Suryaa.co.in

Andhra Pradesh

కోడి కత్తి కేసు ఫిబ్రవరి 21కి వాయిదా

– హాజరు కాని మాజీ సీఎం జగన్
– కోర్టు ధిక్కారంగా పరిగణించాలి: విదసం డిమాండ్

విశాఖపట్నం: ఐదేళ్ళ నాటి సంచలన కోడి కత్తి కేసు విచారణలో మళ్ళీ వాయిదా పడింది.. ఎన్ ఐ ఎ కోర్టులో కోడి కత్తి కేసు శుక్రవారం విచారణకు రాగా బెయిల్ మీద ఉన్న నిందితుడు జనపల్లి శ్రీనివాస్ తన న్యాయవాది అబ్దుల్ సలీంతో కలిసి కోర్టుకు హాజరయ్యాడు. ఫిర్యాదుదారు, బాధితుడు మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోవడం తో కేసు వచ్చే నెల 21కి వాయిదా వేసినట్టు న్యాయవాది సలీం తెలిపారు.

కోర్టు ధిక్కారంగా పరిగణించాలి: విదసం

కోడికత్తి కేసులో నిదితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు అయి సంవత్సరం కావస్తుందని, మూడేళ్లుగా సాక్ష్యం చెప్పడానికి జగన్ మోహన్ రెడ్డి రాక పోవడం వల్ల కేసు ముందుకు కదలడం లేదని విదసం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా వందల సార్లు కోర్టు వాయిదాకు హాజరుకానివారిని కోర్టు ధిక్కరణ గా పరిగణించాలని విదసం కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE