– ప్రజ్ఞా ప్రవాహ జాతీయ కన్వీనర్ నందకుమార్
హైదరాబాద్: నేషన్ ఫస్ట్ థింకర్స్ ను ఒకచోట చేరి చర్చించే వేదిక ‘లోక్ మంథన్ 2024’. ఇది రెండేళ్లకోసారి జరిగే నిరంతర కార్యక్రమం. 2016లో భోపాల్ లో జరిగింది. భారతదేశంలోని వలసవాద ఆలోచనలను తొలగించి జాతీయవాద ఆలోచనలు పెంచాలనేది థీమ్. 2018లో రాంచీలో జరిగింది. భారతీయ జ్ఞానపరంపరపై జరిగింది. 2020లో కరోనా కారణంగా చేయలేకపోయాం. 2024లో గువాహతిలో.. లోక విజ్ఞాన్ అంశంపై చర్చించాం. లోక్ అంటే.. అంటే సమాజం, ప్రజలు అనే భావన ఉందని ప్రజ్ఞా ప్రవాహ జాతీయ కన్వీనర్ నందకుమార్
అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
మెయిన్ స్ట్రీమ్ లో ‘లోక్’, ‘ఫోక్’ (జానపదం) వంటి పదాలను.. అశాస్త్రీయం, అవిద్య, అనాగరిక పదాలుగా అర్థాలు సృష్టించారు. కానీ లోక్ అనేది శాస్త్రీం, నాగరికం అనే పదాలుగా అర్థం. దీన్ని ఉద్దేశపూర్వకంగానే మార్చారని తెలిపారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే.. లోక్ అంటే.. We the people అనే అర్థం ఉంది.
మనందరం అని అర్థం. లోకమంథన్ కూడా.. మనందరి ఆలోచనలు, మనందరి భవిష్యత్తు, మన సంస్కృతి, సంప్రదాయాలు, మన విధానాలు, మన జీవన విధానం, తదితర అంశాలపై చర్చించాలనేది మా ఆలోచన.
200కు పైగా ఎగ్జిబిషన్ పెవిలియన్స్ ఉన్నాయి. ఈసారి విదేశాలనుంచి కూడా.. చాలా మంది మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. వారి కళల ప్రదర్శన కూడా ఉంటుంది. ఇది ఈసారి లోకమంథన్ ప్రత్యేకత. రామాయణ్ ఆధారంగా.. ఎక్కువ కళలను రూపొందించుకున్న దేశం ఇండొనేషియా.. ఇలాంటి వివిధ సంస్కృతులున్న దేశాలు ఈసారి భాగస్వామ్యం అవుతున్నాయి.
లోకమంథన్ లో సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంతోపాటుగా.. 13 కీలకమైన అంశాలపై మేధోమథనం కూడా ఉంటుంది. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తారు.
The Largest cultural festival of Bharatలో మీరంతా భాగస్వాములై.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. హైదరాబాద్ లోని శిల్పారామంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. తెలంగాణ సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారందరికీ ప్రవేశం ఉచితం. దయచేసి.. అందరూ పాల్గొనాలి. రోజూ లక్షమంది ఇందులో పాల్గొంటారని అంచనా వేస్తున్నాం.