Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాకోర్టులో జగన్‌ కు శిక్ష తప్పదు

-అవ్వాతాతల ప్రాణాలతో నీచ రాజకీయాలు
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
-27వ వార్డులో ఎన్నికల ప్రచారం

ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ఘోరాలకు ప్రజాకోర్టులో శిక్ష ఎదుర్కోక తప్పదని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హెచ్చరించారు. 27వ వార్డులో ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటిం టికీ తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన పింఛన్‌ మరణాలన్నీ సీఎం జగన్‌, అధికార వైసీపీ హత్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్క న పెట్టమని చెప్పిందని, ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకోవద్దని ఎక్కడా అనలేదన్నారు. అలాం టప్పుడు 1.34 లక్షల మంది వరకు ఉన్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో, మిగిలిన రెవెన్యూ యంత్రాంగంతో ఇంటికే పింఛన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కావాలనే కుట్రలు చేశారని స్పష్టమవుతోందన్నారు.

శవరాజకీయాలే పునాదులుగా అవ్వాతాతల ప్రాణాల్ని బలిపెట్టారని నిప్పులు చెరిగారు. కొందరు వృద్ధుల సాధారణ మరణాలను కూడా పింఛన్ల కారణంగానే అని చెబుతూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఈ దారుణాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వారిపై హత్యానేరం కింద కేసులు పెట్టాలని కోరారు. ఇలాంటి వ్యక్తులను శాశ్వతంగా రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థలకు దూరంగా ఉంచేలా నిషేధం పెట్టాలన్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా భాగంగా దుస్తులు ఇస్త్రీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్‌, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు మానుకొండ శివప్రసాద్‌, నాయకులు పటానాయక్‌ ఖాన్‌, షమీమ్‌ ఖాన్‌, గంధం కోటేశ్వరరావు, గట్టుపల్లి శ్రీను, రాంబాబు, సాహెబ్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE