– లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా?
– నాని, పించ్ హిట్టర్ బియ్యం మధు.అబ్బో మామూలు టీము కాదు
– పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది
పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం
– సైకో పోవాలి… సైకిల్ రావాలి
– యువగళం – నవశకం బహిరంగ సభలో నారా లోకేష్
ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర.
కొండంత అండ కోస్తాంధ్ర.
రత్నాలసీమ రాయలసీమ.
అందరి విశాఖ…అందాల విశాఖ.
అన్ని ప్రాంతాల నుండీ వచ్చిన ప్రజలు, ముఖ్య అతిధులుగా వచ్చిన టిడిపి అధ్యక్షులు చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మీ అందరి బాలయ్య నా ఒక్కరికే ముద్దుల మామయ్య, టిడిపి – జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం.
బొమ్మ బ్లాక్ బస్టర్ గురూ!
ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి ప్యాలస్ లో టివిలు పగులుతాయో ఆ బొమ్మ నేను మీకు చూపిస్తున్నా.
విజనరీ చంద్రబాబు గారు, పవర్ ఫుల్ పవనన్న, మన సింహం బాలయ్య బొమ్మ అదుర్స్ కదూ.
ఒక సారి జూమ్ వెయ్యండమ్మా జగన్ కి ఐమ్యాక్స్ సినిమా చూపిద్దాం.
ఇది యువగళం ముగింపు సభ కాదు…ఇది ఆరంభం. ఇది నవశకం.
యుద్ధం మొదలైంది. తాడేపల్లి ప్యాలస్ గోడలు బద్దలు కొడదాం.
ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం.
రాక్షసరాజ్యంలో పాదయాత్ర చెయ్యడం ఒక విప్లవం.
యువగళం..మనగళం..ప్రజాబలం.
యువగళం పాదయాత్ర నేను కుప్పంలో మొదలుపెట్టాను. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసాను.
యువగళాన్ని ఆపేందుకు జగన్ జిఓ.1 తీసుకొచ్చాడు. నేను ఆ రోజే చెప్పా బ్రదర్ జగన్ జిఓ.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో తగ్గేదేలేదు అని.
నా మైక్ వెహికల్ లాక్కున్నాడు. అన్న ఎన్టీఆర్ గారు ఇచ్చిన గొంతు ఇది. ఆపే మగాడు ఇంకా పుట్టలేదు. పోలీసుల్ని పంపాడు యువగళం ఆగలేదు. వైసిపి గూండాలను పంపాడు మన పసుపు సైన్యాన్ని చూసి పారిపోయారు.
బాంబులకే భయపడని బ్లడ్ మనది…బెదిరింపులకు భయపడతామా? భయం మా బయోడేటాలో లేదు బ్రదర్.
నేను మొదటి రోజే చెప్పా సాగనిస్తే పాదయాత్ర…అడ్డుకుంటే దండయాత్ర.
జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు అయితే.. మీ లోకేష్ ది అంబేద్కర్ గారి రాజ్యాంగం పౌరుషం.
ఒక పక్క యువగళం..మరో పక్క చంద్రబాబు గారి భవిష్యత్తుకి గ్యారెంటీ..పవనన్నవారాహి యాత్ర తో జగన్ కి, ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైంది.
చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయం, పవనన్నని చూస్తే జగన్ కి భయం, మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం.
అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు.
విజనరీ అంటే చంద్రబాబు… ప్రిజనరీ అంటే జగన్ ఇది ఫిక్స్.
జగన్ అరెస్ట్ అయితే రోజుకో స్కామ్ బయటపడింది.. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే 15 ఏళ్లు సీఎం గా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం బయటకు వచ్చింది.
53 రోజులు నిజాన్ని బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచింది.
పవనన్న ఏపీకి వస్తుంటే అడ్డుకుంటారు వైసిపి పిరికి సన్నాసులు.
ఆయన రావాలి అనుకున్న ఫ్లయిట్ క్యాన్సిల్ చేస్తారు.
పవనన్నని ఏపీ బోర్డర్ లో ఆపేస్తారు.
ప్రజాస్వామ్యాన్ని నువ్వు దెబ్బతీసావ్ జగన్…ప్రజాస్వామ్యం తిరగబడి దెబ్బకొడితే ఎలా ఉంటుందో నువ్వు త్వరలోనే చూస్తావ్.
జగన్ ఈ మధ్య పేదలకు – పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నాడు.
లక్ష కోట్లు దోచిన వాడు, లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా?
జరగబోయేది జగన్ అహంకారానికి – ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం.
జగన్ అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతాను.
జగన్ ఒక అప్పుల అప్పారావు.
ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టాడు.
అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని నాశనం చేసాడు.
జగన్ హయాంలో ఏపీ అప్పు 12 లక్షల కోట్లకు చేరబోతోంది.
ఏడాదికి మనం కట్టాల్సిన వడ్డీ ఎంతో తెలుసా లక్ష కోట్లు.
అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే భారం మొయ్యాల్సింది ప్రజలే.
సంపద సృష్టించి సంక్షేమం అందించే విజనరీ చంద్రబాబు గారు రాష్ట్రానికి కావాలి… ప్రజలకు మంచి చెయ్యాలి అనుకునే పవర్ ఫుల్ నాయకుడు పవనన్న రాష్ట్రానికి కావాలి.
జగన్ కొత్త స్కీం తెచ్చాడు దాని పేరు ఆడుదాం ఆంధ్రా అంట.
నాలుగున్నర ఏళ్లుగా ప్రజల జీవితాలతో ఆడుకున్నావ్ సరిపోదా జగన్?
స్టేడియంలు, గ్రౌండులలో ప్రాక్టీస్ చేయడానికి, ఆడ్డానికి వచ్చినవాళ్లని ఫీజులు కట్టకపోతే రావొద్దంటూ తరిమేస్తున్నాడు ఈ జగన్.
జగన్ ఐపీఎల్ టీము పెడతామంటున్నాడు..దీనికి కోడికత్తి వారియర్స్ అని పేరు పెడితే బాగుంటుంది..
సీనియర్ బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యం మధు.అబ్బో మామూలు టీము కాదు.
పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది..నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకున్నాను. ఒక్క నాయకుడు చేసిన తప్పుల వలన రాష్ట్రం ఎంత నష్టపోయిందో కళ్లారా చూసాను. జగన్ విధ్వంసం ప్రతి అడుగులో చూసాను.
ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు, నకిలీ విత్తనాలతో రైతన్న నష్టపోతున్నాడు, తాగునీటి కోసం మహిళలు బిందెలు మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం తెచ్చిన ఎలెక్ట్రానిక్స్, ఐటి కంపెనీలు కనిపించాయి… పాపాల పెద్దిరెడ్డి పది వేలకోట్ల అవినీతి సామ్రాజ్యం కనిపించింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా, డ్రిప్ ఇరిగేషన్ కనపడింది… జగన్ తెచ్చిన కష్టాలు కనపడ్డాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తెచ్చిన విమానాశ్రయం, మెగా సీడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించాయి…జగన్ మిగిల్చిన కన్నీరు కనిపించింది.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ మునిరాజమ్మ జగన్ పాలనలో పడుతున్న బాధని నాతో చెప్పుకుంది. మీడియాతో మాట్లాడింది. పిల్ల సైకో బియ్యపు మధుసూదన్ రెడ్డి మునిరాజమ్మ టిఫిన్ బండిని ధ్వంసం చేసాడు. కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరితే వదిలేస్తాం అన్నారు అయినా ఆమె తగ్గలేదు. సైకో పాలన పై పోరాడింది ఆమెకు టిడిపి అండగా నిలబడింది. ఆమె ధైర్యాన్ని నేను స్ఫూర్తిగా తీసుకున్నాను.
పలమనేరుకి చెందిన మిస్బా తల్లితండ్రులు నన్ను కలిసారు. వైసిపి నాయకుడు కూతురు స్కూల్ ఫస్ట్ రావాలి అని మిస్బాకి టీసీ ఇచ్చి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసారు. డాక్టర్ అవుతానని డైరీ లో రాసుకున్న మిస్బా ని చంపేసిన పాపం ఈ సైకోలను ఊరికే వదలదు. ఇలాంటి బాధ ఏ కుటుంబానికి రాకూడదని కోరుకున్నాను.
ఎమ్మిగనూరులో రైతులతో సమావేశమైనప్పుడు రంగమ్మ అనే మహిళా రైతు తన భర్త 12 ఎకరాలు కౌలుకి తీసుకోని అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు అని కన్నీరు పెట్టుకుంది. ఆ మహిళా రైతు కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే ఆమెకు పార్టీ తరపున సాయం అందించాను.
మంత్రాలయం నియోజకవర్గం వలస కూలీలను కలిసాను. వ్యవసాయ పనులు లేక పిల్లలతో సహా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వస్తన్న వారితో మాట్లాడాను. వ్యాన్ లో వాళ్ళను చూసిన తరువాత నాకు బాధ కలిగింది.
ఆలూరు నియోజకవర్గంలో నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్లు నడవడం చూసాను. ప్యాలస్ లో పడుకునే జగన్ కి మహిళలు పడుతున్న కష్టం కనపడటం లేదు.
జి.డి నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని జీవిస్తున్న మోహన అనే మహిళను కలిసాను. ఆమె భర్త చనిపోయాడు. కష్టపడి ఇద్దరు పిల్లల్ని చదివించారు. పెద్దబ్బాయి ఎంసిఎ, చిన్నబ్బాయి డిప్లొమా చేసారు. ఆమె ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సాయం వద్దు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూడండి చాలు అని అన్నారు. ఆ మాటలు విన్న తరువాత ఎంత బాధ్యతగా పనిచెయ్యాలో అర్థమైంది.
పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పద్మావతి అనే యువతి వచ్చి నన్ను కలిసింది. ఆమె కియా అనుబంధ సంస్థలో పనిచేస్తుంది. అంతకు ముందు హౌస్ వైఫ్ గా ఉన్న ఆమె ఇప్పుడు కియా అనుబంధ సంస్థలో పనిచేస్తూ నెలకు రూ.30 వేల జీతం సంపాదిస్తుంది. ఆమె కళ్ళలో ఆనందం చూసిన తరువాత నాకు చాలా సంతోషం వచ్చింది.
రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు టిడిపి నాయకుడు తగరకుంట ప్రభాకర్ గారి పిల్లలు నన్ను కలిసారు. 2004 లో వైఎస్ గారు సీఎం అయిన తరువాత తగరకుంట ప్రభాకర్ గారిని దారుణంగా హత్య చేసారు. వారి పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో చదువుకున్నారు. అందరికి ఉద్యోగాలు వచ్చాయి.ప్రభాకర్ గారి చిన్న అమ్మాయి శ్రావణి వచ్చి అన్ని విషయాలు చెప్పి తనకి కూడా బెంగుళూరు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చింది అన్నా అన్నప్పుడు చంద్రన్న లో మానవత్వం గుర్తొచ్చింది.
ప్రకాశం జిల్లా ని ఎడారిగా మార్చాడు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తిచెయ్యలేదు.
గుంటూరు, కృష్ణా నాలుగున్నర ఏళ్లుగా అమరావతి రైతులు, మిర్చి, పత్తి రైతులు పడుతున్న కష్టాలు నేరుగా చూసాను. రాజధానిని చంపేసి జగన్ పడుతున్న రాక్షస ఆనందం చూసాను.
ఉభయగోదావరి జిల్లాల్లో జగన్ ఆక్వా రంగాన్ని ఎలా దెబ్బతీశాడో చూసాను. కొబ్బరి, వరి, పామ్ ఆయిల్ రైతుల బాధలు తెలుసుకున్నాను. గుంతల్లో రోడ్డు ఎక్కడ ఉందా అని వెతుకున్నాను.
రాయలసీమ జిల్లాల ప్రజలు పడుతున్న కష్టాలు చూసిన తరువాత మిషన్ రాయలసీమ ప్రకటించాను. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, హార్టీ కల్చర్ హబ్ గా తయారు చేస్తాం, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారుస్తాం.
ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా మారుస్తాం.
నెల్లూరు లో ఆక్వా రైతుల కష్టాలు చూసాను. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా రూ.1. 50కే యూనిట్ విద్యుత్ అందిస్తాం.
ప్రజా రాజధాని అమరావతి పూర్తి చేస్తాం. మిర్చి,పత్తి రైతులను ఆదుకుంటాం.
ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, కొబ్బరి, వరి, పామ్ ఆయిల్ రైతులకు గతంలో ఇచ్చిన సబ్సిడీలు ఇస్తాం. మేజర్ రోడ్లు అన్ని సిసి రోడ్లు వేస్తాం.
మూడుముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కి ఒక్క ఇటుక వెయ్యలేదు జగన్.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు కొట్టేయడానికి జగన్ స్కెచ్ వేసాడు. అందుకే 31 మంది ఎంపీలు ఉన్నా ప్రైవేటీకరణ ఆపడానికి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని అడగడు, ఏపీలో ఉన్న మైన్స్ ని రెన్యూవల్ చెయ్యడు, విద్యుత్ బిల్లులు విపరీతంగా పెంచేస్తాడు.
విశాఖ రైల్వే జోన్ ఒక్క అడుగు ముందుకు కదల లేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవటం వలనే రైల్వే జోన్ పనులు ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. రైల్వే జోన్ పై పార్లమెంట్ లో పోరాడుతుంది ఒక్క టీడీపీ ఎంపీలు మాత్రమే.
విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని మూలనపడేసింది వైసిపి ప్రభుత్వం. మనం 42 కిలోమీటర్లు అంటే జగన్ వచ్చి 80 కిలోమీటర్ల మెట్రో అన్నాడు. ఇప్పటి వరకూ అసలు డిపిఆర్ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తానని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. ఒక్క ఫ్యాక్టరీ కూడా ప్రారంభించలేదు . చెరుకు పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జగన్ గాలికి వదిలేసాడు.
నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకొక కంపెనీ విశాఖకు వచ్చేది. ఎన్నో కంపెనీలు నేను స్వయంగా ప్రారంభించాను. ఇప్పుడు ఆ కంపెనీలు అన్నీ తరిమేసాడు. కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఐటీ కంపెనీలు అన్ని పక్కరాష్ట్రానికి పరార్.
విశాఖని కేపిటల్ చేస్తానంటూ క్రైం కేపిటల్ చేశాడు.
పరిపాలనా రాజధాని చేస్తానని కబ్జాల రాజధాని చేశాడు..
దసపల్లా భూములు, సిఎన్బిసి భూములు, హయగ్రీవ భూములు,ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, స్వతంత్ర సమరయోధుల భూములు, శివారు ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేసారు. లూలూ ని తరిమేసారు..ఆ భూములు కొట్టేసారు. టిడిఆర్ బాండ్స్ కుంభకోణంలో వేల కోట్లు వైసిపి నాయకులు కొట్టేసారు.
రుషికొండ కు గుండు కొట్టి 500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నాడు.
ఏ2 విజయసాయి రెడ్డి విశాఖను నాశనం చేసాడు.
ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి విశాఖ మన్యంలో లేటరైట్, బాక్సైట్ ను దోచుకుంటున్నాడు.
జివిఎంసి అవినీతికి అడ్డాగా మారిపోయింది. చెత్త ట్యాక్స్ తప్ప ఒక్క రోడ్డు వెయ్యరు, ఒక్క డ్రైనేజ్ కట్టరు.
బొబ్బిలి గ్రోత్ సెంటర్ ను జగన్ చంపేసాడు. రాయితీలు ఇవ్వకపోవడంతో విజయనగరం జిల్లాలో ఉన్న 31 పైగా ఫెర్రో అల్లా యిస్ పరిశ్రమలు మూతపడ్డాయి.
జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా.
జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్.
బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది.
అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు.
మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.
జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను.
అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్.
అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కనదొడ్డి గ్రామానికి చెందిన సరోజ కి రెండు కళ్లు కనిపించవు. ఆమె తమ్ముడికి రైల్వే ఉద్యోగం రావడంతో, అదే రేషన్ కార్డులో సరోజ పేరుందని పెన్షన్ తీసేశారు.ఇది తట్టుకోలేని ఆమె ఆత్మహత్యకి పాల్పడింది..ఇది సైకో జగన్ చేసిన మర్డర్ కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను.
100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.
జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ తెచ్చాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు.
45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు.
ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు.
3132వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం.
మహాశక్తి పథకం కింద…
1)ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు.
2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు బిడ్డలు ఉంటే రూ.30 వేలు.
3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.
జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు.
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.
యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.
టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం.అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు.
జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.
రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది.
మిచౌంగ్ తుఫాను తీవ్రంగా ఉంటుందని పది రోజుల నుంచే కేంద్ర విపత్తు సంస్థలు హెచ్చరించాయి.
దున్నపోతు జగన్ సర్కారు పట్టించుకోలేదు.రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల్లో రూ.10వేల కోట్ల విలువైన పంటలు దెబ్బతింటే కనీసం ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాసే టైం కూడా జగన్ కి లేదు.
రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.
జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు.
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.
పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు. ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు. జగన్ తెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యధాతధంగా ఇస్తాం.
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. అమర్నాధ్ గౌడ్ ని పెట్రోల్ పోసి చంపేసారు. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు బనాయించారు. నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు బీసీలకి ఇచ్చారు.
టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.
దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు.
డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి కొవ్వూరులో మహేంద్ర వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు.
27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.
టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.
జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు.
మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.
జగన్ పనైపోయింది. అందుకే హడావిడిగా ఎమ్మెల్యేలను ట్రాన్స్ ఫర్ చేస్తున్నాడు.
ఒకరి ఇంటి ముందు చెత్త తీసుకొచ్చి ఇంకొకరి ఇంటి ముందు పోసినంత మాత్రానా చెత్త బంగారం కాదు బ్రదర్ జగన్.
జగన్ ఎమ్మెల్యేలను మార్చాలి అంటుంటే జనం జగన్ ని మార్చాలి అంటున్నారు.
మూడే మూడు నెలలు వైసిపి కి అంతిమయాత్ర డేట్ ఫిక్స్ అయ్యింది.
చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మొదట నాకు కాల్ చేసి అండగా నిలిచింది పవనన్న. గుండెల్లో ఎంత బాధ ఉన్నా నువ్వు ప్రజల కోసం పోరాడు అని ప్రజల్లోకి పంపింది మా అమ్మ భువనమ్మ.
టిడిపి కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. వడ్డీతో సహా చెల్లిస్తాం.
చట్టాన్ని ఉల్లఘించిన వారి పేర్లు అన్ని రెడ్ బుక్ లో ఉన్నాయి వారికి శిక్ష తప్పదు.
నా పాదయాత్ర లో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లు, ఇతర కమిటీలు సభ్యులను అభినందిస్తున్నాను.
సైకో పోవాలి… సైకిల్ రావాలి … సైకో పోవాలి… సైకిల్ రావాలి …
మరి మా పవనన్న పవర్ ఫుల్ డైలాగ్ కూడా చెప్పాలి కదా హలో ఏపీ … బై బై వైసిపి. హలో ఏపీ … బై బై వైసిపి