Suryaa.co.in

Andhra Pradesh

జగన్ తిరుమల పర్యటన రద్దు భక్తుల విజయం

– సిరిపురపు శ్రీధర్ శర్మ

అమరావతి: వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆలయంలోకి రావాలంటూ అధికార పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో చివరి క్షణంలో పర్యటన రద్దు అయింది.

హిందూ ధార్మిక సంఘాలు, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, స్వామీజీలు, సంతులు, వివిధ రాజకీయ పార్టీలు జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల కొండ ఎక్కితే కచ్చితంగా అడ్డుకుంటామని పిలుపునివ్వడంతో తిరుమల పర్యటన జగన్ రద్దు చేసుకున్నారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక రకంగా ఇది శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తుల విజయం.. ఇప్పటికైనా సరే జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించొద్దని హెచ్చరించారు.

LEAVE A RESPONSE