జగన్మోహన్ రెడ్డి కన్ను ఎయిడెడ్ విద్యాసంస్థలపై పడింది

– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్
పిచ్చి ముదిరింది తలకు రోకలి చుట్టండి అన్నతీరుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుఉందని, విద్యయొక్క ప్రాధాన్యత, దాని గొప్పతనం తెలిసినపెద్దలు, సంఘసేవకులు కొందరు బ్రిటీష్ హయాంలోనే ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేసి, ఎందరో పేదవిద్యార్థు లకు విద్యాదానం చేశారని, అలాంటి విద్యాసంస్థలు, వాటి భూములు, ఆస్తులను చెరబట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవ్వడం దురదృష్టకరమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ వాపోయారు.
సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
దేశానికి స్వతంత్ర్యం రాకముందు విద్యయొక్క ప్రాధాన్యత గుర్తించిన వ్యక్తులు, హిందూ, క్రైస్తవ, మైనారిటీ సంస్థలు స్వచ్ఛందంగా కొందరు దాతలతోకలిసి ఎయిడెడ్ విద్యాసంస్థలను నెలకొల్పడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 138 వరకు ఎయిడెడ్ కళాశాలలుంటే, వాటిలో 127 విద్యాసంస్థలు ఇప్పటికే ప్రభుత్వపరం అయ్యాయన్నారు. ప్రభుత్వ వేధింపులకుతట్టుకోలేకకొందరు, భయపడి కొందరు కళాశాల ల్లోని సిబ్బంది, అధ్యాపకులను ఇప్పటికే ఆయాకళాశాలల నిర్వాహకులు ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధపడ్డారన్నారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు వాటిపరిధిలోని ఆస్తులు, భూములను స్వాధీనంచేసుకోవడానికే వైసీపీప్రభుత్వం వాటిపై కన్నేసిందిన్నారు.
అనేక పట్టణాలు, నగరాల్లో ఆయావిద్యాసంస్థలు, వాటిభూములు ప్రధానకూడళ్లు, డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఉండటంతో ప్రభుత్వకన్ను వాటిపైపడిందన్నారు. ఎయిడెడ్ పాఠశాలు, కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులనే ప్రభుత్వం, సర్కారుకళాశాలల్లో నియమించడానికి సిద్ధమైందని, దానివల్ల ఆయాకళాశాలల్లో ఖాళీగా ఉన్న 10వేల నియామకాలను భర్తీ చేసేపని కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. ఆ పోస్టులను భర్తీచేస్తే, జీతాలు ఇవ్వలేమని భావించిన ప్రభుత్వం, చివరకు ఎయిడెడ్ సిబ్బందిని తమఅధీనంలోకి తీసుకోవడానికి సిద్ధమైందన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని భావించే నిరుద్యోగులు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారని, వీరాంజనేయులు అనేయువకుడి బలవన్మరణమే అందుకు నిదర్శనమన్నారు.
ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేసేసిబ్బంది, అధ్యాపకులకు చెల్లించే జీతాల్లో 80శాతం కేంద్రంభరిస్తే, మిగిలిన 20శాతం మాత్రమే రాష్ట్రవాటా ఉందన్నారు. కేవలం 20శాతం వాటాఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, గంపగుత్తగా రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలన్నింటినీ స్వాధీనం చేసుకొని, వాటికి సంబంధించిన ఆస్తులను ప్రైవేట్ పరంచేయాలని చూడటం ముమ్మాటికీ దుర్మార్గమేనని జవహర్ మండిపడ్డారు. ఎయిడెడ్ సంస్థలను పూర్తిగా డెడ్ చేయడమే జగన్ ప్రభుత్వ ప్రధానోద్దేశమన్నారు. బ్రిటీష్ హయాంనుంచి, దాతల సహాయసహకారాలతో బీద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యనందిస్తున్న సంస్థల స్వాధీనానికి ప్రభుత్వం సిద్ధమ వ్వడం ముమ్మాటికీ విద్యార్థుల జీవితాలను చీకట్లపాలు చేయడమే అవుతుందన్నారు.
విద్య కోసం దాతలిచ్చిన భూములు, భవనాలను స్వాధీనం చేసుకునే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించిన జవహర్ , ప్రభుత్వ ఆలోచనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరీ ముఖ్యంగా మేథావులు స్పందించాలన్నారు. మేథావుల మౌనం సమా జానికి ఎంతచేటు చేస్తోందో వారు ఇప్పటికైనా గ్రహించాలన్నారు. నాడు-నేడు కింద ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ప్రభుత్వం ఎందుకు తగినవసతులు కల్పించడంలేదన్నారు? ముఖ్యమంత్రి దుష్టఆలోచన ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న 90శాతం మంది బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు విద్యనుదూరం చేస్తుందని జవహర్ వాపోయారు.విద్యాదానం కోసం దాతలు ఏర్పాటుచేసిన విద్యాసంస్థలను నిర్వీర్యంచేస్తే, దానివల్ల నష్టపోయేది అంతిమంగా విద్యార్థులేనన్నారు.
విద్యాసంస్థలు, వాటిఆస్తులు, భూములపై కన్నేసిన జగన్ ప్రభుత్వం, వాటిలోని 10వేలమంది సిబ్బందిని ఇప్పటికే ప్రభుత్వ కళాశాలలకు అటాచ్ చేసిందని, తద్వారా 10వేలమంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. ఎయిడెడ్ అధ్యాపకులను, ప్రభుత్వ కళాశాలల్లో నియమించడం ద్వారా 10వేల ఉద్యోగాల భర్తీకి జగన్ ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలుఇవ్వకుండా, వారిని జాబ్ లెస్ క్యాలెండర్ తో మోసగించిన జగన్ రెడ్డి, అటున్నవారిని ఇటూ, ఇటున్నవారిని అటూ మారుస్తూ, వారినే తానేదో కొత్తగా నియమించినట్టుగా చెప్పుకుంటున్నాడన్నారు. ఎయిడెడ్ సంస్థల్లోని సిబ్బందికి ఇచ్చేజీతాల్లో రాష్ట్రప్రభుత్వ వాటా కేవలం 20శాతం మాత్రమే నన్న జవహర్, జీతభత్యాల్లో 80శాతంవాటా యూజీసీ (కేంద్రప్రభుత్వసంస్థ) కి ఉంటే, ఏపీప్రభుత్వం ఏకపక్షంగా విద్యాసంస్థల ను ఎలాస్వాధీనం చేసుకుంటుందన్నారు.
కేవలం 20శాతంజీతమిస్తు న్నప్రభుత్వం, ఎయిడెడ్ సంస్థలను, అందులోని సిబ్బందిని ప్రభుత్వపరం చేస్తే, విద్యార్థుల పరిస్థితేమిటన్నారు. విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చదివితే అందుకయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తుందా అన్నారు. ఎయిడెడ్ సంస్థల్లోని విద్యార్థుల చదువులను మధ్యలోనే చంకనాకించే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారని జవహర్ మండిపడ్డారు. విద్యను పూర్తిగా బడుగు, బలహీనవర్గాలకు దూరం చేయడానికే ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడన్నారు. హిందూ, క్రైస్తవ, మైనారిటీ సంస్థల ఆధ్వర్యంలోని కళాశాలల్లో పనిచేసే సిబ్బందికూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని మూకుమ్మడిగా వ్యతిరేకించా లన్నారు. నాడు-నేడు పథకంకింద ఎయిడెడ్ విద్యాసంస్థలను ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎందుకు బాగుచేయడం లేదన్నారు?
జగన్మోహన్ రెడ్డి జాబ్ కేలండర్ అంటూ జాబ్ రిమూవ్ కేలండర్ అమలుచేస్తుండట్టే, వీరాంజనేయులు అనే యువకుడు చనిపోయాడన్నారు. ముఖ్యమంత్రి నిర్వాకంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేథావులు ఉపాధ్యాయసంఘాలు స్పందించాలన్న జవహర్, వారు మౌనంగా ఉంటే, అంతిమంగా విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతుందన్నారు. ప్రభుత్వ అరాచకాలపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు స్పందించకుంటే విద్యకు సమాజం మొత్తం దూరమ వుతుందన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని సంబరపడొద్దన్న జవహర్, భవిష్యత్ లోప్రభుత్వం వాటిని కచ్చితంగా ప్రైవేట్ పరంచేసి, వాటికిసంబంధించిన ఆస్తులను మాత్రమే తమఅధీనంలో ఉంచుకుంటుందన్నారు.
జగన్ ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా పడకేసిందని, పీజీ, డిగ్రీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు కూడా అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి కేంద్రప్రభు త్వ అనుమతి ఉందో లేదో తెలియడంలేదని, ఈ వ్యవహారంపై కేంద్రప్రభు త్వ పెద్దలుకూడా జోక్యం చేసుకోవాలని మాజీమంత్రి హితవుపలికారు.

Leave a Reply