Suryaa.co.in

Andhra Pradesh

కూటమి అప్పులపై జగన్ మీడియా కాలకూట విషం

– బాబు ప్రభుత్వం చేసిన అప్పు రూ.42,237 కోట్లు మాత్రమే
– జగన్ చేసిన అప్పులకు, నెల నెలా కట్టాల్సిన వడ్డీనే రూ.2400 కోట్లు
– ఈ ఏడు నెలలకి జగన్ చేసిన అప్పు మీద కట్టిన వడ్డీనే 16,800కోట్లు
(ఏ.బాబు)

చంద్రబాబు వచ్చిన ఏడు నెలల్లోనే రూ.1.19 లక్షల కోట్ల అప్పు అని పచ్చి అబద్ధాలను జగన్ రెడ్డి , భారతీ రెడ్డితో రాయించాడు. ఇప్పటి వరకు 7 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు, కేవలం రూ.42,237 కోట్లు మాత్రమే. ఇందులో కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకే Rs.20,581 కోట్లు ఖర్చు చేశారు. అదీ కాక జగన్ చేసిన అప్పులకు, నెల నెలా కట్టాల్సిన వడ్డీనే రూ.2400 కోట్లు. అంటే ఈ ఏడు నెలలకి జగన్ చేసిన అప్పు మీద కట్టిన వడ్డీనే 16,800కోట్లు.

ఇక జగన్ రాసిన ఫేక్ పూర్తిగా విశ్లేషిద్దాం. RBI నుంచి 74,287 కోట్ల అప్పు తీసుకునట్టు సాక్షిలో రాశాడు. నిజానికి జూన్ 12 తరువాత నుంచి ఇప్పటి వరకు ఏపి ప్రభుత్వం తీసుకుంది రూ.42,237 కోట్లు. మరి జగన్ రెడ్డికి 74,287 కోట్లు ఎలా వచ్చింది ? కావాలంటే కింద, ఏ నెల ఎంత అప్పు తీసుకుంది. వివరంగా ఇచ్చాం. జగన్ రెడ్డికి 74,287 కోట్ల లెక్క చూపించే దమ్ము ఉందా ?

పౌర సరఫరాల శాఖ నుంచి రూ.2 వేల కోట్ల రుణం అని రాశాడు.. ఇందులో జగన్ పెట్టి వెళ్ళిన ధాన్యం బకాయిలు రూ.1674 కోట్లుని కూటమి ప్రభుత్వం తీర్చింది.

అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇస్తున్న అప్పు రూ.15 వేల కోట్లతో రాష్ట్రానికి సంబంధం లేదు. అది కేంద్రం తీరుస్తుంది. అసలు ఈ అప్పు, రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా ఏ తలకమాసిన సన్నాసి చూపించడు. జగన్ రెడ్డి లాంటి సైకో తప్ప.

అమరావతికి హడ్కో ఇచ్చే రుణం రూ.11 వేల కోట్లతో కూడా రాష్ట్రానికి సంబంధం లేదు. ఇది పూర్తిగా CRDA లావాదేవీలు. అమరావతి భూములు మీద వచ్చే ఆదాయంతో CRDA తీరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదు. అయినా ఇంకా హడ్కో ఈ రుణాన్ని అధికారికంగా ఆమోదం తెలపలేదు.

జర్మనీ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు ఇస్తుందని రాసారు. అది ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు.. ప్రతిపాదనను కూడా అప్పు ఇచ్చినట్టు రాసేసారు.

21 వేల కోట్లు CRDA ప్రతిపాదించిన అప్పుని కూడా తీసుకునట్టు రాసేసారు. అసలు ఈ రుణం ఎవరు ఇస్తారు, ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. ఇది కూడా సమీక్షలో సీయం అధికారులకు చెప్పింది. కనీసం రుణం ఇవ్వమని ఇప్పటి వరకు ఎవరినీ అడగలేదు. అయినా దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పూర్తిగా CRDA అప్పు ఇది.

మార్క్ ఫెడ్ ద్వారా 6000 కోట్ల అప్పుల సమీక్షణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా రుణం ఎక్కడా తీసుకోలేదు. ఈ క్యాబినెట్ భేటీ జరిగిందే డిసెంబర్ 19న. ఇంకా రుణమే తీసుకోలేదు. ఏపీఎండీసీ రుణం రూ.5 వేల కోట్లు అని రాసాడు.. అసలు ఇది సాక్షికి ఎవరు చెప్పారో దేవుడికే తెలియాలి.

కాగ్ లెక్కల ప్రకారం 6 నెలలు అంటే జూన్ నుంచి నవంబర్ వరకు అయిన ప్రభుత్వ ఖర్చు : Rs.1, 09,328.46 కోట్లు (లక్షా 9 వేల కోట్లు)
( Expenditure on Revenue Account, Interest payment, Salaries, Employees Pensions, Subsidy Amounts. Source CAG )
ఈ ఏడు నెలల్లో, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పెద్ద ఖర్చులు ఇవి. ఇందులో కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు లెక్క ఎక్కడా లేదు. జగన్ రెడ్డిలాగా రుషికొండ ప్యాలెస్ లు కట్టుకోలేదు, ఇంటి చుట్టూ కోట్లు పెట్టి ఇనుప కంచెలు కట్టు కోలేదు. కోట్లు ఖర్చుతో ఎగ్గు పఫ్ఫులు మెక్కలేదు

* NTR Bharosa Pensions (July to December) – Rs.20,581 Crores / 64 Lakhs
* Paddy Procurement – Rs.6000 Crores / 4 Lakhs
* Deepam Scheme – Rs.476.15 Crores / 81 Lakh Cycliners
* Roads – Rs.840 Crores
* ధాన్యం బకాయిలు – Rs.1674 Crores / 85000 Farmers
* NTR vaidya Seva బకాయిలు – 700 Crores
* Neeru CHettu Pending Bills – Rs.256 Crores
* Capital Farmers Arrears – Rs.400 Crores
* Chikki Eggs Arrears – Rs.178 Crores
* Upadii Haame Arrears – Rs.331 Crores
* NTR videsi vidya Arrears – Rs.33 crores
* Contractor Arrears – Rs.750 Crores
* Salaries and Other Arrears – Rs.300 Crores
* Released for Housing – 331 Crores

RBI Loan Details

June
Jun 25, 2024 – Rs.2000 Cr

July
Jul 30, 2024 – Rs.3000 Cr
Jul 16, 2024 – Rs.2000 Cr
Jul 02, 2024 – Rs.5000 Cr

August
Aug 30, 2024 – Rs.4000 Cr
Aug 27, 2024 – Rs.3000 Cr

September
Sep 03, 2024 – Rs.4000 Cr

October
Oct 29, 2024 – Rs.3000 Cr
Oct 01, 2024 – Rs.3000 Cr

November
Nov 26, 2024 – Rs.2000 Cr
Nov 05, 2024 – Rs.2000 Cr

December
Dec 31, 2024 – Rs.5000 Cr
Dec 03, 2024 – Rs.4237 Cr

LEAVE A RESPONSE