Suryaa.co.in

National

కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాం

– గోవా సీఎం ప్రమోద్ సావంత్

కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం మతవిధ్వేషాలు రెచ్చగొట్టేది. నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసింది. పేపర్ లీకేజ్ కు కారణమై నిరుద్యోగుల ఉసురుతీసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాం. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ చేసిన స్కాంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చండు కేసీఆర్. బీఆర్ఎస్ నాయకులు రైతులు, పేదల భూములను కబ్జా చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1200 మంది యువకులను బలి తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రక్తపుబొట్టు చిందకుండా, ఆత్మహత్యలు లేకుండా భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది యువత బలిదానమయ్యారు. అమరవీరులను బీజేపీ ఎప్పుడు మరువదు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే బలిదానమైన యువత కుటుంబాలను ఆదుకుంటుంది. పసుపు బోర్డు ఏర్పాటు కు కేసీఆర్ ప్రభుత్వం సహకరించడం లేదు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారు. అమలుకు నోచుకోని హామీలతో మోసం చేసిన కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు నమ్మవద్దు. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతున్నా. కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించండి.

LEAVE A RESPONSE