బాబుకు ఒక విధానం.. కొడుక్కి ఒక విధానమా.. ఇదెక్కడి చోద్యం?

– భార్యను అవమానించారని బాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేశాడు.. తల్లిని అవమానించారని కొడుకు కౌన్సిల్ కు వస్తాడు
– వివేకానందరెడ్డి హత్యకు చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం కాదా?
– పవన్ పార్టీ స్థాపించిందే చంద్రబాబు కోసం
– కమ్మ సామాజిక వర్గాన్ని పవన్ కల్యాణ్ ఉద్ధరిస్తారా?
– బాబును ముఖ్యమంత్రిని చేయటానికి జనసేన ఎందుకు..? ఆ పార్టీలో చేరిపోవచ్చుకదా..!
– మీరు 160 సీట్లల్లో సింగిల్ గా పోటీ చేసి గెలిస్తే.. రాజకీయాలు వదిలేస్తా?
– సింహంలా జగన్ సింగిల్ గానే పోటీ చేస్తారు.
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)

మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
బాబు శవ రాజకీయం…
జంగారెడ్డిగూడెంలో జరిగిన స‌హజ‌ మ‌ర‌ణాల‌పై చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు శవ రాజ‌కీయం చేస్తున్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అస‌త్యాలు ప్ర‌చారం చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. శ‌వాల‌పై చిల్ల‌ర ఏరుకునే నీచ రాజ‌కీయాలు ఇకనైనా మానుకోండి. శవాలను అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేసే నీచ స్థితికి టీడీపీ 420 బ్యాచ్ దిగ‌జారిపోయింది.

చంద్రబాబు చావు పరామర్శకు జంగారెడ్డిగూడెం వెళ్ళి, అదేదో పార్టీ ఊరేగింపు కార్యక్రమంలా, విక్టరీ సింబల్ ను చూపిస్తూ, కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో వారు ఉంటే.. వారితో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం చూస్తే.. ఇతను అసలు మనిషేనా..? ఎప్పుడో పదిరోజుల నుంచి వివిధ కారణాల వల్ల జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలో సహజంగానో, వయసు మీదపడో పలువురు చనిపోయారు.

వారికి పోస్ట్‌మార్టంలు, దహన సంస్కారాలు కూడా అయిపోయాయి. వారికి మద్దతు ఇచ్చే పేపర్లు, చూపించే టీవీ చానల్స్‌ ఉన్నాయని, ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారని, చనిపోయినవారిలో అత్యధికులు పేద

కుటుంబాలేనని… వారికి తలో లక్ష ఇచ్చి… వాళ్లంతా సారా మరణాల వల్లే అని చెప్పాలని, అధికారంలోకి వచ్చాక రూ.25 లక్షలు ఇస్తానని చంద్రబాబు దొంగమాటలు చెబుతున్నాడు.సహజ మరణాలను కూడా రాజకీయాలు చేస్తూ ఉచ్చం, నీచం మరిచి 420 బ్యాచ్‌లను వేసుకుని ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కూడా గ్రహించాలి. సూర్యుడి మీద ఉమ్ము వేస్తే అది మీ మొహం మీదే పడుతుంది.

జగన్‌ మోహన్‌ రెడ్డి నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం తాలుకా ఏదైనా తప్పు జరిగితే, వాటి వల్ల ప్రజానీకం నష్టపోతే … తప్పకుండా దాన్ని సరిచేసుకోవడానికి,ఆ కార్యక్రమానికి పాల్పడిన ఎంతటి వ్యక్తులను అయినా శిక్షించడానికి తన, మన అనే భేదం చూడకుండా తప్పుని తప్పు అని.. ఒప్పును ఒప్పుగా చెప్పే వ్యక్తి జగన్‌ .

అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయలేక, ప్రజల తాలుకా సమస్యలపై పోరాడేందుకు ఎలాంటి ఆస్కారం లేకపోవడంతో మీరే కృత్రిమ సమస్యలు సృష్టించి 420 న్యూస్‌లు రాసి, వాటిని మీరే మీ అనుకూల టీవీల్లో ప్రసారం చేసుకుని, అధికారంలోకి రాగానే రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని… సారా తాగడం వల్లే మరణించారంటూ చెప్పమని.. ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే చంద్రబాబు తరం కాదు. మీ డబ్బా మీడియా, సొల్లు పేపర్లను నమ్మేవాళ్లు ఎవరూ లేరు. చంద్రబాబు పిచ్చి కథలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడు.

రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతారని, చంద్ర‌బాబు వెన్నుపాటుదారుడు అని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు. జగన్ ని విమర్శిస్తే హీరో అయిపోతానని లోకేష్ కలలుగంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నోటికి అడ్డూఅదుపు లేకుండా మాట్లాడితే ఊరుకోం. లోకేష్ ఒక ప‌నికిమాలిన స‌న్నాసి, ప‌ప్పు కాబ‌ట్టే మంగ‌ళగిరిలో ఓడిపోయాడు.

బాబుకు ఒక విధానం.. కొడుక్కి ఒక విధానమా..
ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ చంద్రబాబు మంగమ్మ శపథం చేశారు. తన భార్య భువనేశ్వరిని సభలో అవమానించారని అంటాడు, కానీ ఎవరు అవమానించారో ఇంతవరకూ చెప్పలేదు. ఏమన్నారో చెప్పలేదు. అయినా తన రాజకీయం కోసం, కట్టుకున్న భార్యను రోడ్డెక్కించేశాడు చంద్రబాబు. నాలుగు ఓట్లు వస్తాయనుకుంటే సిగ్గు,శ రం లేకుండా ఆడవాళ్లు అని కూడా చూడడు…భార్య, కోడలు, కూతురు అని కూడా చూడనటువంటి వ్యక్తి చంద్రబాబు.

ఇదిలాఉంటే, ఆయన కొడుకు నారా లోకేష్‌ మండలికి వచ్చాడు సిగ్గులేకుండా. భార్యను ఏదో అన్నారని బాబు మాత్రం అసెంబ్లీకి రాడు. తల్లినేదో అన్నారని మీ కొడుకు మాత్రం మండలికి వచ్చేస్తాడు. మీకో విధానం, మీ కొడుకుకో విధానమా. మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇంకో విధానం. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు. రాజకీయంగా పేలాలు ఏరుకోవడానికి ఎంతకైనా తండ్రీకొడుకులు దిగజారతారు.

అదే నాడు జగన్ మోహన్ రెడ్డి వెంటే మేమంతా..
ప్రజా సమస్యలను తెలుసుకుని, సమస్యలను ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని జగన్‌ మోహన్‌ రెడ్డిగారు పాదయాత్రకు వెళుతున్నాని ప్రకటించి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళారు. టీడీపీ హయాంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్న ఈ కౌరవ సభలో అడుగు పెట్టనంటూ ఆయన శపథం చేస్తే, ఆయన మాటకు అప్పుడు ఉన్న మా పార్టీకి చెందిన 43మంది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కట్టుబడి ఉన్నాం.
చంద్రబాబు నాయుడు ఉన్న ఆ కౌరవ సభలోకి మా సభ్యులు ఎవరూ కూడా అడుగుపెట్టలేదు. జగన్‌గారికి అయినా, పార్టీకి అయినా, మాకు అయినా ఒకే సిద్ధాంతం. నాయకుడి వెనకే మేం నడుస్తాం. నాయకుడు ఏది చెబితే ఆ దారిలోనే మేము నడుస్తాం. మీకు ఒక విధానం అంటూ లేదు కాబట్టి, సిగ్గులేదు కాబట్టే మీ కొడుకు, మీ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో, కౌన్సిల్ లో కూర్చుంటారు. ఆఖరికి మీ భార్యను అవమానించారనే మాటలను, మీ కొడుకు లోకేష్, మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నమ్మలేదు కాబట్టే వాళ్లంతా వచ్చారు. మీరు బయట డ్రామాలను రక్తికట్టిస్తుంటే..మీ కొడుకు లోకేష్, మీ పార్టీ వాళ్ళు ఇక్కడకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం కాదా..
బాబాయ్‌ని గొడ్డలితో చంపారంటూ… నారా లోకేష్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వైఎస్‌ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన సమయంలో మీ నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నువ్వు మంత్రిగా ఉన్నావు. ప్రతిపక్ష పార్టీ నాయకుడి బాబాయ్‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ సోదరుడిని ఇంట్లోనే కొంతమంది దుండగులు బరితెగించి, విచ్చలవిడిగా హత్య చేశారంటే మీ ప్రభుత్వం ఆరోజు ఏం చేసింది.
నాడు రాజారెడ్డిగారు, మొన్నవివేకానందరెడ్డి హత్యలు టీడీపీ వైఫల్యం వల్లే జరిగాయి. చంద్రబాబు అధికారంలో ఉ‍న్నాడని, తమకు ఏం కాదని దోషులకు నమ్మకం ఉండటం వల్లే ఆ హత్యలు జరిగాయి. మీరు నిందితులను గాలికి వదిలేశారు. నిందితులైన బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డిలనో, లేకుంటే మీకు మద్దతు ఇచ్చినవారిని కాపాడుకోవడానికి ఆ కేసును జగన్‌ కుటుంబంపై తోసి, ఇవాళ సీబీఐ విచారణ జరుగుతుంటే దాన్ని కూడా మీ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుదోవ పట్టించే యత్నం చేయాలనుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు. శవాల మీద రాజకీయాలు చేయాలనుకుంటున్న 420గాళ్లు బాబు, కొడుకులిద్దరూ.

జగన్‌ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. తాను ఏదో పెద్ద లీడర్‌ అయిపోతాను అనుకుంటున్నాడు లోకేష్. తాత, తండ్రి ముఖ్యమంత్రులుగా చేశారు, 60లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్రానికి తాము చేసినంత మరెవరూ చేయలేదని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు.
జగన్‌ మోహన్‌రెడ్డి తన తండ్రి చనిపోయిన తర్వాత, ఒంటరిగా రాజకీయ పార్టీని స్థాపించి 151మంది ఎమ్మెల్యేలను గెలిపించి, రాష్ట్రానికి బలమైన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్.. జగన్‌పై ఆరోపణలు చేయడమా? జగన్‌ రెడ్డి అంతు తేల్చుతానని లోకేష్‌ అంటున్నాడు… ఏమీ పీకలేరు. మీ అంత సన్నాసులు, పనికిమాలినవాళ్ళు ఎవరూ లేరనేది అందరికీ తెలిసిన విషయమే.

బాబు పల్లకీ మోయాలా..
ఇక చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ సభ పెట్టి అన్ని రాజకీయ పార్టీలను కలిపేస్తానంటున్నాడు. ఓట్లు చీలకూడదట. అందరూ కలిసి జగన్‌గారిని ఓడించాలి, చంద్రబాబును గెలిపించాలి. చంద్ర‌బాబు ప‌ల్లకి మోయాల‌ని ఆ పార్టీ ఆవిర్భావ సభలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ దిక్కుమాలిన థియరీని చెప్తున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ స్థాపించిందే చంద్ర‌బాబు కోసం అని చిన్న పిల్లాడికి సైతం అర్థమవుతుంది. చంద్ర‌బాబును సీఎం చేయ‌డానికి పార్టీ ఎందుకు..? ప‌వ‌న్ క‌ల్యాణే టీడీపీలో చేరితే స‌రిపోతుంది కదా..

జగన్‌ మోహన్‌ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం ‘వర్గ’ శత్రువులట. ఈ కొత్త పదాన్ని మేము ఎప్పుడూ వినలేదు కూడా. అందుకని రాష్ట్రంలోని కమ్మ సోదరులంతా.. “పనికిమాలిన చంద్రబాబు, లోకేష్‌, రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడు మన సామాజికవర్గాన్ని కాపాడలేడని… తమని రక్షించాలని ఈ పోటుగాడి దగ్గరకు వెళ్లారట. అందుకు జన సైనికులంతా సిద్ధంగా ఉండాలని, మనమంతా పల్లకీలో చంద్రబాబును మోసి ముఖ్యమంత్రిని చేసి, మనం ఏమైపోయినా, అడుక్కుతిన్నా ఫర్వాలేదు. బాబును సీఎంను చేయాల్సిన బాధ్యత మన భుజాలపై ఉందని” పవన్‌ కల్యాణ్ సిగ్గులేకుండా చెబుతున్నాడు.

2014లో పార్టీ పెట్టి అభ్యర్థులను పెట్టే పరిస్థితి లేదని, పెడితే ఓట్లు చీలతాయని, అప్పడు చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చాడు. ఆ తర్వాత వ్యతిరేక ఓట్లు చీలకూడదని సీపీఐ, సీపీఎం, మాయావతి పార్టీలను పట్టుకుని కూటమిని పెట్టాడు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబును గెలిచించాలంటున్నాడు. చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపించిందే చంద్రబాబును గెలిపించడం కోసం అని. పవన్‌ ముఖ్యమంత్రి అయ్యేది లేదు సచ్చేది లేదు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన పార్టీ ఎందుకు? ఆయనే టీడీపీలో చేరితే అయిపోయేది కదా? ఇలాంటి వ్యక్తులు జగన్‌ని ఏం చేయలేరు.

160 సీట్లల్లో ఒకే సింబల్ మీద పోటీ చేసి, గెలిచే దమ్ముందా..
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు వస్తాయంటూ అచ్చెన్నాయుడు ఆంబోతులాగా రంకెలు వేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని ఢీకొనే మొనగాడు ఎవరైనా ఉంటే, ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఉంటే ఒకే పార్టీ గుర్తుపై పోటీ చేసి 160 సీట్లు గెలిస్తే.. నేను రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతాను. టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌, బీజేపీ… ఏ పార్టీ అయినా సరే. మీరంతా కలిసి తలా 50 సీట్లు గుంపులుగా పంచుకోవాల్సిందే కదా. అటువంటింది మీరు 160 సీట్లు గెలుస్తారా? గెలవాలంటే అసలు పోటీ చేయాలి కదా.

ఈ రాష్ట్రంలో 175 సీట్లులో పోటీ చేసే ఏకైక మగాడు, సింగల్‌గా సింహంలా పోటీచేసేది ఒక్క జగన్‌ మోహన్‌ రెడ్డిగారే. మీరంతా కలిసి 175 సీట్లల్లో పోటీ చేస్తే దాంటో మీ షేర్‌ ఎంత? అందులో ఒకరికి 50, మరొకరికి 70, అయిదు, పది వస్తాయని జనం నవ్వుకుంటున్నారు.

జగన్‌ మీద మీ మీడియాను అడ్డుపెట్టుకుని అవాకులు, చెవాకులు పేలినా, మీ పార్టీలు అన్ని కలిసి కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ప్రజలు, దేవుని ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు నిండు నూరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆయన అవసరం లేదని వెళ్ళిపోతే తప్పితే.. ఇంకెవరైనా ఆసీట్లో కూర్చోగలరు. అంతేకానీ ఆయన బతికుండగా ఆ సీటును టచ్‌ చేయగలిగిన వ్యక్తులు ఎవరూ లేరు. మీరు సొల్లు, సోది కబుర్లు ఆపేసి నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తే మంచిది.

Leave a Reply