-పార్లమెంట్ లో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్న
-డబ్ల్యూపీఆర్ ని పెంచుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి
దోపిడీకి గురికాకుండా కార్మికులకు రక్షణ కల్పించేందుకు, ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను క్రమబద్దీకరించడానికి, సరళీకృతం చేయడానికి గతేడాది ఆమోదించిన నాలుగు లేబర్ కోడ్‌లు ఇప్పటికీ పూర్తిగా అమలు కాకపోవటంపై ఈరోజు లోక్ సభలో ఎంపీ ప్రశ్నించారు.
ఇందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బుపేంద్ర యాదవ్ బదిలిస్తూ..సమర్థవంతమైన ఉత్పత్తి, వృద్ధిని పెంచడానికి 4 కోడ్‌లు(వేతనాలపై కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత, వృత్తి పరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌లు) రూపొందించబడ్డాయని వెల్లడించారు.
చట్టబద్దమైన కనీస వేతనం, సామాజిక భద్రతా రక్షణ మొదలైన వాటి పరంగా కార్మికులకు అందుబాటులో ఉండే రక్షణను నిర్ధారిస్తూ నాలుగు కోడ్‌లు వ్యాపారాన్ని సులభతరం చేయడం, ఉపాధి అవశాకాలను సృష్టించడం చేస్తున్నాయన్నారు.లేబర్ అనేది కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోని అంశమని, లేబర్ కోడ్‌ల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే నియమాలు రూపొందించబడాలని, అందువల్లనే రూపొందన జరగలేదని, పూర్తిగా అమలు కాలేదని ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో కార్మికుల జనాభా నిష్పత్తి (వర్కర్ పాపులేషన్ రేషియో) అనేది కీలకమైన అంశమని.. దీనిని మరింత పెంచటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక చర్యలు చేపట్టిందని అందులో భాగంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం ఉత్తమ పనితీరును కనబరిచిందని, తాజాగా ఉపాధి పనిదినాల సంఖ్యను 100రోజులకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అభ్యర్థన కూడా చేసినట్లు పేర్కొంటూ.. నేషనల్ స్టాటిస్టికిల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్) ప్రకారం డబ్యూపిఆర్ అంచనాలు ఏపీలో 2019 నుండి 2021 మధ్యలో 54.8శాతం నుండి 55.5శాతానికి పెరిగిందని వెల్లడించారు.
ఆగస్టు 2021లో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం 20.1శాతంగా ఉందన్నారు. అయినప్పటికీ, కొన్ని సర్వే లెక్కలు దేశంలోని కార్మికుల విషయంలో కొన్ని అంశాలు ఆందోళన కల్గిస్తున్నాయని, సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ) డేటా ప్రకారం.. జాతీయ నిరుద్యోగిత రేటు 6.95శాతం నుండి 8.32శాతానికి పెరిగిందని, కార్మిక భాగస్వామ్య రేటు 40.5 శాతం వద్దనే ఉందని, ఉపాధి రేటు గతం కంటే 2 శాతం తగ్గి 40శాతంగా ఉందని ఎంపీ వెల్లడించారు. ఈ తరుణంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీ ప్రశ్నించారు.