సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించిన లోకేష్

152

– కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ.
– సుబ్రహ్మణ్యం తల్లి, భార్య తో మాట్లాడి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ
– గతంలోనే చంపేస్తామని బెదిరించారు. నిన్న తీసుకెళ్లి చంపేశారు
– న్యాయం జరిగే వరకూ పోరాడతామని లోకేష్ తో అన్న సుబ్రహ్మణ్యం భార్య

ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడ్ని అన్యాయంగా చంపేశారు. ఎమ్మెల్సీ అనంత బాబు ని తక్షణమే అరెస్టు చేయాలి. జరిగింది ఒకటైతే కట్టు కథ అల్లి, కేసును తప్పుదోవ పట్టిస్తూ, వైసిపి ప్రజాప్రతినిధిని కాపాడే విధంగా పోలీసులు వ్యవహరించడం దారుణం. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం.

ఎమ్మెల్యే అనంత బాబే హత్య చేశాడని జరిగిన ఘటన గురించి లోకేష్ కి వివరించిన సుబ్రహ్మణ్యం తల్లి, భార్య. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న మాపై పోలీసులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్యం భార్య. జరిగింది ఒక్కటైతే పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే విధంగా ప్రమాదం గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే చంపేస్తామని బెదిరించారు. నిన్న తీసుకెళ్లి చంపేశారు. మాకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని లోకేష్ తో అన్న సుబ్రహ్మణ్యం భార్య.