Suryaa.co.in

Andhra Pradesh

పెట్రోల్ ధరలపై జగన్‌వన్నీ అబద్ధాలే

– బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్
పెట్రోలు, డీజిఎల్ తగ్గింపు, కేంద్రం నుంచి వచ్చే రాష్ట్ర వాటాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన అబద్దపు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రానికి దమ్మిడి ప్రయోజనం లేకపోగా, దుబారా వ్యయం ఆకాశన్ని అంటి అప్పులు కుప్పగా మార్చింది. తాము పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించం అనే విషయాన్ని సైతం నిసిగ్గుగా పత్రికల ద్వారా ప్రకటించి విలువైన ప్రజాధనం వృధా చేయడం ఈ ప్రభుత్వానికే చెల్లింది.
పెట్రోల్ రూ.5/-, డీజిల్ రూ.10/- ధరలు కేంద్రం తగ్గించింది. కొన్ని రాష్ట్రాలు కూడా తగ్గించాయి. కాని రాష్ట్ర ప్రభుత్వం దమ్మిడీతగ్గించలేదు. ప్రతి నెల కనీసం జీతాలు ఇవ్వలేక దేహీ అంటూ ఢిల్లీ లో మోకరిల్లుతూ ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తు, దేశంలో రాష్ట్రాన్ని అంధేరా ప్రదేశ్ గా మార్చారు.ప్రజల పైన భారం కొంత మేరకు అన్న తగ్గించాలని కేంద్రం అడుగు వేస్తే, రెండవ అడుగు వేయాల్సిన మీరు ప్రజలను పక్కదారి పట్టించే ప్రకటనలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ సెస్సుల నిజాలు నిగ్గు తేల్చాలని మేము భావిస్తున్నాము .
పెట్రోలు – డీజిల్ ద్వారా ఆదాయం 3,35,000 కోట్లు అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మీ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద పెట్రోల్, డీజిల్ పైన వసూళ్లు చేసిన పన్నులనే ప్రకటించారు. మీరు ఆంధ్రప్రదేశ్ లో వసూళ్లు చేస్తున్న పన్నుల మొత్తం ఎందుకు ప్రకటించలేదు?
దేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 35 ఉంటే, ఇవన్నీ కలిపి 2,02,937 కోట్ల రూపాయలు 2020 – 21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలు, డీజిల్ పైన పన్నులు వసూళ్లు చేశాయి. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే 11,014 కోట్లు వసూళ్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ కన్న నాలుగు రెట్లు పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ వసూళ్లు 21,956 కోట్లు మాత్రమే. జనాభా ప్రాతిపదికన దక్షిణ భారతదేశంలో అతి ఎక్కువ తలసరి పన్నులు పెట్రోలు, డీజిల్ పైన వసూళ్లు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని మీరు పత్రికా ప్రకటన ఇస్తే బాగుండేది.
సెస్సులు, సర్ చార్జీల ద్వారా వసూలుచేసిన రూ.2,87,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. దేశంలో జరిగే రహదారులు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు ఇలా అనేక మౌలికసదుపాయాలకు ఈ నిధులను కేంద్రం ఖర్చుచేస్తుంది.
1). రోడ్లు – రైల్వే – నౌకాశ్రయాలు – విమానాశ్రయాలు అనుసంధానం చేస్తూ భారతమాల ప్రాజెక్టు ఫేజ్ 1 లో భాగంగా 34,800 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 5,35,000 కోట్లకు ప్రతిపాదనలు తయారు చేయగా, అది వివిధ మౌలిక సదుపాయాలు కలుపుకుని 6,92,324 కోట్ల రూపాయలకు చేరింది. ఈ ప్రాజెక్టు కోసం నిధులు 2,37,024 కోట్ల రూపాయలు పెట్రోలు, డీజిల్ నుండి వసూళ్లు చేస్తూన్న సెస్సు ద్వారా వినియోగించబడుతుంది. ఇప్పటికే పూర్తి అయిన ఢిల్లీ టూ ముంబై ఎక్స్ప్రెస్వే కి అయిన 98 వేల కోట్లు, ఈ మధ్య ప్రతిపాదనలు అయినా 50 వేల కోట్ల విలువైన సూరత్ టూ చెన్నై వైయా ఆంధ్రప్రదేశ్ మూడు జిల్లాల ద్వారా ఏక్స్ప్రెస్ వే కి, ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి టూ రాయలసీమని అనుసంధానం చేసే రహదారులకు కేంద్ర ప్రభుత్వం తన వాటగా ఇస్తున్నవి ఈ సెస్సు, సర్ ఛార్జీల ద్వారా వచ్చిన నిధులే అనే విషయాన్ని జగన్మోహన రెడ్డి తెలుసుకోవాలి.
మన రాష్ట్రానికి సంబంధించిన రైల్వే, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పన విషయంలో రాష్ట్ర వాటాను సకాలంలో చెల్లించక పోవడంతో వాటి నిర్మాణ పనులు తీవ్ర జాప్యం జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారు. ఇవి కాకుండా, దేశంలో స్వతంత్రం వచ్చాక 2014 వరకు వేసిన జాతీయ రహదారులు 90 వేల కిలోమీటర్ల విస్తీర్ణం అయితే, మోడీ గారు 6 సంవత్సర పాలన లో అదనంగా 46 వేల కిలోమీటర్ల మేరకు జాతీయ రహదార్లు అభివృద్ధి చేసి మొత్తం 1 లక్ష 36 వేల కిలోమీటర్లకు పెంచారు. రాబోయే రెండు సంవత్సరాలలో 2 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారుల లక్ష్యం వైపు దూసుకువెళ్తున్నారు.
1,98,000 కోట్ల అడిషనల్ ఎక్సెజ్ సెస్సు తో పైన తెలిపిన మౌలిక సదుపాయాలుతోపాటు ఆరోగ్య మౌలిక సదుపాయాల వృద్ధి కోసం 2014 తరువాత దేశంలో 157 నూతన మెడికల్ కాలేజిలు కోసం కేంద్ర ప్రభుత్వం 17,691 కోట్ల వ్యయం చేసింది. దేశంలో 2014 కి 3 ఎయిమ్స్ మాత్రమే ఉండగా, ఇప్పుడు కొత్తగా 22 ఎయిమ్స్ నిర్మించారు. రాష్ట్రంలో నిర్మిస్తోన్న ఎయిమ్స్ ముఖ్యమంత్రి ఇల్లు తాడేపల్లికి సమీపంలోనే ఉందికదా! వీటన్నిటికీ నిధులు ఎక్కడ నుండి వస్తున్నది జగన్మోహన్ రెడ్డి కి తెలుసా?
మొదటి, రెండో లాక్ డౌన్ సమయంలో మా వల్ల కాదు అని మీరు చేతులు ఎత్తితే, గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద దాదాపు 2.60 లక్షల కోట్ల రూపాయల విలువైన బియ్యం, కందిపప్పు, గోధుమలు, 6 నెలలు నగదు సహాయం 80 కోట్ల మంది ప్రజలకు దేశంలో ఇవ్వడం జరిగింది. ఇదంతా కేంద్రం సేకరించిన సెస్సుల నుంచి వచ్చినవే.
అసంఘటిత కార్మికుల కోసం అదనపు ఉపాధిహామీ నిధులు 50 వేల కోట్ల రూపాయలు, వారిని గమ్యస్థానం చేర్చాడానికి ప్రయాణ, భోజన వసతులు, కోవి 19 బారిన పడిన వారికి మందులు, ఆహార, రవాణా ఖర్చులు వంటివి ఈ సెస్సులు సర్ఛార్జీల నుంచి వచ్చినవే. – ఇప్పటి వరకు దేశం మొత్తం ఇచ్చిన 110 కోట్ల పైగా కోవిద్ డోస్లు, రాబోయే 6 నెలలో ఇవ్వబోయే మరో 100 కోట్ల పైగా ఉచిత – వాక్సినేషన్ ఖర్చు దాదాపు 80 వేలకోట్లరూపాయలు.
ఇంత ఆర్థిక ఇబ్బందులలో కూడా రైతుల ధాన్యాన్ని సేకరించి, చేసిన చెల్లింపులు. ఇప్పటి వరకు చెప్పిన వ్యయం లో జాతీయ రహదారులలో కొంత భాగం, 50% వ్యయం వరకు ఉచిత వాక్సినేషన్ మినహాయించి, మిగిలిన వ్యయం అంతా బడ్జెట్ వ్యయంకు సంబంధం లేనిదే … కానీ కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితం విలువైనది గా భావించి ప్రజలకు సేవ చేసింది.
కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ పనులన్నీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలకు అందాయి. కేంద్రం అందించిన సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం యూసీలు కూడా ఇచ్చింది. వాటి నిజాలు నిగ్గుతేల్చాలి. – కోవిడ్ 19 వల్ల ఆర్థిక కష్టాలు పన్నులు వసూళ్లు తగ్గుదల కేంద్ర ప్రభుత్వం కి వచ్చినా, అదృష్టం వల్ల అతర్జాతీయ విపణిలో తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుదల వల్ల ఆ వెసులుబాటు కలిసి వచ్చింది. ఆ మొత్తాన్ని దేశంలో ప్రజలందరికి కేంద్ర ప్రభుత్వం వినియోగించింది.
ప్రధాని మోడీ ఆత్మనిర్భర భారత్ యోజన వల్ల గత ఆరు నెలలు గా దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి కేంద్ర ప్రభుత్వ వసూళ్లు సానుకూలంగా ఉన్నందున, తామ భాద్యత గా ప్రజలకు మేలు చేకూర్చే ప్రయత్నంలో భాగంగా డీజిల్ పైన లీటరుకు రూ. 10/-, పెట్రోలు పైన లీటరుకు రూ.5/- తగ్గించడమే కాక, వంట నూనెల ధారలు రూ.20/- నుండి రూ.10/- మధ్యలో తగ్గించారు.
ఆ స్ఫూర్తితో భాద్యత తో మెలిగే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి వారి వెసులుబాటు ప్రకారం తగ్గిస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పన్నులు తగ్గించలేదు. సరికదా పనికి మాలిన పత్రిక ప్రకటనలతో అల్లరి చిల్లరగా వ్యవహరిస్తున్నది. ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన పథకాలు, నిధుల పైన స్టిక్కర్లు వేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నేడు పెట్రోలు, డీజిల్ పైన వ్యాట్ తగ్గించకుండా ప్రజలను పక్కదారి పట్టించే విధంగా వృధావ్యయం చేస్తున్నారు. ఈ వృధావ్యయం పాలకుల వ్యక్తిగత జేబులో నుండి రికవరీ చెయ్యాలి.

LEAVE A RESPONSE