– రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం
ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాపు రిజర్వేషన్ బిల్లు అంశంపై, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సామాజిక న్యాయం, సాధికారత మరియు భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖల నుండి సమాధానాలు కోరారు.
రెండు మంత్రిత్వ శాఖల నుండివచ్చిన సమాధానాల సారాంశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఓబీసీ రేజర్వేషన్ల అంశం స్టేట్ లిస్ట్ కు సంబంధించింది కనుక, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదని స్పష్టం చేసింది.
కాపు (విద్యాసంస్థల్లో సీట్ల రిజర్వేషన్లు మరియు రాష్ట్ర పరిధిలోని సేవల్లో నియామకాలు లేదా పోస్టులు) బిల్లు, 2017 గౌరవనీయ భారత రాష్ట్రపతి ఆమోదం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పంప బడినందున, ఇది సాధారణ ప్రక్రియగా వ్యాఖ్యల కోసం వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు పంప బడింది. కొన్ని మంత్రిత్వ శాఖల నుండి వచ్చిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపటం జరిగింది .
రాష్ట్ర OBC జాబితాలో ఒక కులాన్ని చేర్చడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ, 04.04.2019న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన కాపు OBC బిల్లు, 2017ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు కేంద్ర ప్రభుత్వం లోని రెండు మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయి.
రాష్ట్రంలో 50 శాతానికి మించిన మరాఠా OBC రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం భారత రాష్ట్రపతి ఆమోదం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపలేదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మరింత స్పష్టం చేసింది.
కాపు ఒబిసి రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన సమాధానాలపై పార్లమెంటు (రాజ్యసభ) సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, “టిడిపిమరియు వైసీపీ రెండు పార్టీల ప్రభుత్వాలు కాపు సామాజికవర్గాన్ని తప్పుదోవ పట్టించాయి. కాపు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు భారత రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని తప్పుడు ప్రచారం చేశాయి. ఈ విషయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలో ఉందని పార్లమెంటు స్పష్టంగా తెలియ చేసింది.”
పార్లమెంటులో కేంద్ర ప్రభత్వం తన ప్రశ్నలకు సమాధానమిస్తూ స్పష్టత ఇచ్చిన సందర్భంగా, గతంలో కేంద్రానికి అనవసరంగా పంపిన కాపు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు, 2017ను కేంద్రం నుంచి వెంటనే ఉపసంహరించుకుని, కాపులకు బీసీ రిజర్వేషన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తక్షణమే స్పష్టం చేయాలని, కాపులకు సామజిక న్యాయం చేయాల్సిందేనని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.