– తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్
– భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాగడాల ర్యాలీ నిర్వహించిన బీజేవైఎం
– ట్యాంక్ బండ్ నుండి కొమరం భీం విగ్రహం (ట్యాంక్ బండ్) వరకు కాగడాల ర్యాలీ
హైద్రాబాద్ విశ్వవిద్యాలయంలోని హెచ్‌సియు భూములను కాపాడడం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థుల పై జరిగిన లాఠీచార్జి కి వ్యతిరేకంగా, మూగజీవుల అరణ్య రోదనకు మద్దతుగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో.. జల్ జంగల్- జమీన్ఉద్యమ స్ఫూర్తితో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ.. ఈ తీర్పు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులకు ఒక చెంపపెట్టు. 2300 ఎకరాల స్థలాన్ని యూనివర్సిటీ పేరుమీద రిజిస్ట్రేషన్ చేసే వరకు, ప్రభుత్వం విద్యార్థులకు ఈ సమాజానికి చేసిన నష్టానికి బాధ్యతగా లక్ష మొక్కలను యూనివర్సిటీ లో నాటాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహేష్, తరుణ్, చితరంజన్,కుమార్,లడ్డు యాదవ్, ప్రధాన కార్యదర్శిలు సామల పవన్, గణేష్, కార్యదర్శిలు అశోక్, అరవింద్, సుధీంద్ర శర్మ, చక్రి, జిల్లా అధ్యక్షులు భారత్, నితిన్, శివాజీ, అనిత, అవినాష్, శ్రవణ్, ఆకాష్,వంశీ, కుశల్, ఆయుష్, కార్యకర్తలు నాయకులు, యూనివర్సిటీ విద్యార్థులు, జంతు ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు..