రఘురామను తొలగించమని అమిత్ షాను కోరిన జగన్ ఇప్పుడెందుకు కోరడంలేదు?

-జగన్ రెడ్డి చెబితే ఎంపి గోరంట్ల మాధవ్ రాజీనామా చేయడా?
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫి

ఏ చరిత్ర లేకపోయినా నేర చరిత్రను చూసి ముగ్దుడై ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించిన గోరంట్ల మాధవ్ విషయం దేశంలోని పది కోట్ల మందికి పైగా నగ్న వీడియో చూశారు. తెలుగువారు ఇలాంటివారా అని అసహ్హించుకుంటున్నారు. సీఎం మౌనానికి అర్థమేంటో చెప్పాలి. ఎస్వీబీసీ పదవి నుండి పృధ్విరాజ్ ను అరగంటలో తీసేశావు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన యేహ్యమైన వీడియో విడుదలై మూడు రోజులు గడచినా చర్యలు లేవు. బహుశ సీఎం కూడా చూసి ఉండొచ్చు. చూడనివారు పుణ్యాత్ములు, చూసినవారు పాపాత్ముల కింద మారింది. చూడనివారుంటే చూడొద్దని సలహా ఇస్తున్నాను. పార్లమెంట్ లో అందరూ చూసి తరించారు. తెలుగువారి పరపతి మొత్తం మంటగలసిపోయింది. జగన్ మాత్రం ఉలుకు, పలుకు లేకుండా ఉన్నాడు. అతన్ని ఏ విధంగా కాపాడాలనే ప్రయత్నాల్లో సీఎం ఉన్నాడు. ప్రతిదాన్ని దుష్ట చతుష్టయమని లేని దాన్ని ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తి జగన్ రెడ్డి. శ్రీకాకుళం వెళ్లి అక్కడ కూడా పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు. మా ఎంపి చేసింది తప్పని అక్కడా చెప్పలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకమంతా అసహ్హించుకుంటోంది. మహిళలందరూ రోడ్డుపైకి వచ్చి అతనిచేత రాజీనామా చేయించమని డిమాండ్ చేస్తుంటే సీఎంకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఢిల్లీ వెళ్లి గోరంట్ల మాధవ్ తో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటావా? లేక సజ్జల, జగన్ రెడ్డి కలిసి ఏమైన పథకం రచించారా? జగన్ స్థానంలో మరొకరు ఉండివుంటే వెంటనే గోరంట్ల మాధవ్ చేత రాజీనామా చేయించేవారు. ఎందుకు రాజీనామా చేయించడంలేదో చెప్పాలి. ఉప ఎన్నిక వస్తే ఓడిపోతాననే భయమా? అసలే సర్వేల్లో వైసీపీకి వ్యతిరేకత వస్తోంతి. దౌర్భాగ్యమైన, ఏహ్యమైన, అసహ్హించుకునే పనిచేసిన గోరంట్ల మాధవ్ రాజీనామా చేస్తే ఏ ముఖం పెట్టుకొని ఓట్లడగగలమని ఆలోచనతో ఏ నిర్ణయం తీసుకోలేకున్నావా? కంటితుడుపు చర్యగా పార్టీ నుండి సస్పెండ్ చేసి విజయవాడలో గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేసి మళ్లీ పార్టీలోకి తీసుకొని పదవి ఇచ్చారో ఆ రకంగా ఈయనను కూడా సస్పెండ్ చేసి జనం మరచిపోయిన తరువాత మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నావా? నైతిక విలువలున్న పార్టీ వైసీపీ అనే ఆలోచన ఉంటే అతనిచేత రేపు ఢిల్లీలో ఎంపీ పదవికి రాజీనామా చేయించాలనితెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.

రఘురామకృష్ణంరాజును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైసీపీ ఎంపీలందరూ స్పీకర్ కు సిఫార్సు చేయమని పంపావు. ఇప్పుడెందుకు చేయడంలేదు? ప్రధాని, అమిత్ షాలకు రఘురామకృష్ణంరాజును తొలగించమని కోరిన జగన్ ఇప్పుడెందుకు కోరడంలేదు. పార్టీ పరువు, తెలుగుజాతి పరువు పోయింది నీవు రాజీనామా చేయమని జగన్ రెడ్డి చెబితే ఎంపి గోరంట్ల మాధవ్ చేయడా? గోరంట్ల మాధవ్ రాజీనామా చేయాలని మీడియా మొత్తం కోడై కూస్తోంది. ఒకపక్క ఆజాదీకా 75వ అమృత్ ఉత్సవ్ జరుగుతుంటే అక్కడ ఎంపీ గోరంట్ల మాధవ్ కూర్చోవడం దేశానికే సిగ్గుచేటు. వేలాది మంది ప్రాణాలను అర్పించి దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది ఇటువంటి నాయకులని, ఎంపీలని ఎన్నుకోవడానికేనా అని ప్రశ్నస్తే మీరు ఏం సమాధానం చెబుతారు. ఆజాదీకా 75వ అమృత్ ఉత్సవ్ లలో ఇటువంటి నీచపు ఎంపీ పాల్గొనడానికి వీలులేదు. ఇది జాతీ సిగ్గు పడే అంశం. గోరంట్ల మాధవ్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షించడానికి పంపిచామంటున్నారు అందులో ఉన్న మహిళ ఎవరు, ఆ మహిళ వివరాలని కూడ నిగ్గుతేల్చాలి. ఎన్.టి.ఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే లేని సర్వేనెంబర్లు చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలకు అనుమానాలను రేకిత్తించారు. ఆ మహిళ వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి సంబంధించిన మహిళ అని అంటున్నారు. దేవేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి. నేడు ఎలాంటి గొప్పవారు రాష్ట్రసభ చైర్మెన్లుగా పనిచేశారో అందరికి తెలుసు అటువంటి స్ధానంలో ఎ2 విజయసాయి రెడ్డి కూర్చోవడం దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీ ఆఫీసు పై దాడిచేస్తే మా వాళ్లకు బిపి వచ్చి చేశారని దుర్మార్గంగా మాట్లాడాడు జగన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటి పై దాడి చేసిన జోగి రమేష్ కు మంత్రి పదవిని కట్టబెట్టాడు జగన్ రెడ్డి. ఆర్థిక నేరస్తుడు వైసీపీకి జీవితకాల అధ్యక్షుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి.

జగన్ రెడ్డి ప్రభుత్వంలో అరగంట గంట మహిళలని రమ్మనే వారు మంత్రులు. క్యాసినో, క్యాబ్రే, పేకాట క్లబ్ లు నడిపే వారు ఎమ్మేల్యేలు, మనిషిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వాడు ఎమ్మేల్సీ, బట్టలు విప్పి నగ్నంగా వీడియో కాల్ చేసే వాడు ఎంపీ వెరసీ వీరందరూ కలిస్తే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇదే వై.యస్.రాజశేఖర్ రెడ్డి వారసత్వం జగన్ రెడ్డి పరిపాలనా విధానం. జగన్ రెడ్డిని చూసి ఎవరు ఓట్లు వేయలేదు. నేడు రాష్ట్రం సర్వ నాశనం అయిపోయే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారు జగన్ మంత్రులు సిగ్గుపడాలి జగన్ రెడ్డి ఇది చూసి. గోరంట్ల మాధవ్ ఏ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాడో విచారణ చేపట్టి ఆ మహిళ ఎవరో తెలపాలి. వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ గురించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. ఏం మాట్లాడట్లేదు మహిళా కమిషన్ అని ప్రశ్నించడంతో వాసిరెడ్డి పద్మకు ఇప్పటికి మెలుకువ వచ్చి తూతుమంత్రపు లేఖ ప్రజలను మభ్యపెట్టడానికి పంపించారా? మహిళా కమీషన్ చైరపర్సన్ గా ఉన్న వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్ ఏ మహిళతో ఆవిధంగా ప్రవర్తించారో ఫోరెన్సిక్ ల్యాబెరటరీ ద్వారా నిజం నిగ్గుతేల్చమని లేఖ రాయమని డిమాండ్ చేశారు. మహిళల పట్ల ఏ సంఘటన జరిగినా గన్ కంటే ముందు జగన్ రెడ్డి ముందు వస్తారని అన్న రోజా ఏ కలుగులో దాక్కుంది? గోరంట్ల మాధవ్ ఘటన జరిగి మూడు రోజులు గడిచినా ముఖ్యమంత్రి ఎందుకు మౌన మునిలా నిమ్మకుండిపోయారు, ఎందుకు తగు చర్యలు తీసుకోవడం లేదు.

రాష్ట్రంలో మహిళలు వైసీపీ నాయకుల రాసలీల గురించి దుమ్మేత్తి పోస్తుంటే ఏ మోహం పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ్మినేని సీతారాం కొడుకు పెళ్ళికి వెళ్ళాడు? ముఖ్యమంత్రి పృధ్వీ రాజ్ తో రాజీనామా చేయించినట్టు గోరంట్ల మాధవ్ తో రాజీనామా చేయించి అతని పై చర్యలు తీసుకొని పెళ్లికి వెళ్ళుంటే ముఖ్యమంత్రికి గౌరవంగా ఉండి ఉండేది. పృథ్వీరాజ్ ఒక బకరా. పృధ్వీ రాజ్ ని ముఖ్యమంత్రి నామినేట్ చేసిన పదవి కాబట్టీ తీసేశారు, గోరంట్ల మాధవ్ ప్రజలు ఎన్నుకున్న పదవి కాబట్టి ఉప ఎన్నికలు వస్తే ఓటమి తప్పదని భయపడుతున్నారని అర్థమౌతోంది. ప్రజలు ఉప ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ది చెబుతారు. కంటితుడుపు చర్యలు తీసుకుంటే మాత్రం ఊరుకునేదిలేదు. మాధవ్ రాజీనామా చేసేవరకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, తెలుగుదేశం పార్టీ ఇతర రాజకీయ పార్టీలు పోరాడుతూనే ఉంటాయి. ఇంతమంది ముక్త కంఠంతో అడుగుతుంటే ఎందుకతని చేత రాజీనామా చేయించవు? రాజీనామా చేయించలేదంటే నీవు ప్రోత్సహించినట్లే. అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి నీవు రేపు ఢిల్లీ వెళ్తున్నావు కాబట్టి గోరంట్ల మాధవ్ చేత రాజీనామా లెటర్ తీసుకొని ఆ లెటర్ స్పీకర్ కు పంపిస్తే తెలుగు ప్రజలు హర్షిస్తారు. కొంతలో కొంతైనా పరువు దక్కుతుంది. రాజీనామా చేయించకపోతే ఇంత జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయించలేకపోయాడని ప్రజలు ఛీకొడతారు. లేకుంటే అతన్ని సమర్థిస్తున్నట్లు అనుకుంటారని టీడీపీ భావిస్తోంది.

Leave a Reply