Suryaa.co.in

Telangana

కూలీలు ఎక్కడున్నా కూలీలే

– ఆ కూలీలకూ ‘భరోసా’ ఇవ్వండి!
– సర్కారు కు హైకోర్టు ఆదేశం
– రేవంత్ సర్కారుకు షాక్

హైదరాబాద్‌: గ్రామాల్లో భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ. 12 వేలు చెల్లించేలా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ పథకాన్ని రూపొందించింది. అయితే, 129 మున్సిపాలిటీల్లో ఎనిమిది లక్షల మందికి పైగా కూలీలు ఉన్నారని పథకంపై హైకోర్టులో సామాజిక కార్యకర్త గవినోళ్ళ శ్రీనివాస్ పిటిషన్ వేశారు. దీంతో కూలీలు ఎక్కడున్నా కూలీలేనని, నాలుగు వారాల్లో మున్సిపాలిటీలో ఉన్న రైతు కూలీలను కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలోకి తీసుకురావాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A RESPONSE