Suryaa.co.in

Andhra Pradesh Telangana

కవిత.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు

– చంద్రబాబును విమర్శిస్తే సహించేదిలేదు
– ఆంధ్రా బిర్యానీని విమర్శిస్తావా?
– జగన్‌కు మీ అయ్య బిర్యానీ పెట్టిన సంగతి మర్చిపోయావా?
– జగన్ సీఎం ఉన్నప్పుడు నీ నోరు పడిపోయిందా?
– ఆంధ్రా సెంటిమెంట్‌తో ఇంకా ఎంతకాలం బతుకుతావ్
– జైల్లో చిప్పకూడు తిన్నా ఇంకా బుద్ధిరాలేదా?
– హైదరాబాద్‌లోని సీమాంధ్రులు కళ్లు తెరవాలి
– సీమాంధ్రులు ఓట్లేయకపోతే గ్రేటర్‌లో నీ పార్టీకి గతిలేదు
– దొంగచాటుగా ఫోన్లు విన్న బతుకూ ఒక బతుే నా?
– తెలంగాణ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: ‘కవితా..ఇంకా నువ్వు, నీ కుటుంబం ఆంధ్రా పేరుతో ఎన్నాళ్లు రాజకీయాలు చేస్తారు. శవాలపై పేలాలు ఏరుకున్నట్లు.. నువ్వు, నీ ఫ్యామిలీకి ఆంధ్రాను తిట్టకపోతే రాజకీయ మనుగడ లేదు. ఆంధ్రా బిర్యానీని విమర్శిస్తున్న నువ్వు.. జగన్‌కు నీ అయ్య బిర్యానీ ఎందుకు పెట్టాడో ఎందుకు అడగలేదు? నీ అయ్య చిత్తూరు జిల్లాకు వెళ్లినప్పుడు అక్కడి బిర్యానీ ఎందుకు తిన్నాడు? నీ అయ్య టీడీపీలో మంత్రి ఉన్నప్పుడు అనంతపురం ఇన్చార్జిగా ఉన్నప్పుడు ఏం తిన్నాడో కనుక్కో. అతి తె లివి రాజకీయాలతో నీ పతనం నువ్వే కొని తెచ్చుకోకు’’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కవితపై తెలంగాణ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి హెచ్చరించారు.

పదేళ్లు అధికారం అనుభవించి, ఇంకా ఆంధ్రులపై విషం చిమ్ముతున్న బీఆర్‌ఎస్ నిజస్వరూపాన్ని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు గమనించాలని షకీలారెడ్డి కోరారు. లిక్కర్ కేసులో తెలంగాణ పరువు తీసి, జైల్లో చిప్పకూడు తిన్న కవితకు ఇంకా బుద్ధి రాలేదన్నారు.

బనకచర్ల ప్రాజెక్టు ముసుగులో ఆంధ్రాపై విషం చిమ్ముతున్న కవిత.. జగన్‌ను ఎందుకు విమర్శించడం లేదన్నారు. ఇంతవరకూ తన తండ్రి చుట్టూ ఉన్న దయ్యాలెవరో చెప్పని కేసీఆర్.. తన బిడ్డ ఆంధ్రా బిర్యానీపై చేసిన వ్యాఖ్యలు సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా? అవి ఆమె సొంత వ్యాఖ్యలా? పార్టీ వైఖరా స్పష్టం చేయాలని షకీలా రెడ్డి డిమాండ్ చేశారు.

‘ముందు నీ ఫ్యామిలీ పంచాయితీని చక్కదిద్దుకో. నీ అయ్య చుట్టూ ఉన్న దయ్యాలెవరో తేల్చమను. చంద్రబాబును విమర్శించడానికి నీ వయసు, అనుభవం సరిపోదు. రాష్ట్రం విడిపోయి పదేళ్లయింది. నీ అయ్య పదేళ్లు సీఎంగా పనిచేశారు. అప్పుడు మాట్లాడని నువ్వు ఇప్పుడు ఎగిరెగిరిపడుతున్నావు. గ్రేటర్ హైదరాబాద్‌లో సీమాంధ్ర ఓటర్లు కాంగ్రెస్‌ను కాదని బీఆర్‌ఎస్‌ను ఎన్నుకున్నందుకు, ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. నీకు దమ్ముంటే రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇప్పుడు మాట్లాడినట్లే మాట్లాడు. మీ ఫ్యామిలీకి ఆంధ్రావారిని తిట్టి బతకపోతే తెల్లారదు’ అని షకీలారెడ్డి దుయ్యబట్టారు.

దొంగచాటుగా ఫోన్లు విన్న బతుకూ ఒక బతుే నా? నీ అయ్య రాష్ట్రంలోని అందరి ఫోన్లను దొంగచాటుగా విన్నారు. అదికూడా ఒక బతుకేనా? అసలు మీ కుటుంబానికి నైతిక విలువలున్నాయా? భార్యాభర్తల ఫోన్లు కూడా వినడానికి మీ కుటుంబానికి సిగ్గులేదా? వీటిని పక్కదారిపట్టేంచే కవిత అతి తెలివి రాజకీయాలు ఈకాలంలో చెల్లవని షకీలారెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE