– ఎమ్మెల్యే కన్నా విమర్శ
సత్తెనపల్లి : కులాలు, మతాల మధ్య చిచ్చు రేపి పబ్బం వైసిపి ముఠా పబ్బం గడుపుకుంటుందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సత్తెనపల్లి రఘురామ్ నగర్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. జగన్ హయాంలో రాక్షస, అరాచక పాలన సాగిందని దుమ్మెత్తిపోశారు.
శవాలతో రాజకీయం చేస్తున్న జగన్ అనే రాక్షసుడిని వదిలించుకుని రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఓర్వలేక కులాల మధ్య, మతాల మధ్య కుంపట్లు పెడుతున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో జగన్ కు దారుణం గా ప్రజులు బుద్ధి చెప్పినా ఆ ముఠా వైఖరిలో మార్పు రాలేదన్నారు. ప్రత్తిపాడులో మహిళా ఆత్మహత్య చేసుకుంటే వైసీపీ నాయకులు శవ రాజకీయం చేశారు… మాజీ ఎంఎల్ఏ లు ఎంపిల కు బూతులు తిట్టే స్క్రిప్ట్ జగన్ దగ్గరినుంచే వస్తుంది.
శవాల దగ్గర వైసీపీ నాయకులు గుంట నక్కలుగా కాచుకొని కులాలను రెచ్చగొడుతున్నారు.. విమర్శకు ప్రతి విమర్శ చేసే సంస్కృతి లేదన్నారు. రాష్ట్ర ప్రజలు శాంతి, సామరస్యంతో జీవించాలని, అభివృద్ధి పథంలో పయనించాలని కోటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కూటమి ప్రభుత్వం శాంతి, భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారనైనా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే కన్నా హెచ్చరించారు.