– చంద్రన్న ప్రభుత్వంలో ఐదేళ్లలో విదేశీ విద్య ద్వారా లబ్దిపొందిన దళితులు 2,500 మంది
– జగన్ రెడ్డి హయాంలో కేవలం 27 మందే
– చంద్రన్న పాలనలో అంబేడ్కర్ విదేశీ విద్యకు రూ.375 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ రెడ్డి చేసింది కేవలం రూ.7 కోట్లే మాత్రమే
– రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్
అమరావతి: పేద దళిత విద్యార్ధులు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విదేశీవిద్యానిధి పథకం తీసుకొస్తే.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ మహనీయుని పేరు తొలగించి, అవమానించడమే కాకుండా జూపూడి ప్రభాకర్ అంబేడ్కర్‌ను హేళన చేసి మాట్లాడటం సిగ్గుచేటని రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్ ధ్వజమెత్తారు.
విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు తొలగించడంపై శుక్రవారం నాడు మచిలీపట్నంలో విలేఖరులు అడిగిన ప్రశ్నకు జూపూడి స్పందించిన తీరు తీవ్ర అభ్యంతరకరగా ఉందన్నారు. జూపూడి వ్యాఖ్యలపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికి దళిత జాతి ఆరాద్య దైవమైన బాబాసాహెబ్‌ను అవమానిస్తావా? అని జూపూడిని ప్రశ్నించారు.
‘జూపూడి కుటిల మనస్తత్వం ఉన్న వ్యక్తి. జూపూడికి అంబేద్కర్ వాదినని చెప్పుకునే అర్హత లేదు. ఇటీవల పులివెందుల పాత బస్టాండులో అంబేడ్కర్ విగ్రహాన్ని జగన్ రెడ్డి తన తండ్రి విగ్రహం పాదల కింద పెట్టి అవమానిస్తే…నేడు దళిత పుట్టుక పుట్టిన జూపూడి జగన్ రెడ్డి మెప్పు కోసం అంబేడ్కర్ పై అవాకులు, చవాలుకు పేలుతున్నాడని అన్నారు. విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు అవసరం లేదని.. డబ్బే ముఖ్యమని మాట్లాడిన జూపూడి తన చావు తెలివితేటలు చూపించాడు.
చంద్రన్న ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య పథకం ద్వారా లబ్దిపొందిన దళితులు 2,500 మంది అయితే.. జగన్ రెడ్డి హయాంలో కేవలం 27 మందే. చంద్రన్న పాలనలో అంబేడ్కర్ విదేశీ విద్యకు రూ.375 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ రెడ్డి చేసింది కేవలం రూ.7 కోట్లే మాత్రమే. ఈ లెక్కలకు నీ దగ్గర సమాధానం ఉందా?. అంబేడ్కర్ పెట్టిన భిక్షతో ఇంతటి వాడివై పదవులు అనుభవిస్తూ.. జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారి ఆ మహనీయుని అవమానించడం జూపూడికి తగదన్నారు.
డా. సుధాకర్, డా. అచ్చన్న లాంటి 188 మంది దళితులను చంపి, 12 వేలకు పైగా దాడులు చేసిన జగన్ రెడ్డిని జూపూడి సమర్ధించడం దళిత ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. జూపూడి లాంటి చెంచాలు వైకాపాలో ఉండటం వల్లే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును జగన్ రెడ్డి ప్రక్కన పెట్టుకుని తిరుగుతున్నాడన్నారు. నీలాంటి బూట్లు నాకే బానిస లీడర్లు చూస్తూ ఉపేక్షించేది లేదు.
మరోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పై, దళిత జాతిపై చెత్త వాగుడు వాగితే వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించి దాడి చేస్తాం. అంబేడ్కర్ ను అవమానించిన నీవు బేషరతుగా విజయవాడ స్వరాజ్ మైదాన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తప్పు ఒప్పుకుని దళిత జాతికి, అంబేద్కర్‌కి క్షమాపణలు చెప్పి తప్పు సరిదిద్దుకోవాలని హెచ్చరించారు.