Suryaa.co.in

Telangana

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

– ఈరోజు ప్రామిస్ డే సందర్భంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డికి కోరుతున్నాం
– కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఓడగొట్టారు.
– చబ్బీస్ జనవరి కి రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా ఇస్తామన్నారు ఇప్పటివరకు పది పైసల మంది కూడా అందలేదు

సిద్ధిపేట: కొనాయిపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కెసిఆర్ ఏ ముఖ్య కార్యక్రమాన్ని అయినా ఈ దేవాలయం నుండి ప్రారంభిస్తారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 15 నెలలుగా దేవాలయాలకు నిధులు విడుదల చేయడం లేదు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాట ఇచ్చి మోసం చేశారు.మాట తప్పడం తప్ప మాట నిలబెట్టుకోవడం రేవంత్ రెడ్డికి చేతకాదు.

చబ్బీస్ జనవరి కి రైతు భరోసా అందరు రైతులకు ఇస్తామన్నారు ఇప్పటివరకు పూర్తి చేయలేదు.చబ్బీస్ జనవరి కి ఇందిరమ్మ భరోసా ఇస్తామన్నారు ఇప్పటివరకు వేయలేదు. పది పైసల మంది కూడా అందలేదు.మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడగొట్టారు.కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఓడగొట్టారు.

ఈరోజు ఫిబ్రవరి 11 ప్రామిసస్ డే. ఈ ప్రామిస్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాకే ఎన్నికలకు వెళ్ళాలి.

LEAVE A RESPONSE