– సీపీఐ జాతీయ కార్యదర్శి
హైదరాబాద్: దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యం కావు. రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన 18 వేల పేజీల నివేదికలో ఏముందో బయట పెట్టండి. అఖిలపక్ష సమావేశం పెట్టకుండా, ఎవరితోనూ చర్చించకుండా కేవలం క్యాబినెట్ లో పెట్టి ఆమోదించింది వారిపై ఉన్న వ్యతిరేకతను మళ్లించడం కోసమే. వన్ నేషన్, వన్ ఎలెక్షన్, వన్ లీడర్ అంటూ ఒక ప్రమాదకర సిద్ధాంతాన్ని బీజేపీ తెర మీదకు తెస్తోంది.