మార్గం. విద్యార్థుల భవిష్యత్ కన్నా ఆస్తుల దోచుకోవడంపైనే ముఖ్యమంత్రి ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఎయిడెడ్ వ్యవస్థ విలీనంపై న్యాయస్థానికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించడం జగన్ రెడ్డి నీతిమాలిన పాలనకు నిదర్శనం.
బ్రిటిష్ పాలకులు కూడా ఎయిడెడ్ వ్యవస్థకు ఊతమిచ్చారే తప్ప ఊడగొట్టాలనుకోలేదు. విద్యార్థులకు మేమమామనంటూ ‘కంశ మామ’లా జగన్ తయారయ్యాడు. బడిలో ఉండాల్సిన విద్యార్థులను జగన్ రెడ్డి బజారుకీడ్చారు. ఎయిడెడ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని ఈ ముఖ్యమంత్రికి విద్యార్థుల దగ్గరకెళ్లి చెప్పే ధైర్యం వుందా.? ఎయిడెడ్ ప్రక్షాళన పేరుతో జగన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రజలు గుర్తించారు. త్వరలోనే మీ పార్టీని పెకలించి.. రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయడం ఖాయం.