– బీ ఆర్ ఎస్ లో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు కోనేరు (చిన్ని) సత్యనారాయణ
– బీ ఆర్ ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
కేటీఆర్ ఏమన్నారంటే.. సింగరేణికి శత్రువు మోడీ. కేంద్రం అధికారంలో ఉన్న పార్టీ చేసిందేమీ లేదు.ఏదో రకంగా ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని కేంద్రం చూస్తోంది.మతాల పేరిట రెచ్చగొట్టి పాత గాయాలను రేపుతోంది.మతాల మంటల్లో చిచ్చుపెట్టి చలి కాగాలని కేంద్రం చూస్తుంది. ఈ 9 ఏళ్లలో కేంద్రం ఏనాడూ తెలంగాణ ను ఆదుకోలేదు. భద్రాచలం అయిదు మండలాలు ఏపి లో కల్పింది బీజేపీ. బయ్యారం ఉక్కు కర్మాగారం చట్టం లో పెట్టీ ఇప్పటికీ ఇవ్వలేదు.
రైతు బందు ద్వారా రైతుల ఖాతాల్లో 73వేల కోట్లు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నరు. కిషన్ రెడ్డి కి సిగ్గు లజ్జ ఉంటే మోడీ ఇంటి ముందు ధర్నా చెయ్యి. కేంద్రం ఇచ్చే ఉద్యోగాలు ఇవ్వమని అడుగు. దిక్కుమాలిన దందాలు ధర్నాలు చేస్తోంది ఇక్కడ బీజేపీ నాయకత్వం. గ్యాస్ ధరలు పెంచిన బిజెపికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేయాలి. రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది.
మణిపూర్ మండుతున్న పట్టించుకోవటం లేదు.ఎన్నికలు వస్తున్నాయి అని రజాకార్ సినిమా తీసి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తోంది. దిగజారి పోయిన ప్రధాని ఓ వైపు, మరో వైపు కాంగ్రెస్ అధికారం దూరం అవుతుంది. ఫ్రస్టేషన్ లో కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇస్తోంది. కాంగ్రెస్ అధికారిక రాష్ట్రంలో ఎక్కడైనా 4వేల పెన్షన్ లు ఇస్తున్నారా? కాంగ్రెస్ లో ఎవడు ముఖ్యమంత్రో తెలియదు. వీళ్ళు ఆరు గ్యారంటీ లంటు మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే సంక్షేమం వెనక్కి పోతుంది రాజకీయ అస్థిరత తెలంగాణ లో ఖాయం.
తెలివి లేని, ఆలోచన లేని, వ్యూహం లేని వాళ్ళు, డబ్బు సంచులతో దొరకిన వాళ్ళు ఇలాంటి హామీలు రాసిచ్చారు. కర్ణాటక లో పవర్ హాలిడే, కరెంట్ కోతలు ప్రారంభం అయ్యాయి అభివృద్ది కి పైసలు లేవని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్ చెప్పారు. ఇది నా కవిత్వం కాదు.