క్యా బోయ్నెట్ హై..!?

బొత్స ‘సత్య’మైంది..
తమ్ముడు దాసుడు దాసోహమైపోతే
అన్నకు ప్రసాదం..
మొత్తానికి ఇంటి గుమ్మం దాటని పదవి..
మనిషిగా నాన్న గుర్నాథరావు అమరుడైతే..
కొడుకు అమరనాధుడు
ఆమాత్యుడయ్యాడు..
రెడ్డి రాజ్యంలో పెద్దిరెడ్డికి
మరోసారి పెద్ద పీట..
బుగ్గన మళ్లీ రాజే..
ఇక చూడాలి విశ్వరూపం..
ఇంతకాలానికి రాజన్న రాజయ్యాడు..
సిదిరి బెదిరినా
అదిరిందోయ్ లక్కు..
పోలీసును తిట్టినా
నో చిక్కు..
జగనన్న నామ పారాయణ..
స్వామి..నారాయణ..!
అన్నట్టు..మరో స్వామి
చివరి నిమిషంలో ‘తిప్పే’సాడు..
వనితల్లో వనిత..
రోజాకు మంచి రోజు..
కళ్యాణదుర్గంలో
మరో ఉషోదయం..
క్యాబినెట్ లో రజనీ గంధ..

సురేష్ E

Leave a Reply