– పెట్టుబడులు, ఐ.టీ పార్కులు,సెజ్ లు, టెక్నాలజీ, నైపుణ్య శిక్షణపై మంత్రితో ప్రధానంగా చర్చ
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో జపాన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. శనివారం సాయంత్రం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయంలో మంత్రి గౌతమ్ రెడ్డిని కలిసి పెట్టుబడులు, ఐ.టీ పార్కులు,సెజ్ లు, టెక్నాలజీ, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.
ఏపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ప్రతినిధులు ఆసక్తిగా ఉన్నట్లు జపాన్ ప్రతినిధుల బృందం వెల్లడించింది. ప్రభుత్వం ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్య రంగాలలో తీసుకువస్తోన్న వినూత్న సంస్కరణలు, యువతకు ఉపాధి పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న చర్యలను మంత్రి గౌతమ్ రెడ్డి జపాన్ ప్రతినిధుల బృందానికి వివరించారు. సోమవారం మరోసారి భేటీ అయి సంబంధిత శాఖల ప్రత్యేక కార్యదర్శులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో చర్చించిన అనంతరం ఆయా అంశాలపై ముందుకెళదామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.