– సాదినేని యామిని శర్మ
విజయవాడ: మొంథా తుపాను ప్రభావం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులు అహర్నిశలు శ్రమించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఇతర నాయకులు బాధితులను పరామర్శించి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. తుపాను కారణంగా రేషన్ లేక ప్రజలు ఇబ్బంది పడకూడదని ముందుగానే 14145 రేషన్ షాపులకు ప్రధాని మోదీ రేషన్ పంపించారని బీజేపీ నాయకురాలు సాదినేని యామిని శర్మ అన్నారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు.
మోదీ ప్రభుత్వ వివిధ రంగాల పాలసీలు, సంస్కరణలు, ఇన్సెంటివ్ ల వలన దేశానికి, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌కు భారత్ ఎదుగుదల జీర్ణం కావడం లేదు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఎం.బి. పాటిల్ వ్యాఖ్యలు చూస్తుంటేఅర్థం అవుతోంది… వారి కడుపు మంట అని ఆమె విమర్శించారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే…
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభివృద్ధి చూసి ఏడుస్తున్న పార్టీగా మారిపోయింది. భారతదేశానికి పెట్టుబడులు వస్తే వీళ్లు కంప్లెయింట్లు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు వస్తే ఇంకా గట్టిగా ఏడుస్తారు… ఎందుకంటే మోదీ గారి నాయకత్వంలో, చంద్రబాబు అనుభవంతో, పవన్ కల్యాణ్ సలహాలతో జరుగుతున్న అభివృద్ధి వీళ్లకు మింగుడు పడటం లేదు.
గూగుల్ విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ పెట్టింది రాజకీయ కూటమి వల్ల కాదు… విజన్ వల్ల వచ్చింది. స్వయానా గూగుల్ అధిపతి సుందర్ పిచ్చాయి చెప్పారు.
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లో మోదీ విజన్ ను చూసి ఆశ్చర్యమేసింది అని. కేంద్ర సహకారం, రాష్ట్ర నాయకత్వం తోనే విశాఖకు గూగుల్ వచ్చిందని సుందర్ పిచ్చాయి మాటలు విని కూడా కర్ణాటక కాంగ్రెస్ ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు.
ఆంధ్రకు సముద్రతీరం ఉంది, ప్రపంచ స్థాయి రోడ్లు, ఎయిర్‌పోర్టులు, పోర్టులతో మౌలిక వసతులను కేంద్రం కల్పించింది. గ్రీన్ ఎనర్జీ ఉంది, గ్లోబల్ కనెక్టివిటీ ఉంది. పెట్టుబడిదారులు నమ్మకం పెట్టుకునే స్థిరత్వం ప్రభుత్వంలో ఉంది. ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇచ్చే వేగం, స్థిరత్వం, శక్తి. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన ప్రాజెక్టులు కోల్పోతోంది, ఎందుకంటే వారికి దిశ లేదు. 100% అవినీతితో కూరుకుపోయింది. ఆంధ్రాలో మేము ప్రాజెక్టులు నడిపిస్తాం, వీళ్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నడిపిస్తారు. మేము ఫలితాల వెంట పడతాం. కాంగ్రెస్ ఆరోపణలు చేస్తారు.
దేశాన్ని మతం, కులం, ప్రాంతం, భాష లతో విభజించిన కాంగ్రెస్, ఇప్పుడు దేశం అభివృద్ధి ద్వారా ఏకమవుతుంటే ఈర్ష్యతో మండిపోతోంది. మోదీ భారత్‌లో రాష్ట్రాలు పోటీ పడవు.. కలిసి ప్రగతి సాధిస్తాయి.
ఆంధ్ర ప్రగతి అంటే భారత బలం. కాంగ్రెస్ ఏడవొచ్చు — కానీ బీజేపీ నిర్మిస్తుంది. అది రాజకీయాల మధ్య తేడా కాదు, దేశనిర్మాణం మధ్య తేడా! సర్దార్ వల్లభాయ్ పటేల్ నేలను కలిపి దేశాన్ని ఐక్యం చేస్తే మోదీ గారు అభివృద్ధి తో ప్రజల మనసులను ఏకం చేశారు.
రాష్ట్రం మీద వల్లమాలిన ప్రేమ ఒలకబోసే జగన్ మొంథా తుపానులో ఏమయ్యారు? షర్మిల రాష్ట్ర నాయకత్వంపై దేశ నాయకత్వంపై అనవసరపు నిందలు వేస్తున్నారు. తన అన్న అవినీతి రాజ్యాన్ని ఎందుకు అప్పుడు ప్రశ్నించలేదు?