హెటిరో,అరబిందో సంస్థల్లో మెడిసిన్స్ కు బదులు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు …

– . 2017లో హెటిరోసంస్థ ఆదాయం రూ.2,360కోట్లయితే, ఇప్పుడు రూ.5,389కోట్లు.
హెటిరో, అరబిందో సంస్థల్లో మెడిసిన్స్ కు బదులు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు తయారవుతున్నాయి
– ఏపీ కేంద్రంగా ఈడీ చేస్తున్న సోదాల వ్యవహారంపై ప్రధాని దృష్టిసారించాలి
– మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
జగన్మోహన్ రెడ్డికి కుడి,ఎడమ భుజాలుగా ఉండి, ఆయనతో పాటు, సీబీఐ, ఈడీకేసుల్లో ఉన్నకొన్నిసంస్థలైన హెటిరో, అరబిం దో, రాంకీ యాజమాన్యాల తాలూకా బ్లాక్ మనీ బయటపడుతోంద ని, హెటిరోసంస్థలో, దానితాలూకా యాజమాన్యాలపై ఇప్పటికీ ఈడీ సోదాలు జరుగుతున్నాయని, రూ.100కోట్లవరకు సొమ్ము పట్టుబడినట్టు చెబుతున్నారని, టీడీపీసీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
అరబిందో సంస్థతాలూకా ఆస్తులు అతితక్కువకాలంలోనే ఎలాపెరిగాయోకూడా అందరూ గమనించాలి. ఒకపక్కనేమో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీఅయ్యింది. ప్రభుత్వం దాదాపు 2.50లక్షల కోట్లవరకు అప్పులుచేసేసింది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి, ఆయన బంధువులు, ఆయన అనుచరుల తాలూకా ఆస్తులు, వారికంపెనీల ఆదాయాలు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అందుకు హెటిరో, రాంకీ, అరబిందో సంస్థలఆస్తుల పెరుగుదలే నిదర్శనం. ప్రభుత్వంతాలూకా షేర్లు, ఆస్తులవిలువ పడిపోతుంటే, భారతిసిమెంట్స్ సంస్థ షేర్ల విలువఅమాంతంపెరిగింది. హెటిరో సం స్థ క్విడ్ ప్రోకో కేసుల్లో ఏ1 గాఉంది. క్విడ్ ప్రోకో -2లోకూడా ఉంది.
అలాంటి సంస్థకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాకే విశాఖప ట్నం సమీపంలో 108ఎకరాలు కారుచౌకగా అప్పగించేశాడు. విశా ఖలోని బేపార్క్ లో రూ.265కోట్ల విలువైన 9ఎకరాలను ఇచ్చా డు. సీబీఐ, ఈడీకేసులున్న వ్యక్తికి ఏకంగా తిరుమలతిరుపతి దే వస్థానం బోర్డు సభ్యుడి పదవిఇచ్చారు. 2017 నాటికి హెటిరో సంస్థ ఆదాయం రూ.2,360కోట్లు. 2018లో రూ.2,418కోట్లు, 2019 నాటికి 2,361కోట్లుగా ఉంది. అలాంటి సంస్థ కేవలం ఈ రెండుసంవత్సరాల్లోనే రూ.5,389కోట్లకు చేరింది. టీడీపీప్రభుత్వం లో ఒక 50, 100కోట్లు మాత్రమే పెరిగిన ఆదాయం, అమాంతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రూ.5,389కోట్లకు ఎలా చేరిందో, ఆయనే సమాధానం చెప్పాలి.
హెటిరో పాపం పండబట్టే ఈడీ సోదాలు మొదలయ్యాయి. ఆ సంస్థ వ్యవహారం అలాఉంటే, అరబిందో సంస్థకు చెందిన నిత్యానందరెడ్డి, రూ.3,900కోట్లతో రాష్ట్రసంపన్నులజాబితాలో చోటుసంపాదించాడు. జీఎంఆర్ సంస్థ ను తప్పించికాకినాడ సెజ్ ను రూ.2,160కోట్ల ప్రయోజనంతో జగన్మోహన్ రెడ్డి దాన్ని అరబిందో సంస్థకు కట్టబెట్టాడు. అదేవిధం గా రాష్ట్రంలో తిరిగే 108, 104 అంబులెన్సుల కాంట్రాక్ట్ ను రూ.478కోట్లతో అరబిందోకు అప్పగించాడు. ఆ ఒక్కవ్యవహారంలో నే జగన్మోహన్ రెడ్డి రూ.2వేలకోట్ల ప్రయోజనాన్ని అరబిందోకుకలి గేలాచేశాడు, సదరు అరబిందో సంస్థ విజయసాయిరెడ్డి వియ్యంకు డిదే. ఇదంతా క్విడ్ ప్రోకో 2 పరిధిలో జరిగిందే. క్విడ్ ప్రోకో -1 వ్యవహారం రాజశేఖర్ రెడ్డి హాయాంలో జరిగింది. ఇక మరోసంస్థ రాంకీకి చెందిన అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ పదవిఇచ్చారు.
రాంకీ సంస్థపై గతంలోనే ఈడీసోదాలు జరిగాయి. దానికి సంబం ధించిన వ్యవహారంఇంకా పూర్తికాలేదు. రాంకీ, అరబిందో, హెటిరో తోపాటు, ఇండియాసిమెంట్స్ శ్రీనివాసన్, మరికొందరు కూడా జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల జాబితాలోఉన్నారు. వీరంతా క్విడ్ ప్రోకో ఘట్టం 2లోని వారే. క్విడ్ ప్రోకో -1జాబితాలో ఉన్న నిమ్మగడ్డప్రసాద్ గురించి చెబితే చాలాఉంది. ఎక్కడో సెర్బియాలో ఆయన పట్టుబడితే, ఆయన్ని రప్పించడానికి, ఈ ముఖ్యమంత్రి చాలా కష్టపడ్డాడు. ఏకంగా తనఎంపీలతో కేంద్రానికే లేఖరాయించా డు. నిమ్మగడ్డప్రసాద్ కుచెందిన మనిషైన జుల్ఫీరావుడి అనేవ్యక్తి కి ఈ ముఖ్యమంత్రి ఉన్నతమైన పదవినే కట్టబెట్టాడు.
ఈ విధంగా తన అవినీతి, దోపిడీలో పాలుపంచుకునే వారు, వారిసంస్థల ఆదాయాన్ని పెంచుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోతున్నాడు? చంద్రబాబునాయుడు రాష్ట్రం అభివృద్ధిచెందాలని, అన్నిరంగాల్లో రెండంకెల వృద్ధిసాధించాలని తపనపడుతుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి, తనఆదాయం, తన బినా మీలు, బంధువులు, అనుచరుల ఆదాయం పెంచుకోవడానికి తాపత్రయపడుతున్నాడు. గతంలోనే టీడీపీ రాజా ఆఫ్ కరెప్షన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎండగట్టింది. అందుకుప్రతిగా గతంలోప్రతిపక్షనేతగాఉన్న జగన్మోహన్ రెడ్డి టీడీపీప్రభుత్వంపై బురదజల్లాడు.
రూ.6లక్షలకోట్ల అవినీతిజరిగిందని సాక్షిపత్రికలో దుష్ప్రచారంచేయించాడు. మరిప్పుడు ఆయన ముఖ్యమంత్ర య్యాక దానిపై ఎందుకుతేల్చడంలేదు? కృష్ణపట్నం పోర్టుని కూడా ఈ ముఖ్యమంత్రి తనబంధువలకే అప్పగించాడు. కాకినాడ, కృష్ణపట్నం, మచిలిపట్నం, గంగవరం ఇలాఅన్నిపోర్టులను తనవారిపరం చేసేశాడు. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ఈడీ, రాంకీ, అరబిందో, హెటిరోసంస్థల్లో పట్టుబడిన డబ్బుఎక్కడి నుంచి వచ్చిందో నిగ్గుతేల్చాలి. లెక్కల్లేకుండా సదరుకంపెనీలు, వాటి యాజమాన్యాల పేరుతో దొరికే సొమ్మంతా తాడేపల్లి నుంచి అక్కడకు చేరుతున్నద ని ఈడీ వారు గమనించాలి. సీబీఐ, ఈడీ వారికి పట్టుబడుతున్న సొమ్ము, ఎక్కడిదో, ఎక్కడినుంచి ఎక్కడికి చేరిందో సదరుసంస్థలు తక్షణమే బహిర్గతంచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
అరబిందో, హెటిరోసంస్థల్లో మెడిసిన్స్ తయా రవడంలేదు.. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వేలకోట్లు తయా రవుతున్నాయి. హెటిరో, రాంకీ సంస్థల్లో ఈడీ సోదాలపై ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారాన్ని ఎలాకప్పిపుచ్చుతాడో చెప్పాలి. ప్రధాని మోదీ కూడా ఏపీకేంద్రంగా ఈడీచేస్తున్న సోదాలపై దృష్టి పెట్టి, అసలుదోషులను శిక్షించాలని కోరుతున్నాం. ఎంత పెద్ద తలకాయలున్నా, వారిని శిక్షించి ప్రజల ఆస్తిని కాపాడాలని మోదీ కి విజ్ఞప్తి చేస్తున్నాం.

Leave a Reply