– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి: పౌష్టికాహారంపై అందరికీ అవగాహన అవసరమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పౌష్టికాహర మాసోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చిన్నపిల్లలు, స్త్రీలలో పౌష్టికాహారం లోపాన్ని నివారించడానికి సంబంధిత ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. తినే ఆహారంపైన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. పౌష్టికాహారం దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుందని, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.