Suryaa.co.in

Telangana

కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారు

– నాకు కుటుంబం, భార్య, పిల్లలు లేరా?
– సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోయలేదా?
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుదాడి

‘‘మాకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని కొండా సురేఖ అనలేదా? నాకు కుటుంబం, భార్య, పిల్లలు లేరా? మొదట కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలి. కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్‌లతో మాకు సంబంధం లేదు. కొండా సురేఖ ఏడిస్తే మాకేమి సంబంధం’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోయలేదా? అని ప్రశ్నించారు . చేతకాకనే కాంగ్రెస్ తమపై దాడులు చేయిస్తోందని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేకనే దాడులు చేయిస్తోందన్నారు.

LEAVE A RESPONSE