• సురక్ష కార్యక్రమం వైసీపీనేతలు, కార్యకర్తల రక్షణ కోసమే గానీ ప్రజలరక్షణకోసం కాదు
• నాలుగన్నరేళ్లలో దిక్కుమాలిన పథకాలతో కోటిన్నర మందికి తీరని అన్యాయం చేసిన జగన్, సిగ్గులేకుండా ఏముఖంపెట్టుకొని సురక్షం, సుభిక్షం అంటున్నాడు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
సురక్షితమైన ప్రదేశంనుంచి జగన్మోహన్ రెడ్డి ‘సురక్ష’కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ప్రజలుసంతోషంగా ఉన్నారని కల్లబొల్లికబుర్లు చెబుతున్నాడని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే .
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏనాడూ రాష్ట్రం, ప్రజలు సురక్షితంగా ఉన్నది లేదు
గడపగడపకు మనప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొట్టడంతో, చేసేదిలేక సురక్ష పేరుతో జగన్ కొత్తవేషం కట్టాడు. సురక్ష కార్యక్రమం జగన్, అతనిపార్టీ నేతలు, కార్యకర్తలరక్షణ కోసమేగానీ ప్రజలరక్షణకోసం కాదు.
గతంలో కూడా జగన్ గడపగడపకు ప్రభుత్వమనే కార్యక్రమాన్ని ప్రకటించాడు. గడప గడపకు వైసీపీఅంటే ప్రజలు తంతారన్నభయంతో, పార్టీపేరుతీసేసి ప్రభుత్వంపేరు పెట్టాడు. గడపగడపకు మనప్రభుత్వం పేరుతో తనపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ప్రభుత్వాధికారులు, ఇతరత్రాసిబ్బందిని పంపితే ప్రజలు ఏమీఅనరులే అనిభావించా డు. కానీ జగన్ అనుకున్నది జరగలేదు. ప్రభుత్వమైనా, ఎమ్మెల్యేలు, మంత్రులైనా ఎవరైనా తమకు ఒకటేనని ప్రజలు వెంటపడితరిమారు.
వైసీపీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ గ్రామాల్లోకి రావొద్దని నిరసనలు వ్యక్తంచేశారు. తానుఅనుకున్న పాచికపారకపోవడంతో ఇప్పుడు ప్రజల్నిమరలాకొత్తగా వంచించడానికి సురక్ష పేరుతో కొత్తవేషం కట్టాడు. జగన్ తనరక్షణకోసమే సురక్ష కార్యక్రమం తీసుకొచ్చాడుతప్ప ప్రజ ల రక్షణకోసం కాదు. ఎన్నికలు ఎప్పుడువచ్చినా జగన్ ను, అతనిప్రభుత్వాన్ని తరి మికొట్టడానికి ప్రజలు సిద్ధంగాఉన్నారు.
ప్రతి నియోజకవర్గంలో ప్రజలు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్రఆగ్రహావేశాలతో ఉన్నారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్, నీళ్లు, గాలి ఇలాదేన్నీవదలకుండా జగన్ అండ్ కో దోచేస్తున్నారు. వారిదోపిడీదెబ్బకు పంచభూతాలే రాష్ట్రం నుంచి మాయమయ్యాయి.
రాష్ట్రంలో అరాచకాలు, దుర్మార్గాలకు అంతేలేకుండా పోయింది. ఏపీలో ఏ వర్గముూ సురక్షితంగా లేకపోతే, జగన్ ఏముఖంపెట్టుకొని సురక్షం.. సుభిక్షం అంటున్నాడు?
వైసీపీ దొంగలదోపిడీ వ్యవహారం పతాకస్థాయిలో సాగుతుంటే, మరోపక్క రాష్ట్రంలో జరిగే అరాచకాలు, దుర్మార్గాలకు అంతేలేకుండాపోయింది. ఆఖరికి సొంతపార్టీ ఎంపీ కుటుం బసభ్యులకే రక్షణ కల్పించలేని దుస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. మహిళలు బిక్కు బిక్కమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. తనఅక్కను ఏడిపించవద్దని చెప్పిన పాపా నికి 15ఏళ్లబాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు.
ఏలూరులో యువతిపై యాసిడ్ దాడి చేశారు. ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరగడానికి గజగజవణికిపోతున్నారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు వారిఇళ్లల్లో కూడాసురక్షితంగా లేని దుస్ధితి తీసుకొచ్చిన జగన్ ఏముఖం పెట్టుకొని సురక్ష కార్యక్రమం ప్రకటించాడో సమాధానంచెప్పాలి.
దిక్కుమాలిన పథకాలతో నాలుగన్నరేళ్లలో కోటిన్నరమందికి అన్యాయంచేశాడు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఎస్సీఎస్టీ, బీసీ, మైనారిటీలు, కాపులు అందరూ జగన్ మోసానికి బలైనవాళ్లే
దిక్కుమాలిన పథకాలపేరుతో కోటిన్నరమందిని జగన్ మోసగించాడు. విద్యుత్ బిల్లు ఎక్కువైందని, వ్యవసాయభూమి ఉందని, నాలుగుచక్రాలవాహనాలున్నాయని రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించాడు. అమ్మఒడిపేరుతో ఇంట్లోఎంతమంది చదువుకునే పిల్లలుంటే, అందరికీ రూ.15వేలు ఇస్తానన్న జగన్, ముఖ్యమంత్రి అయ్యాక ఇంటికి ఒక్కరికే ఇస్తానని మెలికపెట్టాడు. ఒకసంవత్సరం పూర్తయ్యాక రూ.15వేలను కాస్త రూ.14వేలకు, చివరకు రూ.13వేలకు తగ్గించాడు.
రాష్ట్రంలో 84లక్షలమంది విద్యార్థు లుంటే, కేవలం 44లక్షలమందికే అమ్మఒడిఇస్తూ తల్లుల్ని వంచించాడు. వాహనమిత్ర పథకంపేరుతో 8.5లక్షలమంది డ్రైవర్లకు అన్యాయంచేశాడు. ఎస్సీఎస్టీలకు ఇవ్వాల్సిన ఉచితవిద్యుత్ కు మంగళంపాడేశాడు. 35లక్షల ఎస్సీఎస్టీకుటుంబాలు జగన్ ప్రభు త్వంలో ఉచితవిద్యుత్ అవకాశాన్ని కోల్పోయాయి. అలానే రైతుభరోసాకు కోతలుపె ట్టి, 15లక్షలమంది రైతులకు అన్యాయం చేశాడు.
వసతిదీవెన అంటే చదువుకునే పిల్ల లకు హస్టల్ సౌకర్యం కల్పించడం. ఆ విధమైనఏర్పాటు ఎప్పటినుంచో ఉంది. కానీ జగ న్ వచ్చాక అమ్మఒడి సొమ్ము అందినకుటుంబంలో ఎవరైనాహాస్టల్లో ఉండిచదువుకు నేవారుంటే, వారికి వసతిదీవెన ఆర్థికసాయం లేకుండాచేశాడు. ఇంటర్ విద్యార్థులకు వసతిదీవెన, మధ్యాహ్నభోజనం తీసేశాడు. చేనేతకార్మికులకు మగ్గంఉంటేనే సాయ మనిచెప్పి, 2.50లక్షలమంది నేతన్నలకు అన్యాయం చేశాడు.
టీడీపీప్రభుత్వంలో చంద్రబాబు ఎస్సీఎస్టీ, బీసీలు, మైనారిటీలకు, కాపులకు కార్పొరేషన్లుఏర్పాటుచేసి, ఆయావర్గాలకు ఇతోధికంగా ఆర్థికసాయంచేసింది. ఆయాకార్పొరేషన్లద్వారా టీడీపీ ప్రభుత్వం కోటి95లక్షలమందికి స్వయంసహాయకరుణాలు అందించింది. జగన్మోహన్ రెడ్డి ఆయాకార్పొరేషన్లన్నీ రద్దుచేసి, 1.95లక్షలమందికి తీరనిఅన్యాయంచేశాడు. గృహనిర్మాణరంగంలో భాగంగా టీడీపీప్రభుత్వం పేదలకోసంప్రకటించిన ఇళ్లను రద్దు చే శాడు.
గృహ నిర్మాణరంగం పథకాలకు సంబంధించి 4ఏళ్లలో 5లక్షల మందికి అన్యాయం చేశాడు. టీడీపీ ప్రభుత్వం అన్నివర్గాలకు పెళ్లికానుకకింద పెళ్లిసమయంలో ఆర్థిక సాయంఅందిస్తే, నాలుగన్నరేళ్లలో జగన్ ఎవరికీ4రూపాయలు ఇచ్చిందిలేదు. ఈ విధంగా జగన్ ప్రజలకు ఇచ్చేదానికంటే వారికిచేసిన అన్యాయమే ఎక్కువ. ప్రజలు స్వే చ్ఛగా బతికేఅవకాశంలేకుండాచేసి, చివరకు పథకాల్లో మోసగించి, అదిచాలదన్నట్లు తప్పుడుకేసులతో వేధిస్తున్నాడు.
మూడురాజధానులు అనిచెప్పి అమరావతికి భూములిచ్చినవారిని రోడ్డనపడేశాడు. ఒక్కరాజధానిలో ఒక్కఇటుకపెట్టని అసమర్థు డు మూడురాజధానులు కడతాడా? అబద్ధాలు, మోసాల్లో జగన్ దిట్ట. చిన్నపిల్లల మనసుల్లో కూడా రాజకీయవిషబీజాలు నాటేలా మాట్లాడతాడు. ఉదయంలేస్తే అబద్ధా లుచెబుతూ, ప్రజల్ని వంచించాలని చూస్తున్నాడు. ఎవరైనాప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులుపెట్టి, వేధించడం. రాష్ట్ర పోలీస్ శాఖ వైసీపీ అనుబంధవిభాగంగా పనిచేస్తోంది.
రాష్ట్రం గంజాయిహబ్ గా, మాదకద్రవ్యాలకు కేంద్రబిందువుగా మారిందంటే జగన్ నిర్వాకంవల్లే. గంజాయిస్మగ్లింగ్ తో కోట్లుసంపాదిస్తున్నారంటే వీళ్లుఅసలు మనుషులే నా? దేశంలో ఎక్కడ గంజాయిదొరికినా, మాదకద్రవ్యాలు పట్టుబడినా ఏపీపేరే వినిపి స్తుంటే, డీజీపీమాత్రం సిగ్గులేకుండా, అంతాబ్రహ్మండంగాఉందని చెబుతున్నాడు. ఆడపిల్లలపై అత్యాచారాలు, భూకబ్జాలు, దోపిడీలు, చిన్నారుల్ని తగలబెట్టడమేనా శాంతిభద్రతలు భేషుగ్గా ఉండటమంటే?
జగన్ కొత్త ఎత్తుల్ని ప్రజలు పసిగడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడువచ్చినా జగన్ కు, అతనిప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు
జగన్ ప్రకటించిన ‘సురక్ష’ కార్యక్రమం తనరక్షణ, తనపార్టీ నేతలు, కార్యకర్తలరక్షణ కోసమే గానీప్రజలకోసం కాదు. ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికి జగన్ ఇలాంటి కొత్తకొత్తఎత్తులు ఎన్నివేసినా ఉపయోగంలేదు. ప్రజలనుంచి కొల్లగొట్టిన లక్షలకోట్లతో ఎన్నికల్లో గెలవాలనిచూస్తున్న జగన్ కుయుక్తుల్ని ప్రజలుపసిగట్టారు. తగిన సమయంలో తగినవిధంగా జగన్మోహన్ రెడ్డికి, అతనిప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.” అని ఆనంద్ బాబు తేల్చిచెప్పారు.