Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.16 లక్షలు తీసుకున్న జోగి రమేష్‌ అనుచరుడు

– గ్రీవెన్స్ లో గోడు వెళ్లబోసుకున్న బాధితులు
– అర్జీలు స్వీకరించిన న్యాయం జరిగేలా చూస్తామని నేతల హామీ

మంగళగిరి: కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం ఉత్తర చిరువోలు లంక గ్రామానికి చెందిన ఉప్పాల అనిల్ కుమార్ బుధవారం తెలుగుదేశం పార్టీ ) కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో విజ్ఞప్తి చేస్తూ.. మాజీ మంత్రి జోగి రమేష్ కు అత్యతంత సన్నిహితుడైన మోర్ల మహిదర్ హౌసింగ్ డిపార్ట్ మెంట్ లో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 16 లక్షల డబ్బులు తీసుకొని తనను మోసం చేశారని ఆరోపించారు.

తననే కాకుండా జోగి రమేష్ పేరు చెప్పుకొని చాలా మంది నిరుద్యోలను ఉద్యోగాల పేరుతో వంచించారని.. అతనిపై చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వలో పోలీసులను ఆశ్రయిస్తే కేసు తీసుకోలేదని.. అతనిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడులకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

• బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఫాలోవర్ అభిమాని అయిన వర్రా సాగర్ రెడ్డి అనే వ్యక్తి తాను హెడీఎఫ్ సీ బ్యాంక్ లో పనిచేస్తున్నానని చెప్పి తమకు బ్యాంక్ లో లోన్ ఇప్పిస్తామని నమ్మించి.. ముందుగా ప్రొసెసింగ్ ఫీజు కట్టాలని చెప్పి తమను మోసం చేసి తమ బ్యాంక్ లోఉన్న మొత్తం డబ్బులను కొట్టేశారని.. అతనిపై చర్య తీసుకోని తమకు డబ్బులు ఇప్పించాలని గుంటూరుకు చెందిన గంజరపల్లి చిన్నయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఆరోపించారు.

• తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా తాను, తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి మీద కేసుపెడితే పోలీసులు విడేకుల కృష్ణారావుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. దాంతో అతను తమ ఇంటికి మనుషులను తీసుకు వచ్చి బెదిరిస్తున్నారని.. దయ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలానికి చెందిన శ్రీలక్ష్మి అనే మహిళ గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి ఫిర్యాదు చేశారు.

• తమ స్థలానికి పచ్చల సురేష్ అనే వ్యక్తి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలం చుట్టూ ఉన్న కంచెను కూల్చి ఇంటిని పడేశారని.. దీనిపై విచారించి అతనిపై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటకు చెందిన ఈదులమూడి దయమ్మ విజ్ఞప్తి చేశారు.

• భీమవరం కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న బి.నారాయణరెడ్డి అనే వ్యక్తి జాబ్ ఇప్పిస్తానని రూ. 9.50 లక్షలు తీసుకొని తనను మోసం చేశాడని.. అతనిపై చర్యలు తీసుకొని తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం తాడేపల్లికి చెందిన కేఎస్ ప్రియ అనే మహిళ వేడుకుంది.

• పల్నాడు జిల్లా, అమరావతిలో తాము 2006లో రెండు సెంట్లు స్థలం కొనుగోలు చేసి అందులో రెకుల షేడ్ వేసి అద్దెకు ఇవ్వగా అద్దెకు తీసుకున్న అతను కొంత కాలం అద్దె సక్రమంగా చెల్లించి తరువాత అద్దె ఇవ్వకుండా ఇంటిని ఖాళీ చేయకుండా.. తమ ఇంటిని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని.. షేక్ మస్తానవలిపై చర్యలు తీసుకొని ఇంటి ఖాళీ చేయించాల్సిందిగా బండారు సూర్యాదేవి అనే మహిళ నేతలకు విజ్ఞప్తి చేసింది.

• బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడు గ్రామానికి చెందిన కేసాని సాంబశివరావు విజ్ఞప్తి చేస్తూ.. తమ వద్ద మొక్కజొన్న పంటను గవర్నమెంట్ టీచర్ చిన్నం సురేష్ అనే వ్యక్తి కొనుగోలు చేసి తమమ పంట డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టేందుకు ఇబ్బంది పెడుతున్నాడని.. అతని నుండి డబ్బులు ఇప్పించాలని వారు వేడుకున్నారు.

• నెల్లూరు జిల్లా, వింజమూరుకు చెందిన వెంకట రమణయ్య ఫిర్యాదు చేస్తూ.. వైసీపీ నేతలు అక్రమంగా ప్రభుత్వం స్థలాన్ని ఆక్రమించుకొవడమే కాకుండా అందులో రూములు కట్టి అద్దెలకు ఇస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో ఫిర్యాదు చేస్తే కలెక్టర్ ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పినా నేటికి అధికారులు పట్టించుకోలదేని గ్రీవెన్స్ లో అర్జి ఇచ్చారు.

• విజయనగరం జిల్లా, భోగాపురం మండలం దివసపాలెం గ్రామానికి చెందిన ధర్మాల అప్పారావు విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేతో తమ పూర్వికుల నుండి సంక్రమించిన భూమిని మరోకరి పేరుపైకి మార్చారని దాన్ని సరి చేసి తమ భూ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE