– హాజరైన మంత్రి సుభాష్ , ఆర్డీవో దంపతులు
కె. గంగవరం : విశిష్ట చరిత్ర కలిగిన కోటిపల్లిలోని శైవపుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వరాలయంలో మహా శివరాత్రి పర్వదినాన కోటి దీపారాధన కన్నుల పండుగగా జరిగింది. ఈ కోటి దీపారాధన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ , ఉత్సవ కమిటీ చైర్మన్, రామచంద్రపురం ఆర్డీవో డి అఖిల దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడా మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేశారు. అనంతరం దీపం వెలిగించి కోటి దీపోత్సవం కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు, మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం , చీకట్ల సోమేష్, రాము, రామకృష్ణ, సత్తిబాబు, రేవు శ్రీను, అధిక సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.