– జగన్ తన డబ్బుతో పోలీసులను కూడా కొంటున్నారా ?
– ఇంటలిజెన్స్ నిద్రపోతుందా ?
– జగన్ కారు ప్రమాదం తప్పిదం లో పోలీసుల పాత్ర కూడా ఎక్కువ
– వంద మందికి అనుమతి ఇచ్చి వేల మంది వస్తుంటే ఏం చేశారు
– జగన్ ఓట్లను కొన్నట్లు..డబ్బులతో పోలీసులను కూడా కొన్నాడా ?
– జగన్ అజెండా ఒకటే..బలప్రదర్శన
– చంద్రబాబు మంచి కాదు.. ఓట్లేసినందుకు ముంచారు
– సూపర్ సిక్స్ ఇవ్వనందుకు మంచి చేశారా ?
– 17 వేల కోట్ల విద్యుత్ బిల్లుల భారం మోపినందుకు మంచి చేశారా ?
– గత ప్రభుత్వం లెక్క మీరు కూడా అప్పులు చేస్తున్నందుకు మంచి చేశారా ?
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
గుంటూరు: సింగయ్య మృతి జగన్ నిర్లక్ష్యంతో పాటు పోలీసుల వైఫల్యమే. జగన్ కి అనుమతి ఇచ్చింది 5 కార్లు. అనుమతి ఇచ్చింది 100 వందికి. మరి వేల మంది వస్తుంటే పోలీసులు ఏం చేశారు ? కారు టైర్ కింద పడితే గమనించకపోవడం జగన్ తప్పు. ఇది ప్రమాదమే కావొచ్చు. కావాలని ఎవరు చేయరు. కానీ పరిస్థితులు గమనించాలి.
మనిషి టైర్ కింద పడితే.. పక్కకు లాగేస్తారా ? పక్కకు పడేసి మీ దారిన మీరు వెళ్ళిపోతారా ? కనీసం మానవత్వం ఉండాలి కదా? వెంటనే అంబులెన్స్ పిలిచి ఆసుపత్రిలో చేర్చాలి కదా? కారు కింద పడింది YCP కార్యకర్తే కదా?
ఈ ఘటన లో పోలీసుల పాత్ర ఎక్కువగా ఉంది. జనం వేల మంది వస్తుంటే ఎందుకు హౌజ్ అరెస్ట్ చేయలేదు ? వేలమంది వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు ? ఇంటలిజెన్స్ నిద్రపోతుందా ? జగన్ అజెండా జనసమీకరణ, బలప్రదర్శన. జగన్ తన డబ్బుతో పోలీసులను కూడా కొంటున్నారా ? జగన్ యాత్రలు అన్ని బల ప్రదర్శన యాత్రలే. ఆయనకు ప్రజా సమస్యలు అక్కర్లేదు. కేవలం ఉన్నాను అని నిరూపించుకోవడం అంతే.
అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయన ఏ కార్యకర్త ఇంటికి పోలేదు. ఇప్పుడు నమ్మకం అని నిరూపించుకునే ప్రయత్నం. జగన్ అజెండా ఇదే. జగన్ బలప్రదర్శన యాత్రలు చేయకుండా నిషేధం విధించాలి.
చంద్రబాబు మంచి చెప్తాడట. చేసిన మంచి చెప్పుకుంటాడట. ఏడాది కాలంలో ఏం మంచి చేశారు ? మంచి కాదు ముంచారు అని జనం అంటున్నారు. మంచి చేస్తారు అనుకుంటే ముంచారని చెప్తున్నారు మీరు మంచి గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే. చంద్రబాబు చేసిన మంచి ఏంటి ?
ఏడాదిలో 1.50 లక్షల కోట్లు అప్పులు చేయడం మంచినా ? ఏడాదిలో 15 వేల కోట్లు కరెంట్ బిల్లుల భారం వేయడం మంచినా ? రైతులకు గిట్టుబాటు కల్పించకపోవడం మంచినా ? ఎక్కడ ఉంది మంచి.. అంతా ముంచారు కదా ?చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం.. సూపర్ సిక్స్ తో సహా ఏ హామీ పూర్తిగా అమలు చేయలేదు. అన్నదాత సుఖీభవ కింద దాదాపు 30 లక్షల మంది రైతులను ముంచే ప్రయత్నంతల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలను మోసం చేశారు.
గ్యాస్ సిలిండర్ ఇచ్చేది అరకొర. ఉచిత బస్సు పథకం ఊసే లేదు. మహాశక్తి పథకం కింద మహిళలను మోసం చేశారు.
సూపర్ సిక్స్ హామీ ఇచ్చేటప్పుడు P4 కి ముడిపెడతాం అని ఎందుకు చెప్పలేదు ?జాబ్ క్యాలెండర్ మోసం. నిరుద్యోగ భృతి మోసం. 20 లక్షల ఉద్యోగాలు మోసం.
ఇన్ని మోసాలు చేసి మంచి ఎలా చెప్పుకోవాలి అనుకున్నారు ? పెన్షన్ దారుల సంఖ్యను తగ్గించారు.