మరోసారి మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్‌

Spread the love

రాష్ట్ర ఐటీ, పురపాలశాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని తన ఎస్కార్ట్‌ వాహనంలో ఆసుపత్రికి తరలించి, వైద్యం అందేలా చూశారు. వివరాల్లోకి వెళితే.. హకీంపేట వద్ద మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదే సమయం సిరిసిల్ల పర్యటనకు ముగించుకొని హైదరాబాద్‌కు వస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటనను గమనించిన మంత్రి కాన్వాయ్‌ని ఆపి, క్షతగాత్రులను ఎస్కార్ట్‌ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply