Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాంధ్రగా రాష్ట్రం

ఉద్యోగాల కల్పనలో దేశంలో 4వ స్థానం
ఇంటర్న్ షిప్ కల్పిస్తున్న రాష్ట్రాల్లో మొదటి స్థానం
అత్యధిక వార్షిక వేతనం కల్పిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్
ఎంపీ విజయసాయి రెడ్డి

మే 11: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా యువతకు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ ను ఉద్యోగాంధ్రగా మార్చారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గురువారం పలు అంశాలు వెల్లడించారు. ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నాల్గవ స్థానంలో నిలిచిందని అయితే ఇంటర్న్ ఫిప్ కల్పిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. అలాగే వార్షిక వేతనం రూ.2.6 లక్షలకు మించి ఇస్తున్న రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇండియా-2023 స్కిల్ రిపోర్టులో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు.

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ట్రైన్ కు అదనపు కోచ్ లు
ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు అదనపు కోచ్ లో కేటాయించారని ప్రస్తుతం ఉన్న 8 కోచ్ నుంచి 16కి పెంచారని అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లకు ధన్యవాదములు తెలియజేస్తున్నానని అన్నారు. అన్ని ప్రాంతాల నుంచి ప్రసిద్ధ పర్యాటక కేంద్రం తిరుపతికి కనెక్టివిటీ పెంచాలన్న డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఇటువంటి నిర్ణయాలతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.

టెరిటోరియల్ ఆర్మీలో పెరగనున్న మహిళా అధికారుల సంఖ్య
టెరిటోరియల్ ఆర్మీలో లైన్ ఆప్‌ కంట్రోల్ వద్ద మహిళా అధికారులను మోహరింపజేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ధన్యవాదములు తెలుపుతున్నానని విజయసాయి రెడ్డి అన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న ఈ నిర్ణయంతో రక్షణ రంగంలో మహిళా అధికారుల నియామకం పెరుగుతుందని, ఇది హర్షనీయమని, చారిత్రాత్మకమని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE