జై భీమ్…ఇది కేవలము దళిత..లేదా నిమ్న వర్గాలకు సంబందించిన సినిమా కాదు..న్యాయం కోసం పోరాడే ఒక కమ్యూనిస్ట్ భావ జాలం ఉన్న ఓ లాయర్ కథ..
ఈ దేశంలో పేద వారికి న్యాయం జరుగుతుంది అని ఆశ రేపిన సినిమా. ఈ సినిమా లో ఒక సన్నివేశం ఆలోచింప చేసింది. తన భర్తను కోల్పోయిన ఓ మహిళ ను పోలీసు డిపార్ట్మెంట్ DGP గారు పిలిచి “కేసు వల్ల నీకు ఏం వస్తుంది..అదే ..కేసు రాజీ చేసుకొంటే మీ ఆయనను చంపిన వారి నుండి నువ్వు ఊహించ నంత డబ్బు ఇప్పిస్తాం” అన్నప్పుడు…ఆ మహిళ చెప్పిన ఒక మాట నేడు పరిహారం తీసుకొంటున్న అనేక మందికి చెంప దెబ్బ.
సార్ .. రేపు నా పిల్లలు పెద్ద వారు అయి..ఈ డబ్బులు ఎక్కడవి అని అడిగితే.. మీ నాన్నని చంపిన వారు ఇచ్చిన డబ్బుతోనే మీరు పెద్ద వారు అయ్యారు అంటే..నా పిల్లలకు ఏం సమాధానం చెప్పాలి సార్” అని చెప్పిన సమాధానం చాలా మంది కి ఒక గుణ పాఠం.
– సుబ్బారావు గాలంకి